ఈ రోజు (జూలై 21) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కళ్లకు సంబంధించి తగిన కేర్ తీసుకోండి. వ్యాపారస్తులు వాటాదారులతో సంప్రదింపులు జరిపేటప్పుడు.. వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోండి. వివాహితులు దూర ప్రయాణాలు వాయిదా వేస్తే బెటర్. అలాగే ఈ రోజు కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అదేవిధంగా పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.
వృషభం (Tarus) – మీ రోజు మీ కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే మీరు కోపాన్ని నియంత్రించుకోండి. అలాగే సహనంతో, సామరస్యంతో వివాదాలు పరిష్కరించండి. వ్యాపారస్తులు ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు కళలు, క్రీడలు లాంటి అంశాలలో ఆసక్తి చూపిస్తారు. వివాహితులు తమ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలను దూరం చేసుకుంటారు.
ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
మిథునం (Gemini) – ఈ రోజు నిరుద్యోగ యువతకి బాగా కలిసొచ్చే రోజు. మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సులపై ఆసక్తి చూపించవచ్చు. వ్యాపారస్తులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. అలాగే ఆర్థికంగా కూాడా బాగుంటుంది. వివాహితులు ఈ రోజు తమ భాగస్వామితో సరదాగా గడపడానికి ప్రయత్నించండి. ఒకరి మనసులను మరొకరు అర్థం చేసుకోండి.
కర్కాటకం (Cancer) – ఆస్తుల కొనుగోలు, విక్రయం లాంటి విషయాలను.. కొన్ని రోజులు వాయిదా వేయడం బెటర్. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు.. నూటికి పదిసార్లు ఆలోచించండి. వివాహితులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు.. ఖర్చులను తగ్గించుకుంటే బెటర్.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
సింహం (Leo) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మీ భాగస్వామితో చర్చించండి. అదే విధంగా వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధన యోగం ఉంటుంది. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లో వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది.
కన్య (Virgo) – ఈ రోజు మీ సోదరులతో పలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక శాంతంగా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు సరికొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఇలాంటి విషయాల్లో వివేకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాహితులు తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి.. వాటిని మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటే బెటర్.
తుల (Libra) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే బెటర్. ఈ రోజు సెలవు దినం అయినప్పటికీ.. ఉద్యోగస్తులు కొన్ని పనులు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులు తమ బిజినెస్ విస్తరణకు కొత్త ప్రణాళికలు రచిస్తారు. వివాహితులు ఆర్థిక విషయాల్లో భాగస్వామి సహాయం తీసుకుంటారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు స్థిరాస్థి కొనుగోలు లేదా విక్రయ లావాదేవీలను వాయిదా వేసుకోవడం బెటర్. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహితులు దూర ప్రయణాలు చేసే అవకాశం ఉంది. అయితే వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు రుణాల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల నుండి పలు బహుమతులను పొందుతారు. వ్యాపారస్తులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే ఆధ్మాత్మిక ప్రాంతాలను సందర్శించడానికి మొగ్గు చూపిస్తారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులు కూడా కుటుంబంతో కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.
మకరం (Capricorn) – ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉంటే బెటర్. వీలుంటే రెండు లేదా మూడు రోజులు వాయిదా వేయండి. అలాగే అపరిచితులను నమ్మి.. డబ్బును చేజేతులా జారవిడుచుకోవద్దు. అదేవిధంగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా పార్టీలు, ఫంక్షన్లకు అధికంగా ఖర్చు చేయకుండా ఉంటే మంచిది.
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు ఆస్తి లావాదేవీలకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంటారు. ఇలాంటి విషయాల్లో మీ భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం బెటర్. అలాగే చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఈ రోజు నుండి మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు నూతన ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. వివాహితులు కొన్ని విషయాల్లో మౌనాన్ని వీడి.. అనుమానాలను దూరం చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కారం.
మీనం (Pisces) – ఈ రోజు సెలవు దినమైనా.. మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని కీలక చర్చలలో పాల్గొంటారు. అయితే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ప్రత్యమ్నాయ కెరీర్ అవకాశాలను వెతికేటప్పుడు.. నూటికి పదిసార్లు ఆలోచించండి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామి నుండి మద్దతు కూడా లభిస్తుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.