బిగ్ బాస్‌లో హిమజ & శ్రీముఖి మధ్యలో.. గొడవకి అసలు కారణం ఇదేనా!

బిగ్ బాస్‌లో హిమజ & శ్రీముఖి మధ్యలో.. గొడవకి అసలు కారణం ఇదేనా!

బిగ్ బాస్ హౌస్‌లో మనకి తరచుగా కనిపించేవి గొడవలు. అసలే బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటుంటారు కదా... అందుకే ఎదుటి వ్యక్తితో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు కాస్త ఘర్షణలుగా మారుతుంటాయి. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు రెండు సీజన్లలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాము.

ఇక మొన్ననే ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu) కూడా ఇందుకు మినహాయింపులా ఏమి కనపడడం లేదు. అయితే ముందు సీజన్లలో ఒక వారం లేదా రెండు వారాలు గడిచాక కాని.. ఇంటిలోని సభ్యుల మధ్య గొడవలు జరిగేవి కావు. అటువంటిది ఈ సీజన్‌లో రెండవ రోజు నుండే.. ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం మొదలైంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : హేమ, టీవీ 9 జాఫర్‌తో బాబా భాస్కర్ కామెడీ

అసలు ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణం, ఈ వారపు ఎలిమినేషన్ ప్రక్రియనే. ఇంటిలోకి ప్రవేశించే తరుణంలో.. ఒక అయిదు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉండగా, అందులో చెప్పిన సమాధానాల ఆధారంగా ప్రాధమికంగా ఆరుగురు సభ్యులని నామినేషన్ చేయడం జరిగింది.

ఆ తరువాత ఆ ఆరుగురికి మానిటర్‌గా హేమని (Hema) నియమించి.. నామినేషన్‌లో ఉన్నవారికి తాము ఎలిమినేషన్‌లో ఎందుకు ఉండకూడదో అని చెప్పడంతో పాటుగా... తమ స్థానంలో వేరే ఇంటి సభ్యుడు/సభ్యురాలు ఉండాలో అన్నది కూడా వివరించి చెప్పాలి. ఈ ఇద్దరి వాదనలు విని.. ఎవరు చెప్పిన దాంట్లో నిజం ఉంటే వారిని సేఫ్ జోన్‌లో పెట్టడం మానిటర్‌గా హేమ పని.

అయితే ఇందులో భాగంగా అప్పటికే నామినేషన్‌లో ఉన్న శ్రీముఖి.. తనకి బదులుగా మరొక ఇంటి సభ్యురాలైన హిమజ నామినేషన్‌కి అర్హురాలు అని తన అభిప్రాయం తెలిపింది. అందుకుగాను తన వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ వివరణతో హిమజ (Himaja) ఏకీభవించకుండా... అసలు తాను ఏ తప్పు చేయకుండా కావాలని నామినేట్ చేస్తున్నారు అని కంటనీరు పెట్టుకుంది. దేనితో బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

ఇరువురి వాదనలు విని.. మానిటర్ స్థానంలో ఉన్న హేమ, శ్రీముఖి (Sreemukhi) స్థానంలో.. హిమజని నామినేట్ చేయడంతో వివాదం ఇంకాస్త ముదిరింది అని చెప్పాలి. మరి ఈ ముగ్గురి మధ్య జరిగిన వాగ్వాదం చూసిన వారంతా కచ్చితంగా రాబోయే ఎపిసోడ్స్‌లో.. ఈ ముగ్గురి మధ్య కచ్చితంగా మరిన్ని భేదాభిప్రాయాలు పొడచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

"బిగ్‌బాస్ తెలుగు"కి కోర్టు చిక్కులు తొలుగుతాయా?

ఇక ఈ రోజు ఎపిసోడ్ (Bigg Boss Telugu Latest Episode) మొత్తానికే హైలైట్ ఏంటి అని అంటే - మానిటర్ స్థానంలో ఉన్న హేమని.. అలాగే ప్రాధమికంగా.. నామినేషన్‌లో ఆరవ వాడిగా ఉన్న బాబా భాస్కర్‌లలో ఏ ఒక్కరు సేఫ్ జోన్‌లో ఉండాలనే టాపిక్ వస్తుంది. ఈ వ్యక్తిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకోవాలి అని బిగ్ బాస్ సూచించడం.. దానికి అందరూ బాబా భాస్కర్‌కి ఓటు వేయడం జరిగింది. దానితో అప్పటివరకు మానిటర్‌గా ఉంటూ ఇంటి సభ్యులని నామినేట్ చేసిన హేమ.. ఒక్కసారిగా ఈ వారంలో నామినేట్ అయిన వారిలో ఒకరిగా నిలవడం నిజంగా ఒక ఝలక్ అని చెప్పాలి.

ఏదేమైనా.. ప్రేక్షకుల అంచనాలని మించి.. మరి ఉత్కంఠ రేపుతున్న ఈ బిగ్ బాస్ సీజన్ 3 రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిగా ఉండబోతుంది అని మాత్రం స్పష్టమైంది.

ఇక మొదటి వారం బిగ్ బాస్ సీజన్ 3 లో నామినేట్ అయిన వారెవరంటే -

* రాహుల్ సిప్లిగంజ్

* వితిక

* పునర్నవి భూపాళం

* హిమజ

* జాఫర్

* హేమ

ఈ ఆరుగురిలో, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మొదటి వారం పూర్తయ్యే సరికి ఎవరు నిష్క్రమిస్తారో అన్నది వచ్చే ఆదివారం రోజు తెలిసిపోతుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

Featured Images : Instagram.com/Sreemukhi and Instagram.com/HimajaMallireddy