వరంగల్ (Warangal) అనగానే ఎవరికైనా అక్కడ ఉన్న వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, పాకాల సరస్సు, లక్నాల సరస్సు, ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం, భద్రకాళీ దేవాలయం, సోమేశ్వర ఆలయం.. ఇలా చాలా సందర్శనీయ ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఇక కరీంనగర్ (Karimnagar) విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే అభివ్రుద్ధి చెందుతూ అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తూన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలోని ఈ రెండు ప్రాంతాలను సందర్శించినప్పుడు మంచి ఫుడ్ తినాలని మీరు భావిస్తే ఆయా ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఈటింగ్ పాయింట్స్ (Eat out places)కు తప్పక వెళ్లాల్సిందే. మరి, ఆ ఫుడ్ పాయింట్స్ ఏంటో ఓసారి తెలుసుకుందామా..
కరీంనగర్‌లోని ఈటింగ్ పాయింట్స్..
ప్రతిమ మల్టీప్లెక్స్..
చక్కగా సినిమాలు చూస్తూ, షాపింగ్ చేస్తూనే నోరూరించే ఫుడ్‌ని కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా?? అయితే కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌ని మీరు ఓసారి సందర్శించాల్సిందే. ఇక్కడ చక్కని థియేటర్స్, షాపింగ్ మాల్స్‌తో పాటు నగరవాసులను నోరూరించే రుచులతో అమితంగా ఆకర్షించే అనేక ఫుడ్ జాయింట్స్ కూడా ఉన్నాయి. నచ్చిన సినిమా చూస్తూ, సంతోషంగా షాపింగ్ చేస్తూ, మనసారా ఇక్కడి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.
శ్రీ గీతా భవన్..
కరీంనగర్‌లో పక్కా వెజిటేరియన్ ఫుడ్.. అందులోనూ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే భేదం లేకుండా అన్ని రకాల వంటకాలు రుచి చూడాలనుకుంటున్నారా?? అయితే మీరు శ్రీ గీతా భవన్‌కు వెళ్లాల్సిందే. 1975లో ప్రారంభమైన ఈ హోటల్‌లో టిఫిన్స్, లెమన్ రైస్ చాలా ఫేమస్. ముక్రంపుర రోడ్‌లో ఉన్న ఈ హోటల్‌కు వెళ్తే ఇక్కడి డిషెస్, టిఫిన్స్‌ని తప్పకుండా ఓ పట్టు పట్టాల్సిందే..
justdial
న్యూ పీకాక్ రెస్టారెంట్..
ఏంటీ?? అంతా వెజ్ గురించే చెబుతున్నారు.. నాన్ వెజ్ ఫుడ్ పాయింట్స్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా?? అక్కడికే వస్తున్నామండీ.. కరీంనగర్‌లో నోరూరించే నాన్ వెజ్ వంటకాలు రుచి చూడాలంటే న్యూ పీకాక్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ తయారు చేసే బిర్యానీ, అపోలో ఫిష్, చికెన్ బురానీ.. మొదలైనవి ఆ జిల్లా మొత్తం ఫేమస్ అంటే అవి ఎంత రుచిగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇక్కడ సౌత్, నార్త్ అనే తేడాలేమీ లేకుండా భోజనప్రియులు అమితంగా ఇష్టపడే నాన్ వెజ్ వెరైటీలు చాలానే ఉంటాయి. సూప్స్ మొదలుకొని స్టార్టర్స్, రోటీస్, కర్రీస్.. అన్నీ మన నోరూరిస్తాయి.
మెఫిల్ రెస్టారెంట్..
జగిత్యాల రోడ్‌లో ఉండే ఈ రెస్టారెంట్‌లో బిర్యానీ చాలా ఫేమస్. కరీంనగర్ ప్రాంతవాసులైతే దీనిని మరింత ఇష్టంగా తింటారు. అలాగని ఇక్కడ కేవలం బిర్యానీ మాత్రమే బాగుంటుందని అనుకోకండి. ఇండియన్, తండూరీ, చైనీస్, కెబాబ్స్.. ఇలా చాలా వెరైటీల్లో ఫుడ్స్ ఇక్కడ లభ్యమవుతాయి. వీటిలో ప్రతిఒక్కటీ దేనికదే ప్రత్యేకంగా, రుచికరంగా ఉంటుంది. కావాలంటే మీరే ఓసారి ఆయా వంటకాలను ప్రయత్నించి చూడండి.
justdial
మైత్రి హోటల్..
