వేసవి సంజీవని కొబ్బరి నీళ్లు.. వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు..!

వేసవి సంజీవని కొబ్బరి నీళ్లు.. వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు..!

కొబ్బరి (coconut)..  ఇది ఓ ప్రకృతి వరప్రసాదం. పూర్వకాలం నుండీ కొబ్బరిని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్స్, అమైనో యాసిడ్లు, సైటోకైనిన్లు ఇలా.. ఎన్నో పోషకాలుంటాయి. ఇన్ని పోషకాలున్నా.. కొబ్బరిలో ఉండే క్యాలరీలు మాత్రం చాలా తక్కువ. కానీ కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యం, అందం, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. ఇంతకీ కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి (Health) ఎలా ఉపయోగపడతాయో మనమూ ఈ కథనంలో తెలుసుకుందామా..


డయాబెటిస్ తగ్గుదల


కొబ్బరి నీళ్లు తాగడం డయాబెటిస్ రోగులకు ఎంతో మంచిది. పలు పరిశోధనల ప్రకారం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఇందులో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో డయాబెటిస్ కూడా తగ్గుతుంది.


flat


మెటబాలిజం రేటు పెంపుదల


మన మెటబాలిజం బాగుంటే.. మనం శరీరం కరిగించే క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మన బరువు కూడా పెరగకుండా ఉంటుంది. కొబ్బరినీటిలోని మాంగనీస్ మెటబాలిజంని అదుపులో ఉంచుతుంది. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించేవారు.. కొబ్బరి నీళ్లను కూడా ప్రయత్నించి చూడడం మంచిది.


కండరాల సమస్యలకు పరిష్కారం


సాధారణంగా అప్పుడప్పుడూ మన కాళ్ల వెనుక వైపు కండరాలు పట్టేసి.. చాలా నొప్పి పుడుతుంది కదా. సాధారణ భాషలో దీన్ని పిక్కలు పట్టేయడం అని అంటుంటారు. మన శరీరంలో పొటాషియం స్థాయులు తగ్గినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్య మీకు ఎదురైతే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. కొబ్బరిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. కొబ్బరి నీళ్లు నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.


glow


బ్యూటీ బూస్టర్‌


కొబ్బరి నీళ్లు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని బ్యూటీ బూస్టర్స్ అనడంలో తప్పులేదు. కొబ్బరి నీళ్లు తాగడం లేదా శరీరానికి రుద్దడం వల్ల ఎన్నో చర్మ సమస్యలు తగ్గుతాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల చర్మంలో తేమ నిలిచి ఉంటుంది.. కాబట్టి  ఎంతో తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే మొటిమలు, మచ్చలను కూడా తగ్గిస్తుంది. కనుక క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.


డీహైడ్రేషన్ తగ్గుదల


ఎండాకాలంలో మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీన్నే డీహైడ్రేషన్ అంటూ ఉంటాం. ఈ సమస్యను తగ్గించడానికి కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. ఇది మన శరీరం కోల్పోయిన నీటితో పాటు, ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి అందిస్తుంది. అందుకే ఎండాకాలంలో వీలుంటే రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండచ్చు.


long hair6 6569403


కేశ సంరక్షణ


ముఖ వర్చస్సును పెంపొందించడంతో పాటు.. అందంగా కేశాలను మెరిసేలా చేయడం కొబ్బరి వల్లే సాధ్యం. కొబ్బరి నీళ్లు నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తాయి. అందుకే మీ నిర్జీవమైన వెంట్రుకలను.. కొబ్బరి నీళ్లతో తడిపి మెరిసేలా చేయవచ్చు. దీని కోసం తలస్నానం చేసిన తర్వాత.. కుదుళ్లు తడిసేలా కొబ్బరి నీళ్లతో మర్దన చేసి.. కాసేపు ఆగి మళ్లీ నీళ్లతో జుట్టును కడిగేస్తే సరిపోతుంది. అంతేకాదు.. తరచూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి మాత్రమే కాదు.. జుట్టు కుదుళ్లకు కూడా రక్త ప్రసరణ బాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఊడడం తగ్గుతుంది. అంతేకాదు.. వెంట్రుకలు చిట్లే సమస్యను కూడా నియంత్రించవచ్చు.


గ్యాస్ సమస్య తగ్గుదల


మనం సాధారణంగా సన్నగానే ఉన్నా గ్యాస్ సమస్య ఉంటే.. పొట్ట ఎప్పుడూ లావుగా ఉబ్బినట్లుగా కనిపించడం సహజం. ఈ సమస్యకు కొబ్బరి నీళ్లు మంచి పరిష్కారం. కొబ్బరిని ఆహారంలో భాగంగా తీసుకున్నా లేదా తరచూ కొబ్బరినీళ్లు తాగినా గ్యాస్ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. దీనికి కారణం మన శరీరంలో సోడియం ఎక్కువవడమే. కొబ్బరి నీళ్లలో ఎక్కువగా ఉండే పొటాషియం సోడియంని తగ్గిస్తుంది. అందుకే గ్యాస్ సమస్య ఉన్నవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది.


ఇవి కూడా చదవండి


ఇలా చేస్తే మీ పొట్టి జుట్టు కూడా.. పొడుగ్గా కనిపిస్తుంది..!


ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!


ట్యాన్‌తో బాధపడుతున్నారా? ఈ చిట్కాలతో దాన్ని ఇట్టే దూరం చేసుకోవచ్చు..!