ప్రేమలో పడిపోవడం చాలా సులువు. నేనైతే రోజూ ప్రేమ (love)లో పడిపోతాను. అయితే రోజూ నా ప్రేమ ఒకేలా ఉండదు.. ఆశ్చర్యపోతున్నారా? నిజం. ఈ రోజు నేను బిర్యానీని ప్రేమిస్తే.. రేపు పానీపురీని ఇష్టపడతా.. మొత్తంగా చెప్పాలంటే నేను ఆహారాన్ని(Food) ప్రేమించినట్లు ఎవరినీ ప్రేమించను.. ప్రేమించలేను. అయితే నా సమస్యేంటంటే.. నాకు ఆహారం అంటే ఎంతో ఇష్టమైనా నాకు వంట చేయడం రాదు.. నేను వంట చేయడానికి ప్రయత్నిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి, మీకూ నాలాగా ఫుడ్ అంటే ఇష్టమై.. వంట చేయడం రాకపోతే మీరు ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయో చూద్దాం రండి..
1. మీకు మాస్టర్‌చెఫ్ చూడడం అంటే ఎంతో ఇష్టం..
మీరు రుచికరమైన భోజనం వండలేకపోతే ఏంటి? ఎవరైనా భోజనం తయారుచేస్తే దాన్ని చూడడం మీకు ఎంతో ఇష్టం. అందుకే టీవీలో మాస్టర్‌చెఫ్, అభిరుచి వంటి వంటల ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు.
2. భోజనం చేసేటప్పుడు చెక్ చేయడం మీ అలవాటు..
మీరు బయటకు వెళ్లి తింటున్నప్పుడల్లా ఆ వంటకంలో ఏయే పదార్థాలు ఉపయోగించారో తెలుసుకోవడానికి దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. ఏదైనా ఒకరోజు మీరు వంట చేసినప్పుడు ఈ పదార్థాలన్నింటినీ అందులో ఉపయోగించాలని అనుకుంటారు. కానీ మీరు రుచికరమైన వంట చేయడం కల అని మీక్కూడా తెలుసు.
3. అన్నింటి గురించీ మీకు తెలుసు..
వంట ఒక్కటీ రాదు కానీ మీకు అన్ని రకాల మసాలా దినుసులు, కూరగాయలు ఇతర వస్తువుల గురించి బాగా తెలుసు. అంతే కాదు.. మామూలు కూరగాయలకు , ఆర్గానిక్ కూరగాయలకు మధ్య తేడా కూడా మీకు తెలుసు.
4. ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమై ఉంటారు.
చాలాసార్లు మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీకు వంట చేయాలన్న మోటివేషన్ వచ్చి వంట చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు. అయితే ఆఖరికి మీకు మిగిలేది ఓ బౌల్ కార్న్‌ఫ్లేక్స్ లేదా చక్కటి మ్యాగీ.. అయితే ఏంటి? మీరు ప్రయత్నమైతే చేశారు కాబట్టి ఆనందంగా ఫీలవుతారు.
5. యూట్యూబ్ వీడియోలు మీకెంతో ఇష్టం..
వంట రాదు.. కానీ నేర్చుకోవాలన్న మీ తపన ఎప్పటికీ ఆగదు. అందుకే ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ వంట నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. మీరు యూట్యూబ్ లేదా ఫేస్‌బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా నోరూరించే వంటకాల వీడియోలు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇందులో చాలా వీడియోలను మీరు ఒక రోజు వంట చేసినప్పుడు ప్రయత్నించడానికి సేవ్ చేసి పెట్టుకుంటారు.
6. నూడిల్స్ మీకు నచ్చిన.. వచ్చిన.. రెసిపీ..
మీకు చక్కగా చేయడం వచ్చిన రెసిపీలు ఒకటో రెండో ఉంటాయి. అందులో నూడుల్స్ తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఎప్పుడూ ఒకే రకం రెసిపీ ప్రయత్నిస్తారా? ఏంటి? ఓసారి సోయా సాస్ వేస్తే.. మరోసారి టోమాటో సాస్.. ఇంకోసారి ఆరిగానో.. ఇలా రకరకాల నూడిల్స్ ప్రయత్నిస్తూ ఉంటారు.
7. హోటల్స్‌కి వెళ్లేందుకు పొదుపు చేస్తారు.
కొత్త కొత్త హోటళ్లలో వివిధ రకాల వంటకాలు ప్రయత్నించడం అంటే మీకెంతో ఇష్టం. దీని కోసం మీరు డబ్బులు పొదుపు కూడా చేస్తుంటారు.
8. ఇంట్లో అన్నీ ఉన్నా..
మీ ఇంట్లో రకరకాల వంటకాలు చేయడానికి సరిపడా సామాను ఉంటుంది. అయితే దాన్ని చేయడం మీకు సరిగ్గా రాకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోయి పాడైపోతాయి. మీరు మాత్రం హోటల్ నుంచి మంచి వంటకాలు ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు.
9. అలాంటివారంటే మీకెంతో ఇష్టం..
చక్కగా నోరూరించే వంటకాలు వండే వాళ్లంటే మీకెంతో ఇష్టం. వారితో స్నేహం చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. నెలాఖరులో మీ దగ్గర డబ్బులు లేనప్పుడు వారు వండిన వంటకాలే మీ కడుపు నింపుతాయి.
10. స్ట్రీట్‌ఫుడ్ మీ ఫేవరెట్
స్ట్రీట్‌ఫుడ్ అయితే తక్కువ ఖర్చుతో రుచికరమైన భోజనం తినే వీలుంటుంది. అందుకే మీకు ఎక్కువగా స్ట్రీట్‌ఫుడ్ అంటే ఇష్టం..!
ఇవి కూడా చదవండి.
ఈ ఫన్నీ ఫీలింగ్స్.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక.. మీకూ వచ్చాయా..?
మీరూ బిర్యానీ ప్రియులేనా? అయితే ఇవి మీ జీవితంలోనూ జరుగుతుంటాయి..
ఈ రెసిపీలతో మీ వాలెంటైన్‌కి.. రొమాంటిక్ సర్‌ప్రైజ్ ఇవ్వండి..
Gifs : giphy.