కరీంనగర్‌లోని ముక్రంపుర ప్రాంతంలో ఉన్న బెస్ట్ హోటల్స్‌లో మైత్రి హోటల్ కూడా ఒకటి. ఇక్కడ లభించే బిర్యానీ కూడా నగరమంతటా చాలా ఫేమస్. ముఖ్యంగా ఇటీవలే ఇక్కడ ప్రారంభించిన కుండ బిర్యానీ సైతం స్వల్ప కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ హోటల్ సర్కస్ గ్రౌండ్ పక్కన ఉంటుంది.
హార్ట్ బీట్ ఫుడ్ కోర్ట్..
నార్మల్ ఫుడ్ కాకుండా కేక్స్, బేకరీ ఐటమ్స్ ఏవైనా మీరు రుచి చూడాలనుకుంటే కరీంనగర్‌లో ఉన్న ది బెస్ట్ ఈటింగ్ పాయింట్ హార్ట్ బీట్ ఫుడ్ కోర్ట్. ఇక్కడ లభ్యమయ్యే కేక్స్, బిస్కట్స్.. వంటివి మాత్రమే కాదు.. చికెన్ బార్బిక్యూ కూడా చాలా ఫేమస్. పైగా ఇక్కడి రుచులు ఏవైనా మీరు ప్రయత్నించాలని భావిస్తే అక్కడికే వెళ్లి తినాలన్న రూలేం లేదు. స్విగ్గీలో ఆన్‌లైన్ ఆర్డర్ చేస్తే చాలు.. నిమిషాల్లో మీరు కోరుకున్న ఫుడ్ ఐటమ్స్ మీ కళ్ల ముందు ఉంటాయి.
వరంగల్‌లోని ఫేమస్ ఫుడ్ పాయింట్స్..
కాకతీయుల పరిపాలనకు అద్దం పట్టే వరంగల్ జిల్లాలో కేవలం సందర్శనీయ ప్రాంతాలే కాదు.. తప్పక రుచి చూడాల్సిన కొన్ని ఈటింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి..
Justdial
శ్రీ గీతా భవన్ ఉడుపి రెస్టారెంట్..
వరంగల్‌లో ఉన్న ది బెస్ట్ వెజ్ ఫుడ్ పాయింట్ అనగానే అందరూ దీని పేరే చెబుతారు. ఇక్కడ సౌత్, నార్త్ ఇండియాలకు చెందిన రకరకాల వెజ్ వంటకాలు లభ్యమవుతాయి. అలాగే అన్ని ఫుడ్ ఐటమ్స్ రుచికరంగా ఉంటాయి.
పాలమూరు గ్రిల్..
నోరూరించే వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఒకే చోట లభ్యమయ్యే ఈటింగ్ పాయింట్ అంటే అది పాలమూరు గ్రిల్ అనే చెప్పాలి. పేరుకు తగినట్లే ఇక్కడ లభ్యమయ్యే గ్రిల్డ్ ఫుడ్ వెరైటీస్ కూడా ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. బీబీక్యూ ఐటమ్స్, వెజ్ పులావ్, నాన్ వెజ్ పులావ్.. ఇలా చాలా వంటకాలు ఇక్కడ తప్పక రుచి చూడాల్సిన రెసిపీస్ జాబితాలో ఉంటాయి. అయితే ఈ హోటల్ మాత్రం హన్మకొండలో ఉంటుంది.
justdial
ఖుర్షీద్ హోటల్
మొత్తం వరంగల్ జిల్లాలో రుచికరమైన బిర్యానీ తినాలని అనుకుంటే ఖుర్షీద్ హోటల్‌కు వెళ్లాల్సిందే. అవునండీ.. హైదరాబాదీ బిర్యానీ తర్వాత అంతే రుచికరంగా ఉండే బిర్యానీ అంటే దీని పేరే చెప్తారంటే నమ్ముతారా?? అంత రుచిగా ఉంటుంది మరి..
హోటల్ వైష్ణవి గ్రాండ్
కాజీపేటలో నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న ఈ హోటల్‌లో వాతావరణం చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడి స్టాఫ్ చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవడమే కాకుండా అంతే ప్రేమాభిమానాలతో ఫుడ్‌ని కస్టమర్స్‌కు సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడి కెబాబ్స్ ప్రతిఒక్కరూ రుచి చూసి తీరాల్సిందే.. కుటుంబంతో కలిసి చక్కని వాతావరణంలో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే అందుకు ఈ హోటల్ ఒక చక్కని ఎంపిక.
ఇవి కూడా చదవండి
గోదావరి జిల్లాలు అనగానే.. ఈ నోరూరించే వంటకాలు గుర్తొచ్చేస్తాయి..!
నోరూరించే ఈ రొయ్యల వంటకాలు.. మీరు రుచి చూశారా??
మీరు సమోసా ప్రియులా.. అయితే ఈ టాప్ 10 స్పెషల్స్ వెంటనే టేస్ట్ చేసేయండి..!