ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని.. వీల్ ఛెయిర్లో వచ్చి ఐఏఎస్ పరీక్ష రాసింది..!

ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని.. వీల్ ఛెయిర్లో వచ్చి ఐఏఎస్ పరీక్ష రాసింది..!

అనుకొన్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి నిలవాలని, ధైర్యంగా పోరాడాలనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ వాటిని ఎదుర్కోలేక మధ్యలోనే తమ ప్రయాణాన్ని ఆపేసేవారెందరో మనకు కనిపిస్తారు. కానీ లతీషా అన్సారీ (Latheesha Ansari) మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. అవయవాలు సరిగా పనిచేయకపోయినా.. ఆరోగ్యం సహకరించకపోయినా.. తాను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు పోరాడుతోంది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. దృఢ సంక‌ల్పంతో వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతుంది. ఇంతకూ ఆమె ఏం చేసిందనే కదా మీ సందేహం? మన దేశంలో ఎంతోమందికి ఓ కల అయిన యూపీఎస్సీ (UPSC) ప్రిలిమనరీ పరీక్ష రాసింది. అది కూడా వీల్ చెయిర్లో కూర్చొని, ఆక్సిజన్ సిలిండర్ సాయంతో గాలి పీలుస్తూ. ఆశ్చర్యంగా ఉంది కదా.. అయితే గుండెను బరువెక్కించే.. మనలో స్ఫూర్తి నింపే లతీషా అన్సారీ కథ మీరు తెలుసుకోవాల్సిందే.

కేరళలోని కొట్టాయంకు చెందిన లతీషా అన్సారీకి పుట్టుకతోనే ఎముకలకు సంబంధించిన వ్యాధి ఉంది. ఆమె టైప్ 2 ఆస్టియోజెనెసిస్ ఇంపెర్పెక్టాతో బాధపడుతోంది. ఈ వ్యాధికి గురైన వారి ఎముకలు పెలుసుబారిపోతాయి. ఎదుగుదల ఉండదు. దీనికి తోడు గతేడాది నుంచి ఆమె శ్వాస సంబంధ సమస్యను సైతం ఎదుర్కొంటోంది.

దీని కారణంగా ఆమె గాలి పీల్చుకోలేదు. జీవితాంతం కృత్రిమంగా శ్వాస తీసుకోవాల్సిందే. ఆమె వైద్యపరమైన చికిత్సల కోసం నెలకు పాతిక వేల రూపాయల వరకు ఖర్చవుతుందట. దీని కోసం వారు తమకు తెలిసినవారందరి దగ్గర అప్పులు చేయాల్సి వస్తుందంటున్నారు ఆమె తల్లిదండ్రులు.

ADVERTISEMENT

1-atheesha-ansari-ias-aspirant

ఇన్ని ఇబ్బందులుంటేనేమి.. ఆత్మ విశ్వాసంతో ఎంకాం పూర్తి చేసింది లతీషా. సివిల్ సర్వీస్ పరీక్షలు రాయడానికి సన్నద్ధమైంది. ఐఏఎస్ అవ్వాలనేది లతీషా ఆశయం. దాన్ని సాధించే క్రమంలో ఎదురవుతున్న ఆటంకాలను ఆమె తన గుండె ధైర్యంతోనే ఎదుర్కొంటున్నారు. గత ఏడాదిన్నరగా సివిల్స్ కోసం ప్రిపేరవుతున్న లతీషా.. తాజాగా కేరళ రాజధాని తిరువనంతపురంలో యూపీఎస్సీ పరీక్షలు రాశారు.

ఆమె పట్టుదలను గుర్తించిన కొట్టాయం జిల్లా కలెక్టర్ పీఆర్ సుధీర్ బాబు లతీషా కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ అందించే పోర్టబుల్ పరికరాన్ని పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేశారు. దాని సాయంతోనే శ్వాస తీసుకొంటూ ఆమె పరీక్ష రాశారు. అంతేకాదు.. అలాంటి పరికరాన్నే ఆమెకు ఉచితంగా అందజేస్తామని కలెక్టర్ హామీ సైతం ఇచ్చారు.

అయితే పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లడంతో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ (పోర్టబుల్ పరికరం) ఆమెకు సకాలంలో అందలేదు. దీంతో ఆమె తన వెంట తెచ్చుకొన్న ఆక్సిజన్ సిలిండర్‌ సహాయంతోనే మొదటి పరీక్ష రాశారు. ఆ తర్వాత అధికారులు ఆమెకు కావాల్సిన పరికరాన్ని అందించారు. మలయాళంలో ఐచ్ఛికంగా యూపీఎస్సీ పరీక్షలు రాశారు.

ADVERTISEMENT

2-latheesha-ansari-ias-aspirant

లతీషాతో పాటు మరో వ్యక్తి కూడా తనకెదురైన ఇబ్బందులను సైతం అధిగమించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. అతనే సెహీన్. ఆయన రుమాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. క్రచెస్ సాయంతో పరీక్ష కేంద్రానికి వచ్చిన సెహిన్ ప్రస్తుతం ఇంటర్ కాలేజ్ క్రికెట్ కామెంటేటర్‌గా పనిచేస్తున్నారు. సెహీన్ సైతం ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నారు.

వీరిద్దరూ శారీరకపరమైన ఇబ్బందులను.. మాననసిక బలంతో అధిగమించిన వారే. ఎంత కష్టమైనా సరే.. లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో ఉన్నవారే. వీరిద్దరూ అందిస్తున్న స్ఫూర్తిని మనం కూడా అందుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొనే ప్రయత్నం చేద్దాం.

Featured Image: Facebook

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి:

మన రాజమండ్రి అమ్మాయి.. ఐసీసీ చరిత్రలోనే తొలి మహిళా రిఫరీ..!

79 ఏళ్ల నుంచి కరెంట్ లేకుండా జీవిస్తోన్న ప్రొఫెసర్ .. చాలా గ్రేట్ కదా..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

03 Jun 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT