ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
వర్జినిటీ గురించి ప్రతి అమ్మాయి.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

వర్జినిటీ గురించి ప్రతి అమ్మాయి.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

ప్రస్తుతం సెక్స్ (sex) ఎడ్యుకేషన్ గురించి టీనేజ్ పిల్లలకు కూడా కాలేజీల్లో బోధించే రోజులొచ్చేశాయి. కనుక ప్రతిఒక్కరికీ లైంగిక విద్య గురించి తెలుసుకోవడం ఆవశ్యకమైపోయింది. అయితే లైంగికత మీద జరిగినంత చర్చ..  వర్జినిటీ virginity (కన్యత్వం) లాంటి అంశాలపై జరిగినట్లు కనిపించదు. చివరికి ఆడపిల్లలు కూడా తమ స్నేహితురాళ్లతో మాట్లాడేటప్పుడు..  సెక్స్ అంటే ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి అంశాలను మాత్రమే ప్రస్తావిసారట. కానీ హైమన్ పొర, యోనికి సంబంధించిన కొన్ని సందేహాలను తీర్చుకొనేది మాత్రం చాలా తక్కువ మందే అని పలు సర్వేలు చెబుతున్నాయి.

చాలామందికి హైమన్ పొర పైకి కనిపించదు కాబట్టి.. మొదటిసారి సెక్స్ చేసినప్పుడు అది చిరుగుతుందా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. కానీ ఎవరికీ దానికి సంబంధించిన అంశాలు పెద్దగా తెలీవు. కాబట్టి మీ స్నేహితురాళ్లు కూడా మీకు వాటి గురించి సమాధానం చెప్పలేరు. అందుకే ఈరోజు ఇదే అంశానికి సంబంధించి పలు వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

ADVERTISEMENT

1. హైమన్ చిరిగిపోదు..

సాధారణంగా చాలామంది వర్జినిటీ కోల్పోవడమంటే.. హైమన్ పొర చిరిగిపోవడమని చాలామంది భావిస్తుంటారు. కానీ హైమన్ చిరిగిపోవడం అంటూ ఏమీ ఉండదట. ఇది మన యోనిలో ఉండే ఓ సన్నని పొర. ఇందులో ముందు నుంచి రుతుస్రావం సమయంలో విడుదలయ్యే రక్తం లేదా యోనిలోని ద్రవాలు బయటకు వెళ్లేలా ఓ చిన్నరంధ్రం ఉంటుంది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఇది ఇంకాస్త వెడల్పుగా మారుతుంది. అంటే సెక్స్‌లో పాల్గొని వర్జినిటీ పోగొట్టుకోవడం అంటే హైమన్ పొర మొత్తం చిరిగిపోవడం మాత్రం కాదని మనం గుర్తుంచుకోవాలి.

2. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది..

హైమన్ మన శరీరంలోని ఓ భాగం. మిగిలిన అన్ని భాగాల్లాగే అది కూడా మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకూ మన శరీరంలోనే ఉంటుంది. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత హైమన్ పొర చిరిగిపోవడం, మాయమైపోవడం వంటిదేమీ ఉండదు.

ADVERTISEMENT

3. కాస్త వార్మప్ అవసరమే..

మీరు మొదటిసారి సెక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంటే.. అంతకంటే ముందు కాస్త ప్రాక్టీస్ చేయడం మంచిది. అదేంటి? అనుకుంటున్నారా? అవును.. ఒకేసారి సెక్స్‌లో పాల్గొనడం కాకుండా ముందు కొన్ని సార్లు హస్తప్రయోగం (మాస్టర్బేషన్) చేసుకోవడం మంచిది. అంతేకాదు.. సెక్స్‌కి ముందు కాస్త ఫోర్ ప్లే కూడా ఉండేలా చూసుకోవాలి.

దీని వల్ల మీరు సెక్స్ చేసే సమయంలో సౌకర్యంగా ఉండగలుగుతారు. సెక్స్ సమయంలో ఎలాంటి నొప్పి కలగకుండా ఉంటుంది. సాధారణంగా మొదటిసారి సెక్స్ చేసినప్పుడు హైమన్ చిరగడం వల్ల నొప్పి వస్తుందనుకుంటారు. కానీ దానికి కారణం యోని కండరాలు బిగుసుకుపోయి ఉండడం మాత్రమే. ఈ చిట్కాలు పాటిస్తే నొప్పి రాకుండా సెక్స్‌లో పాల్గొనే వీలుంటుంది.

ADVERTISEMENT

4. సెక్స్ కంటే ముందే..

