బిగ్‌బాస్ తెలుగు: వితిక కోసం మహేష్ విట్టాతో.. వరుణ్ సందేశ్ వాగ్వాదం

బిగ్‌బాస్ తెలుగు: వితిక కోసం మహేష్ విట్టాతో.. వరుణ్ సందేశ్ వాగ్వాదం

బిగ్ బాస్ హౌస్‌లో (Bigg Boss Telugu) ప్రతిరోజు ఇద్దరు లేదా ముగ్గురు గొడవపడుతునే ఉన్నారు. ఈరోజు ఒకరు గొడవకి దిగితే మరొకరోజు ఇంకొకరు గొడవకు దిగుతున్నారు. ప్రతిరోజు మనుషులు మారుతున్నారే తప్ప.. గొడవ మాత్రం జరగకుండా ఉండడం లేదు. మొన్నటి ఎపిసోడ్‌లో హేమ, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య జరిగిన గొడవ సద్దుమణగక ముందే.. నిన్నటి ఎపిసోడ్‌లో వరుణ్ సందేశ్ (Varun Sandesh), మహేష్ విట్టా మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.

హిమజ & శ్రీముఖి మధ్యలో.. గొడవకి అసలు కారణం ఇదేనా!

అసలేం జరిగిందంటే -

స్టోర్ రూమ్ డోర్‌కి కాస్త అడ్డుగా నిలబడిన మహేష్ విట్టాని (Mahesh Vitta) లోపలికి వెళ్లేందుకు జరుగు అని వితిక (Vithika Sheru) అడగగానే అతను - "పో" అని అనడం జరిగింది. "అలా మాట్లాడడం చాలా తప్పు" అని రితిక అంటుండగా.. అక్కడికి వచ్చిన వరుణ్ సందేశ్ కూడా "నిన్ను ఇందాకటి నుండి చూస్తున్నాను... నువ్వు ముందు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు" అని అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. "నా భార్యకి మర్యాద ఇచ్చి మాట్లాడు" అని అనడంతో ఆ వాగ్వాదం కాస్త ఘర్షణ వాతావరణం తలపించేలా మారిపోయింది.

ఇక తరువాత ఎపిసోడ్ ప్రోమోలో కూడా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ సద్దుమణగక పోగా.. మరింతగా పెరిగి ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్ళినట్టుగా స్పష్టమవుతుంది. ఇదిలావుంటే.. ఈ గొడవ జరిగిన కొద్దిసేపటి ముందే ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ని బోర్డు పై రాసే క్రమంలో మళ్లీ మనస్పర్థలు తలెత్తాయి. టీవీని వాడుకునే సమయంలో సరిగ్గా వ్యవహరించని కారణంగా.. కేటాయించిన మొత్తంలో కేవలం సగమే దక్కించుకోగలిగారు.

ఈ తరుణంలో హేమ, శ్రీముఖిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. టీవీని సరిగా వినియోగించడంలో ఫెయిల్ అయ్యారని శ్రీముఖి అంటే... "నువ్వు ఆ టైంలో భోజనం చేస్తున్నావు" అని హేమ అనేసరికి గొడవ మొదలైంది. వీరి మధ్య ఏర్పడిన గొడవ సద్దుమణిగిపోతుంది అని అనుకుంటుండగానే.. మహేష్ విట్టా, వరుణ్ సందేశ్‌ ల మధ్య గొడవ మొదలవడంతో.. బిగ్ బాస్ హౌస్ మొత్తం యుద్ద వాతావరణం నెలకొన్నట్లయింది.

అలాగే నిన్నటి ఎపిసోడ్‌లో మొదలైన రాహుల్, హేమల వాగ్వాదం కొంతవరకు చల్లారినా, ఈ అంశాన్ని గురించి వారాంతంలో వచ్చే నాగార్జున గారే న్యాయం చెబుతారు అని హేమ కుండబద్దలుకొట్టేసింది. దీనితో డైనింగ్ టేబుల్ దగ్గర మొదలైన ఈ గొడవకి తీర్పు కింగ్ నాగార్జునే చెప్పాలి అన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో... ఆయన ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారా? అసలు దీనికి నేను ఏం చెప్తాను.. అని తేలికగా తీసుకుంటారా? అనేది తెలియదు. ఎందుకంటే, ఆయన అసలు ఈ రియాలిటీ షోని ఏ కోణంలో చూస్తున్నారో అన్నది ఈ వారం పూర్తయితే కాని చెప్పలేం.

బిగ్‌బాస్ మరోసారి వివాదానికి తెరలేపిన నటి హేమ!

ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడంలో మొదటి సీజన్ పరంగా ఎన్టీఆర్, రెండవ సీజన్‌లో నాని తమదైన శైలిలో ఈ బిగ్‌బాస్ షోని నడిపించారు. ముఖ్యంగా ప్రతి శనివారం, ఆదివారం ఎపిసోడ్స్‌లో వ్యాఖ్యాత చెప్పే మాటలను బట్టే ఇంటిలోని సభ్యులు తమ వ్యవహార శైలిని మార్చుకోవడం జరుగుతుంటుంది. మరి ఈ వారం నాగార్జున ఎవరిని ప్రోత్సహిస్తాడు? ఎవరిని మందలిస్తాడు? అనేది తేలాలంటే ఇంకొక రెండు రోజులు ఆగాల్సిందే.

ఇక బయట నుండి షో చూస్తున్న ప్రేక్షకులు మాత్రం.. అసలు ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునేంత కారణాల్లా ఇవి లేవు అని తేల్చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్‌‌లో ఉన్న పెర్ఫార్మన్స్ ప్రెషర్ అనుకోండి లేదా మనల్ని టీవీల్లో ఎలా చూపిస్తున్నారు అన్న ఆందోళన కానీ.. వారిని మానసికంగా చాలా బలహీన పరుస్తోంది. 

ఏదేమైనా.. ఈ బిగ్‌బాస్ సీజన్ 3 లో ఇంటి సభ్యుల మధ్య మొదటి వారం పూర్తి కాకుండానే.. తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరుగుతుండగా... రాబోయే 13 వారాలు ఇంకెలా ఉండబోతున్నాయనేది ప్రేక్షకులకు ఆసక్తిగానే కనిపిస్తోంది. 

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : హేమ, టీవీ 9 జాఫర్‌తో బాబా భాస్కర్ కామెడీ