18 జులై 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

18 జులై 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 18) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు ఆర్థిక నష్టాలను కలిగించే సంఘటనలు జరగవచ్చు. ముఖ్యంగా ఆస్తి, కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. మీ భాగస్వామితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. తనతో సహనంగా వ్యవహరించండి. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి.  

వృషభం (Tarus) – మీ ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పడేయాలని చూస్తారు. అయినా నిజాయతీగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లండి.  సమయపాలన పాటించండి. విద్యార్థుల కష్టానికి ప్రతిఫలం  లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మిథునం (Gemini) – ఈ రోజు సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయినా కుటుంబ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం మంచిది. అలాగే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి. ఎదుటి వ్యక్తులు చెప్పే విషయాలను సావధానంగా విని నిర్ణయాలు తీసుకోండి. ఎవరితోనూ ఘర్షణకు దిగవద్దు. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. ఆర్థిక విషయాలలో అప్రమత్తతతో వ్యవహరించండి. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అలాగే ఆదాయ-వ్యయంలో సమతుల్యత ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో ఉద్రిక్తత వాతావరణం ఉన్నా.. సహనంతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యలను పరిష్కరించండి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) –  రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ రంగాల్లో వారికి ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రత్యర్థుల సవాళ్లను ఈ రోజు మీరు దీటుగా ఎదుర్కొంటారు. విద్యార్థులకు సమాజసేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వివాహితులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు వ్యాపారంలో సోదరుల సహాయం తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు కళలు, సాహిత్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా వివాహితులు కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ భాగస్వామి మీకు సరైన రీతిలో తోడ్పాటును అందిస్తారు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. 

తుల (Libra) – ఈ రోజులో ఆఫీసు పనుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. వ్యాపారస్తులు ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. ఈ రోజు మీ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. అలాగే రాజకీయ రంగ వ్యక్తులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు తమ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కుటుంబ సమస్యలు, ఆస్తి లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఓ శుభవార్తను వింటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడతాయి. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. విద్యార్థులు అధ్యయనంలో వచ్చే అడ్డంకులను అధిగమిస్తారు. కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యార్థులు కష్టపడి చదవాల్సిన సమయం ఇది. అదేవిధంగా అనవసర చర్చలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మీ జీవితంలో జరిగిన విషాదభరితమైన సంఘటనలు మళ్లీ చర్చకు వస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలోకి మూడో వ్యక్తి ప్రమేయాన్ని రానీయద్దు.

మకరం (Capricorn) – ఈ రోజు ఆఫీసులో నిజాయతీగా పని చేయండి. ఎందుకంటే మీ పని మీద నిఘా ఉంటుంది. అలాగే ఉద్యోగులు పలు శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతారు. అదేవిధంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. నిరుద్యోగులు ఓ శుభవార్తను వింటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. 

కుంభం (Aquarius) –  ఈ రోజు మీకు అనుకోని అదృష్టం కలిసొస్తుంది. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. ఆఫీసులో ఈ రోజు ఒత్తిడిని తట్టుకొని పని చేయాల్సి ఉంటుంది. అలాగే మీ కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. 

మీనం (Pisces) –  ఈ రోజు వ్యాపారస్తులకు లాభసాటిగా గడుస్తుంది. అలాగే కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అలాగే భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఓ ముక్కోణపు ప్రేమకథలో మీ పాత్ర ఉండచ్చు. ప్రేమికులు, వివాహితులు బంధాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.