ఆ బామ్మగారి హోటల్‌లో రూ.1 కే ఇడ్లీ .. ఆమె దేశానికే ఆదర్శమన్న ఆనంద్ మహీంద్ర..!

ఆ బామ్మగారి హోటల్‌లో రూ.1 కే ఇడ్లీ .. ఆమె దేశానికే ఆదర్శమన్న ఆనంద్ మహీంద్ర..!

తమిళనాడులోని (Tamilnadu) వడివేలంపాల్యంలో నివసిస్తున్న కె.కమలత్తాళ్ (Kamalathal) 30 ఏళ్ల నుండీ  ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారు. 80 ఏళ్ల వయస్సులో కూడా తెల్లవారుఝామునే నిద్రలేచి, పిండి రుబ్బి.. ఇడ్లీ తయారుచేసే ఆమె.. తన హోటల్‌లో ఒక్కో ఇడ్లీని .. జస్ట్ రూ.1 కి మాత్రమే అమ్మడం విశేషం. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలే తన టార్గెట్ కస్టమర్స్ అని ఆమె చెబుతున్నారు. చిత్రమేంటంటే.. ఆమె ఇడ్లీల తయారీకి ఇప్పటికీ కట్టెలపొయ్యే వాడుతోంది. ఇటీవలే ఆమె గురించి సోషల్ మీడియాలో ప్రసారమైన ఓ కథనాన్ని చూసి.. సాక్షాత్తు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యపోయారు.

విజేతగా నిలవాలంటే ఏం చేయాలి? - ఈ 40 కొటేషన్లు మీకోసం

ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆమె హోటల్‌కి తన సొంత డబ్బులతో గ్యాస్ సరఫరా చేస్తానని..ఆమె దేశానికే ఆదర్శమని మహీంద్ర అన్నారు. "ఆమె నిర్వహిస్తున్న ఈ హోటల్‌కి ఈ రోజు నుండి మేం గ్యాస్ సరఫరాను అందిస్తాం. అలాగే ఆ ప్రాంతంలోని మా సిబ్బంది ద్వారా ఆమెకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తాం" అని ఆనంద్ మహీంద్ర తెలిపారు. అలాగే ఆమె వ్యాపారంలో పెట్టుబడి కూడా పెడతానని.. ఆ విధంగా ఆమెకు ధన సహాయాన్ని కూడా చేస్తానని తెలిపారు మహీంద్ర.

అంతా వేలెత్తి చూపారు.. అయినా కష్టపడి అనుకున్నది సాధించా : స్వప్న

మహీంద్ర వ్యాఖ్యలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా స్పందించింది. " చక్కగా చెప్పారు సార్. దేశం కోసం ఇండియన్ ఆయిల్ ఏ స్ఫూర్తితో పనిచేస్తుందో.. అలాగే ఆమె కూడా అదే రీతిలో సమాజ సేవ చేస్తున్నారు" అని ఐఓఎల్ యాజమాన్యం జవాబిచ్చింది. ఆమెకు ఇండేన్ ఎల్పీజీ సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందజేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమెపై.. అలాగే ఆమెకు చేయూతను అందించడానికి ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్ర పై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 

 

 

35 ఏళ్లుగా కమలత్తాళ్ ఈ వ్యాపారంలో ఉన్నారట. ఒకప్పుడు ఆమె అర్థరూపాయికే ఇడ్లీ అమ్మేవారు. కానీ ఆ తర్వాత ధరలు పెరగడంతో.. రూ.1 కి ఇడ్లీని అమ్ముతున్నారు. లాభం తనకు ముఖ్యం కాదని.. అందరి ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని ఆమె మీడియాకి తెలిపారు. స్థానిక కూలీలు, బిచ్చగాళ్లు, ఆటో డ్రైవర్లు, చెత్త ఊడ్చే కార్మికులు వీరే కమలత్తాళ్ రెగ్యులర్ కస్టమర్లు. వీరితో పాటు అనేకమంది సామాన్య జనం, మధ్యతరగతి వ్యక్తులు కూడా ఇక్కడ ఇడ్లీ తినడానికి వస్తుంటారు.

సెయింట్ మదర్ థెరిసా జీవితం నుంచి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలివే..!

కమలత్తాళ్ సాంబారు, చట్నీతో సహా ఇడ్లీని అందించడం విశేషం. దాదాపు రోజుకి 1000 ఇడ్లీల వరకు ఆమె విక్రయిస్తున్నారట. తన గ్రామ జనాలకు ఇంత గొప్ప సేవ చేస్తున్న కమలత్తాళ్ కట్టెలపొయ్యి మీద వంట చేయడం తనను కలచివేసిందని.. అందుకే తనకు గ్యాస్ సరఫరా చేసి.. ఆమె చేస్తున్న సేవలో తాను కూడా భాగమయ్యేందుకు ముందుకొచ్చానని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్‌ బాగా పాపులర్ అయ్యింది. 

Featured Image: Twitter.com/The New Indian Express

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.