ఆనాడు 'మహానటి సావిత్రి' పాత్ర కోసం.. అమలా పాల్‌కి ఆఫర్..?

ఆనాడు 'మహానటి సావిత్రి' పాత్ర కోసం.. అమలా పాల్‌కి ఆఫర్..?

తెలుగు, తమిళ చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న అమలా పాల్.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన "మహానటి" (mahanati) చిత్రంలో సావిత్రి పాత్రకు గాను నిర్మాతలు.. తొలుత తననే సంప్రదించారని తెలిపారు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో పాటు.. కొన్ని వ్యక్తిగత కారణాల వలన తాను ఆ ఆఫర్‌ని తిరస్కరించారని ఆమె తెలిపారు. అమలాపాల్ ఇటీవలే "ఆమె" అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మహానటి చిత్రాన్ని దర్శకుడు నాగ్ ఆశ్విన్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెండు భాషలలో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకుంది. ముఖ్యంగా సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం.. పలు రికార్డులను తిరగరాసింది.  అలాగే ఇటీవలే విడుదలైన "ఎన్టీఆర్ కథానాయకుడు" చిత్రంలో నిత్యా మీనన్.. సావిత్రి పాత్రను పోషించారు. 

శ్రీదేవి బయోపిక్ పై.. కన్నేసిన రకుల్ ప్రీత్

ఇక అమలా పాల్ (Amala Paul) విషయానికి వస్తే.. నాయక్, ఇద్దరమ్మాయిలతో - మొదలైన చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, జెండా పై కపిరాజు, విఐపి 2 మొదలైన తెలుగు చిత్రాలలోనూ నటించింది. ఆమె నటించిన "మైనా" చిత్రం తెలుగులో "ప్రేమఖైదీ" పేరుతో విడుదలై కూడా మంచి సక్సెస్‌ను చవిచూసింది. ఈమె నటించిన మలయాళ చిత్రం "మిలి" తనకు ఫిలిం ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందించింది. 2014లో దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని వివాహమాడింది అమలాపాల్. అయితే తర్వాత ఇదే జంట విడాకులు కూడా తీసుకోవడం గమనార్హం. 

ఇక అమలాపాల్ నటిస్తున్న "ఆమె" చిత్రానికి వస్తే.. తమిళ చిత్రం "ఆడయ్"కి ఇది డబ్బింగ్ వెర్షన్. రత్నకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో అమలా పాల్ నగ్నంగా నటించడం గమనార్హం. ఈ నెల 19వ తేదిన ఈ చిత్రం విడుదల కానుంది. పూర్తి స్థాయి థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పొడించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. ఒక రకంగా ఈ చిత్రంలో నటించడం తనకో పెద్ద ఛాలెంజ్ అని.. ఆ సినిమా మరిచిపోలేని అనుభూతులను మిగిల్చింది అని తెలిపారు అమలా పాల్. 

కీర్తి సురేష్ "మహానటి" చిత్రం.. నిత్యా మీనన్ "ఐరన్ లేడీ"కి ఆదర్శమా?

"ఆమె" చిత్రానికి ప్రదీప్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. చిత్రమేంటంటే.. ఇటీవలే అమలా పాల్ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నారని.. తనతో డేటింగ్‌లో ఉన్నానని కూడా తెలిపారు. అయితే పేరును మాత్రం బహిర్గతం చేయలేదు. కొన్ని సార్లు అవాజ్యమైన ప్రేమను తల్లిదండ్రులు మాత్రమే అందివ్వగలరని.. ఇతరుల నుండి దానిని ఆశించడం కష్టమని.. కానీ అదే స్థాయి ప్రేమను అందించే వారు దొరికితే.. అంతకన్నా లక్ ఏముందని తెలిపారామె. 

జయలలిత బ‌యోపిక్ "తలైవి" గురించి.. ఆసక్తికర విశేషాలు

బాధలో ఉన్న తనకు.. నిజమైన ప్రేమ దొరికిందని.. అది ఎంతో సాంత్వన కలిగించిందని కూడా తెలిపారు అమలాపాల్. "నేను ఒక రెబల్‌గానే ఇన్నిరోజులు బతికాను. నాలాంటి అమ్మాయి కోసం... తన కెరీర్ వదులుకొని.. నాకు సపోర్టు చేయడానికి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఆశ్చర్యమే. అదే నిజమైన ప్రేమేమో. "ఆమె" చిత్రం చేస్తున్నప్పుడు కూడా తాను ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఆ రోల్ అంత బాగా చేయగలిగానంటే.. ఆయన ఇచ్చిన సహకారం కూడా అందులో ఎంతో ఉంది" అని తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి తెలిపారు అమలాపాల్. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.