సెక్స్ (Sex).. ఆలుమగల బంధాన్ని మరింత బలపరుస్తూ ఇద్దరినీ ఒకటి చేసే ప్రక్రియ. అయితే దీనిని బాగా ఎంజాయ్ చేయాలంటే ఏ ఒక్కరి ఇష్టంతోనో కాకుండా.. దంపతులిద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ లైంగికంగా కలవడం ద్వారా మాటల్లో చెప్పలేని అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. స్వర్గపు అంచులను తాకవచ్చు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
అసలు మీ భాగస్వామి మీతో కలిసి గడిపే ఈ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారా?? లేదా?? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా?? వచ్చింది కానీ.. దీనికి సమాధానం మాకు తెలీదు అంటారా?? అయితే మీ భర్తను కాస్త గమనిస్తే చాలు.. ఆయన ఇచ్చే కొన్ని సంకేతాల ద్వారా ఏమీ చెప్పకుండానే మీతో సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారా? లేదా?? అన్నది ఇట్టే తెలిసిపోతుందట.. మరి, ఇంతకీ ఆ సంకేతాలేవంటే..
మిమ్మల్ని తాకిన వెంటనే..
మీ భర్త మీతో కలిసి గడిపే లైంగికపరమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లైతే మీ స్పర్శని కూడా బాగా ఇష్టపడతారు. అంతేకాదు.. మీరు ఆయన్ని తాకినా లేదా ఆయనే మిమ్మల్ని తాకినా.. అతికొద్ది సమయంలోనే అతనిలో సెక్స్ చేయాలన్న కోరికలు కలుగుతాయి. దాంతో మిమ్మల్ని వారి బిగి కౌగిలిలో బంధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆలుమగలిద్దరి మధ్యా ఎంత ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు ఉంటే వారి మధ్య బంధం కూడా అంతే గట్టిగా ఉంటుంది. అందుకే మీ స్పర్శ తగిలిన తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని వారి చేతుల్లోకి తీసుకుందామా.. పడక గదిలోకి తీసుకెళ్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు.
సెక్స్ తర్వాత..
సాధారణంగా సెక్స్‌లో పాల్గొన్న తర్వాత చాలామంది ఎవరి దారిన వారు అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. లేదా నిద్రపోతూ ఉంటారు. కానీ మీ సాన్నిహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేసే వారైతే సెక్స్ తర్వాత కూడా మిమ్మల్ని తమ ప్రేమలో మునిగితేలేలా చేస్తారు. చిన్న పిల్లలను ముద్దు చేసినట్లు ముద్దు చేయడం లేదా మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడం.. వంటివి చేస్తుంటారు. మీకు ఇలాంటి సంకేతం ఏమైనా మీ భర్తలో కనిపిస్తే మాత్రం ఆయన మీతో సెక్స్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే..
రొటీన్‌గా మారిపోతుంది..
మీ భర్త మీతో సెక్స్‌లో పాల్గొనడం ఒక రొటీన్‌గా మార్చుకున్నారంటే.. దాని అర్థం మీతో సెక్స్ లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే. ఆయన మిమ్మల్ని అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టే.. మీతో ఎక్కువసార్లు లైంగిక చర్యలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకోండి. అంటే సెక్స్ లైఫ్ రొటీన్‌గా మారడం కూడా మీ సుఖ, సంతోషకరమైన దాంపత్యానికి ఒక సంకేతంగానే భావించవచ్చు.
ముద్దుల వర్షం..
ముద్దులంటే కేవలం పెదవుల పై మాత్రమే కాదు.. బుగ్గలు, మెడ, నుదురు, చేతులు.. ఇలా ఎక్కడైనా సరే.. శరీరమంతటా తన పెదవులతో ముద్దాడాలని ప్రతి భర్త ఆశిస్తాడు. సాధారణంగా ఈ ముద్దుల వర్షంతో మొదలుపెట్టి మెల్లగా రతిక్రీడను ప్రారంభించడం చాలామంది చేసే పనే. అయితే సెక్స్‌లో పాల్గొనడం పూర్తైన తర్వాత కూడా.. మీ భర్త మిమ్మల్ని ప్రేమగా ముద్దాడుతుంటే మాత్రం మీరు తప్పకుండా సంతోషించాల్సిందే. ఎందుకంటే ఆయన మీతో సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడానికి ఇదీ ఒక సంకేతంగా భావించవచ్చు.
మిమ్మల్ని సంతోషపరచడం కూడా..
సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయడమంటే.. తనకు కావాల్సిన సుఖం మాత్రమే పొందడం కాదు.. భాగస్వామిని సంతోషపరచడం కూడా అంతే ముఖ్యంగా భావిస్తారు. ముఖ్యంగా భార్యతో సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేసే వారు దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తారు కూడా. ఇందులో భాగంగానే నోటితో ఆయా భాగాలను తాకడం.. ద్వారా మీకు సంతోషం కలిగేలా చేసేందుకు ప్రయత్నిస్తారు.
