ADVERTISEMENT
home / Astrology
జులై 16, 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

జులై 16, 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 16) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు కొన్ని అపార్థాల కారణంగా, భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడతాయి. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తాము తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం పై శ్రద్ధ చూపించండి. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. చర్మ సంబంధిత సమస్యలు మీకు చికాకును కలిగించవచ్చు. రాజకీయ నాయకులు పలు ప్రజారంజక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ధనం ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉంటే బెటర్. ఉద్యోగస్తులు ఆర్థికంగా బలపడతారు. కుటుంబ విషయాలలో మీకు మీ భాగస్వామి మద్దతు పూర్తిగా లభిస్తుంది. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ADVERTISEMENT

మిథునం (Gemini) –  నేడు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు.. తమ కొత్త ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులో అధికారుల నుండి మద్దతు పొందుతారు. అదేవిధంగా మీరు మీ భాగస్వామితో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే మీకు కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారస్తులకు ఈ రోజు సులభధన యోగం ఉంది. కోర్టు కేసులు లేదా ఆస్తిపరమైన లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. ఆఫీసులో మీరిచ్చే ఐడియాలు.. మీ అధికారులను ఆకర్షిస్తాయి. విద్యార్థులు నిజాయతీగా చదివితే.. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – సోమరితనం లేదా బద్ధకం కారణంగా విద్యార్థులు లేదా నిరుద్యోగులు మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. కనుక వాటిని వీడండి. వ్యాపారస్తులకు పాతబాకీలు వసూలవుతాయి. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వారు మాత్రమే కొన్ని సమస్యలను పరిష్కరించగలరు. కుటుంబ విషయాలలో.. మీకు మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది. 

ADVERTISEMENT

క‌న్య (Virgo) –  ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. అయితే ఏజెంట్లను నమ్మే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు తమ తల్లిదండ్రులు లేదా సోదరుల మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 

తుల (Libra) – విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ నిజాయతీ, కష్టపడే తత్వం మాత్రమే శ్రీరామరక్ష. అవే మీకు మంచి అవకాశాలను పొందేలా చేస్తాయి.రాజకీయ రంగంలోని వ్యక్తులకు అదనపు అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

వృశ్చికం (Scorpio) – కుటుంబ సమస్యలు మీ మానసిక అస్థిరతకు కారణమవుతాయి. కనుక కోపాన్ని నియంత్రించుకొని.. సహనంతో వ్యవహరించండి. వ్యాపారస్తులు బడ్జెట్ విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. ఉద్యోగస్తులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. మీ సహోద్యోగుల్లోనే మీకు ప్రత్యర్థులు ఉండవచ్చు.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

ధనుస్సు (Saggitarius) – మీ స్నేహపూర్వక ప్రవర్తనతో.. మీ నూతన కుటుంబ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ఉద్యోగస్తులు పలు శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారస్తులకు మంచి ప్రాజెక్టులు లభిస్తాయి. నిరుద్యోగులు, పోటీ పరీక్షల అభ్యర్థులు శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సృజనాత్మక రంగం పై ఆసక్తి పెరుగుతుంది. 

మకరం (Capricorn) – వ్యాపారస్తులకు బిజినెస్ విస్తరణకు కొత్త ఒప్పందాలు సహాయపడతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు శుభవార్తలు వింటారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు.. తమ సామర్ధ్యాలపై  నమ్మకం పెరుగుతుంది. రాజకీయరంగంలోని వ్యక్తులకు ఊహించని ఆఫర్స్ వస్తాయి. కొత్త మిత్రులు ఈ రోజు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. 

కుంభం (Aquarius) – ఈ రోజు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవగాహన లేని పథకాలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీ ఆస్తి లావాదేవీలు, కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు సోమరితనం వీడితే మంచిది. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీ భాగస్వామి మీ కుటుంబ బాధ్యతల్లో క్రియాశీలకంగా పాల్గొంటారు. 

మీనం (Pisces) –  ఈ రోజు కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను ఎవరో తెలియకుండా ఇంట్లోకి రానీయద్దు. అలాగే ఖర్చుల విషయంలో అప్రమత్తతతో ఉండండి. వ్యాపారస్తులు ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. ఆఫీసులో కొత్త మిత్రులు ఏర్పడతారు. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

15 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT