22 జులై 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

22 జులై 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 22) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు మీరు చేస్తున్న పనిలో అనుకోని అంతరాయం కలుగుతుంది. ఉద్యోగస్తులు  మానసిక ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తతతో వ్యవహరించండి. బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా.. ఎవరినీ పార్టనర్స్‌గా చేసుకోవద్దు. విద్యార్థులు స్వశక్తితో కష్టపడి చదవడానికి ప్రయత్నించండి. అలాగే చెడు సావాసాలకు దూరంగా ఉండండి. 

వృషభం (Tarus) –  మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వాతావరణ మార్పులు మీ జీవితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. అందుకే దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే బెటర్. విద్యార్థులు కష్టపడి చదవండి.  వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పరిస్థితులన్నీ తమకు అనుకూలంగానే ఉంటాయి. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

మిథునం (Gemini) – ఈ రోజు కుటుంబ వివాదాలు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే శాంతియుతంగా, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ సమస్యలను పరిష్కరించుకుంటే బెటర్. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు సిద్ధిస్తాయి. అయితే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

కర్కాటకం (Cancer) – విద్యార్థులకు కొత్త విషయాలపై, అధ్యయనంపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఐడియాలకు అధికారుల నుండి ఆమోదం లభిస్తుంది. వ్యాపారస్తులకు  సులభ ధనయోగం ఉంటుంది. అయితే కోర్టు వ్యవహారాలలో కాస్త వివేకంతో వ్యహరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) –  ఈ రోజు వ్యాపారంలో కష్టపడినా ఆర్థిక ప్రయోజనాలు వచ్చే అవకాశం లేదు. అలాగే ఖర్చులను సాధ్యమైనంత వరకూ తగ్గించుకుంటే మంచిది. మధ్య తరగతి కుటుంబాల వ్యక్తులు.. మీ సేవింగ్స్ గురించి కూడా ఆలోచిస్తే బెటర్. అలాగే ఆస్తి వివాదాల విషయంలో.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ సమస్యలను ఒక కొలిక్కి తెచ్చుకోండి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి.  

క‌న్య (Virgo) –  ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులపై మొగ్గు చూపుతారు. విద్యార్థులకు కళలు లేదా క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే పాత మిత్రులతో కలిసి మీరు దూర ప్రయాణాలు చేస్తారు. వివాహితులకు తమ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ భాగస్వామి చదువు, కెరీర్ విషయంలో.. మీరూ సహాయం చేసి తన ప్రేమను పొందండి. 

తుల (Libra) – ఈ రోజు కుటుంబ సమస్యలు మీకు ఆందోళన కలిగిస్తాయి. అయినా సహనంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లండి. వివాహితులకు సంసార బాధ్యతలు మరింత పెరుగుతాయి. అలాగే ఓ శుభవార్త కూడా వింటారు. కొన్ని విషయాలలో అపరిచితులను నమ్మకుండా ఉంటే బెటర్. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీ బద్ధకం లేదా సోమరితనం వల్ల.. ఓ జీవితాన్ని మలుపు తిప్పే ఓ మంచి అవకాశాన్ని కోల్పోతారు. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్ల మాయలో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహితులు  ఆదాయ-వ్యయాలపై నియంత్రణ ఉంచండి. అలాగే కాంట్రాక్టులు లేదా ప్రాజెక్టుల విషయాల్లో స్నేహితుల సహకారంతో చేసిన పనులు పూర్తవుతాయి. అలాగే ఈ రోజు మీకు వాహన యోగం ఉంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు అధికారులు మీ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారు. అలాగే వ్యాపారస్తులకు ఆర్థికంగా ఇబ్బందులున్నా.. వాటిని అధికమించగలుగుతారు. ముఖ్యంగా సరైనా అగ్రిమెంట్లు లేకుండా పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బెటర్. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ మీ భాగస్వామితో బంధం మరింత పటిష్టమవుతుంది. 

మకరం (Capricorn) – ప్రేమికులకు, ఆలుమగలకు ఈ రోజు రొమాంటిక్ ఎనర్జీని అందిస్తుంది. కనుక సెలవు పెట్టి హాయిగా మీ భాగస్వామితో గడపండి. ఏదైనా మంచి రొమాంటిక్ ప్రదేశంలో ఎంజాయ్ చేయండి. అలాగే ఉద్యోగులు ఈ రోజు అధిక ఒత్తిడికి గురవుతారు. కానీ మీ పెర్ఫార్మెన్స్‌తో మాత్రం అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారులు చాలా స్మార్ట్‌‌గా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అందరినీ నమ్మకపోవడం బెటర్. 

కుంభం (Aquarius) -  విద్యార్థులు ఈ రోజు నుండే సరైన కెరీర్ ప్లాన్ తయారుచేయండి. మీ భవిష్యత్తును మలుపు తిప్పే ఓ గ్రేట్ ఆఫర్ మీకు రాబోతుంది. నిరుద్యోగులు ఉద్యోగాన్ని వెతికే విషయంలో.. మరింత స్మార్ట్ వర్క్ చేయాలి. ఉద్యోగస్తులు తమ ఫైనాన్షియల్ చిక్కులకు.. తామే కారణయమనే విషయాన్ని నమ్మాలి. అలాగే ఆఫీసు రాజకీయాలకు సంబంధించి ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోవద్దు. ఎలాంటి రివెంజి డ్రామాల్లోనూ మీరూ భాగస్వాములు కావద్దు. 

మీనం (Pisces) – మనీ సేవ్ చేసే ఉద్దేశంతో.. లైసెన్స్ లేని చిట్‌ఫండ్స్, నమ్మకం లేని మల్టీ లెవల్ మార్కెటింగ్ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టవద్దు. ఇలాంటి విషయాలలో నలుగురితోనూ చర్చించండి. అలాగే కొత్తగా పెళ్లైన దంపతులకు.. తమ తల్లిదండ్రుల నుండి అనుకోని గిఫ్ట్స్ లభిస్తాయి.  ఉద్యోగులు చాలా యాక్టివ్‌గా పనిచేస్తారు. తమ ఐడియాలతో అధికారులనూ ఆకట్టుకుంటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.