17 జులై, 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

17 జులై, 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 17) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజంతా మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. వివాహితులకు భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్ రంగ వ్యక్తులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

వృషభం (Tarus) – వ్యక్తిగత జీవితం మీ ఉద్యోగ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి.  మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే ఉద్యోగులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే బెటర్. కుటుంబంలో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో సహనంతో వ్యవహరించండి. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మిథునం (Gemini) – ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే అవివాహితులు ఓ శుభవార్త వింటారు. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహితులకు ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. 

కర్కాటకం (Cancer) – వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. అలాగే మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంది. పాత మిత్రులు ఈ రోజు మీ సహయాన్ని కోరి వస్తారు. అలాగే పలు బహుమతులను కూడా పొందుతారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) – ఈ రోజు స్నేహబంధాలు.. ప్రేమబంధాలుగా మారే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. వ్యాపారస్తులకు తమ భవిష్యత్తు పెట్టుబడులకు సంబంధించిన నిధులు సమకూరుతాయి. వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదవాలి.  

క‌న్య (Virgo) –  ఈ రోజు మీ ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టుల విషయంలో సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. కుటుంబ విషయాల్లో మీకు మీ భాగస్వామి సహకారం ఉంటుంది. వివేకంతో, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే.. కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. 

తుల (Libra) – ఈ రోజు మీ ఆస్తి లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో ప్రయత్నించే ఔత్సాహికులకు ఈ రోజు శుభదినం. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు.. ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. 

వృశ్చికం (Scorpio) – నిరుద్యోగులు ఈ రోజు శుభవార్తలు వింటారు. కొన్ని విషయాల్లో అప్రమత్తతతో వ్యవహరించకపోతే, ధన నష్టం చేకూరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అప్పులు ఇచ్చే విషయంలో.. తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల సహాయంతో మీకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. బీమా, స్టాక్ మార్కెట్‌లలో మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ ఆఫీసు సమస్యలు.. మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగానికి సంబంధించి మీరు ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు  మూలధన పెట్టుబడి గురించి ఆలోచించండి. వివాహితులకు తమ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు వ్యాపారస్తులకు సోదరుల మద్దతు లభిస్తుంది. కొన్ని క్లిష్టసమస్యల నుండి ఈ రోజు బయటపడతారు. ఆఫీసులో అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా బదిలీలు సంభవించవచ్చు. విద్యార్థులు దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త కాలేజీలో లేదా హాస్టల్‌లో చేరే అవకాశం ఉంది. 

కుంభం (Aquarius) – ఈ రోజు నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు శుభవార్తలు వింటారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఉద్యోగులు ఆఫీసులో కాస్త మైండ్ గేమ్ ఆడాల్సి ఉంటుంది. వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమికులు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. నూటికి పదిసార్లు ఆలోచించాలి.  

మీనం (Pisces) –  వ్యాపారస్తులు తక్కువ సమయంలో.. ఎక్కువ సంపాదించే విషయంలో ప్రలోభాలకు లోను కావద్దు. అలాగే ఉద్యోగస్తులు ఖర్చుల విషయంలో సంయమనంతో వ్యవహరించాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త వహించండి. అపరిచితులను ఇంటికి ఆహ్వానించవద్దు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకొనే విషయంలో.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఉంటే మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.