బెడ్ పరిశుభ్రంగా..
సాధారణంగా పురుషులు వారు ఉండే గదిలోని వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. కానీ సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేసేవారు మాత్రం తమ బెడ్‌ని చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటారట. తద్వారా భార్య తమతో సెక్స్‌లో పాల్గొనేందుకు సౌకర్యవంతంగా ఫీలవుతుందని భావిస్తారు.
తదేకంగా చూస్తారు..
చుట్టూ ఎంతమంది అందగత్తెలు ఉన్నా మీ భర్త కంటికి.. మీరు మాత్రమే అందంగా కనిపిస్తున్నారంటే దాని అర్థం మిమ్మల్ని ఆయన పిచ్చిగా ఇష్టపడుతున్నారని, మీ సాంగత్యాన్ని అంత బలంగా కోరుకుంటున్నారని తెలుసుకోండి. మీ నుంచి మీ భర్త తన చూపుని మరల్చుకోలేకపోవడమే కాదు.. మిమ్మల్నే తదేకంగా చూస్తూ ఎంతసేపైనా గడిపేస్తారు. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తడి దుస్తులు లేదా టవల్‌తో ఉన్న మిమ్మల్ని చూస్తే ఇక అంతే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మేం వేరే చెప్పాలా??
సెక్స్టింగ్..
మీతో ఉన్నప్పుడే కాదు.. పగటి సమయంలో మీకు దూరంగా ఉన్నా సరే.. మీ భర్త ఊహల్లో మీరు ఉంటున్నారంటే మిమ్మల్ని ఆయన అంతగా ఇష్టపడుతున్నారని అర్థం. ఆ ఇష్టం, ప్రేమ మీకు తెలియజేసేందుకు మిమ్మల్ని మిస్ అవుతున్నట్లుగానో లేక రాత్రి మీ మధ్య జరిగిన రతి క్రీడలోని చిలిపి అంశాల గురించో మీకు సెక్స్టింగ్ కూడా చేస్తున్నారా?? అయితే మీ లైంగిక జీవితంతో ఆయన సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఇదీ ఒక సంకేతమే.
మీ పేరే పిలుస్తూ..
సాధారణంగా సెక్స్‌లో పాల్గొనేటప్పుడు చాలామంది కాస్త గట్టిగా అరవడం, తీయగా మూలగడం.. వంటివి చేస్తుంటారు. కానీ మీ భర్త మాత్రం మీ పేరే జపిస్తున్నారా?? అయితే మీరు లక్కీ. ఎందుకంటే సెక్స్ లైఫ్‌తో ఆయన ఆనందంగా ఉన్నారని చెప్పడానికి ఇదీ ఒక సంకేతమే. ముఖ్యంగా మీతో కలిసి లైంగిక చర్యలో పాల్గొనే సమయంలో ఆ ఆనందాన్ని అదుపు చేసుకోలేక మీ పేరునే బిగ్గరగా మళ్లీ మళ్లీ చెబుతుంటారు.
నిశ్శబ్దంగా ఉంటున్నారా??
మీ లైంగిక జీవితం గురించి మీ భర్త మీతో ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటున్నారా?? అయితే ఇది కూడా మీ సెక్స్ లైఫ్ బాగుందని చెప్పడానికి ఒక సంకేతంగా భావించవచ్చు. ఎందుకంటే లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత.. పురుషులు ఏమాత్రం గిల్ట్ ఫీలైనా.. దానిని ఏదో ఒక రకంగా భార్యకు తెలిసేలా చేస్తారు. అలా కాకుండా ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉన్నారంటే వారు సెక్సువల్ లైఫ్‌లో మీతో హ్యాపీగా ఉన్నట్లే..
ప్రకాశవంతంగా కనిపిస్తారు..
మీతో సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మీ భర్త చాలా సంతోషంగా, ప్రకాశవంతంగా కనిపిస్తున్నారా?? ఇది కూడా వారు సెక్సువల్ లైఫ్‌లో ఆనందంగా ఉన్నారని పరోక్షంగా చెప్పే సంకేతమే. కాబట్టి ఒక్కసారి వారి కళ్లలోకి చూస్తూ మీపై వారికి ఉన్న ప్రేమను తెలుసుకోండి.. మరింత సహకరిస్తూ ఇరువురూ రసికానందాన్ని సొంతం చేసుకోండి.
ఇవి కూడా చదవండి
లైంగిక కోరికలు తగ్గడానికి.. ప్రధాన కారణాలేమిటో తెలుసా..?
తొలిరాత్రిని బాగా ఎంజాయ్ చేయాలా?? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..