మీకు ఇప్పటికే ఈ విషయం సినిమాలు లేదా వీడియోల ద్వారా తెలిసే ఉంటుంది. హైమన్ పొర చిరగడానికి కారణం కేవలం సెక్స్ మాత్రమే కాదు.  ఇంకా చాలా కారణాలుంటాయి. ఒకవేళ మీకు సైకిల్ తొక్కే అలవాటున్నా.. లేక మీరు అథ్లెట్ అయినా.. లేక ఆటల్లో విరివిగా పాల్గొంటున్నా హైమన్ పొర చిరిగే అవకాశం ఉంది. ఇలాంటి అలవాట్లు మీకుంటే మొదటిసారి సెక్స్  పాల్గొనేటప్పుడు రక్తం రాలేదని, హైమన్ చిరగలేదని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆటలాడుతున్నప్పుడు ఎప్పుడో మీ హైమన్ వెడల్పుగా మారి ఉంటుందనే విషయాన్ని తెలుసుకోండి. 

5. బ్లీడింగ్ తప్పనిసరి కాదు..

ముందే చెప్పుకున్నట్లుగా మీ హైమన్ పొర సెక్స్ కంటే ముందే వెడల్పుగా మారి ఉండొచ్చు. అంతేకాదు.. మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు బ్లీడింగ్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీ హైమన్ ముందుగానే వెడల్పుగా మారిపోయి ఉంటే సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండదు.

ADVERTISEMENT

6. మొదటిసారి గర్భం వస్తుందా?

మొదటిసారి సెక్స్‌లో పాల్గొన్నా లేదా అంతకు ముందే ఆ అనుభవం ఉన్నా .. ప్రతీసారి కండోమ్ ఉపయోగించడం మంచిది. దీని వల్ల మీకు గర్భం వచ్చే అవకాశం ఉండదు. గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రం.. కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే సరిపోతుంది.

7. సెక్స్ వల్ల పెద్దగా మార్పు రాదు..

సెక్స్‌లో పాల్గొనడం.. వర్జినిటీని పోగొట్టుకోవడం వల్ల మనలో పెద్దగా మార్పేమీ రాదు. సెక్స్ సంబంధిత సమస్యలు ఒకవేళ మీ భాగస్వామికి ఉంటే.. అవి మీకు కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. అలాగే రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనడం వల్ల కొన్ని హార్మోన్ల మార్పులు తప్ప.. మీ శరీరంలో ఎలాంటి మార్పులు రావు. మిమ్మల్ని చూసి ఏ ఒక్కరూ మీరు సెక్స్‌లో పాల్గొన్నారా? లేదా? అని చెప్పలేరు.

ADVERTISEMENT

8. వర్జినిటీని మెడికల్‌గా ప్రూవ్ చేయలేరు..

సాధారణంగా సినిమాల్లో చూపించినట్లు ఏ మెడికల్ టెస్టులతోనూ అమ్మాయి కన్య అవునా? కాదా? అంటే సెక్స్‌లో పాల్గొందా? లేదా? అని నిరూపించడం చాలా కష్టం. హైమన్ పొర వెడల్పుగా మారేందుకు సెక్స్ మాత్రమే కారణం కాదు కాబట్టి.. దాన్ని కన్యత్వానికి ప్రతీకగా చూపించలేం.

ADVERTISEMENT

9. హైమన్ పొరను తిరిగి మామూలుగా చేయచ్చు..

హైమన్ పొర వెడల్పుగా మారినా తిరిగి మామూలుగా చేయచ్చు అంటే ఫన్నీగా అనిపిస్తుంది. కానీ అది నిజం. హైమెనోరఫీ అనే మెడికల్ ప్రక్రియ ద్వారా హైమన్ పొరను రిపేర్ చేసే వీలుంటుంది. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. కాబట్టి మరీ అవసరమైతేనే చేయించుకోవడం మంచిది.

10. వర్జినిటీ అంటే హైమన్ ఒక్కటే కాదు..

వర్జినిటీ పోగొట్టుకోవడం అంటే హైమన్ పొర చిరగడం మాత్రమే కాదు.. దీని అర్థం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమ ఆలోచన ప్రకారం వర్జినిటీ విషయంలో విభిన్నమైన ఆలోచనలుంటాయి. ఒకవేళ ప్రతిఒక్కరూ మీలా ఆలోచించకపోతే.. మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకండి. వర్జిన్‌గా ఉండడం.. లేకపోవడం.. ఇది తప్పు.. ఇది కాదు అని చెప్పడానికి ఏమీ ఉండదు. అదంతా కేవలం మన ఆలోచనాతీరు మాత్రమే.

ADVERTISEMENT

11. వర్జినిటీ మీ చేతిలో ఉంటుంది.

వర్జిన్‌గా ఉండడం లేదా లేకపోవడం అన్నది మీ నిర్ణయం. మీ ఇష్టంపై ఇది ఆధారపడి ఉంటుంది. సెక్స్ విషయంలో మీరు ఎంత సౌకర్యంగా ఫీలవుతున్నారు అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు మీకు నచ్చిన వ్యక్తితో సెక్స్‌లో పాల్గొనాలనుకుంటే పాల్గొనవచ్చు. వద్దు అనిపిస్తే దూరంగా ఉండొచ్చు కూడా..

Images : Giphy

ఇవి కూడా చదవండి.

ADVERTISEMENT

మీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడతాయి..

తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!

తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి..

 

13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT