'ఉప్పెనంత ప్రేమ'కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

'ఉప్పెనంత ప్రేమ'కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

(Tollywood Choreographer Raghu Master and Singer Pranavi Love Story)

"అతనేమో ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడంత ఈ గుండె ఏమిటో" అంటూ సాగే పాటకి కొరియోగ్రఫీ చేసి అందరి మనసులు దోచేస్తే... ఆమేమో భక్తిరస ప్రధానమైన శ్రీరామదాసు చిత్రంలో 'శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ' అంటూ ఒక చక్కటి పాటతో గాయనిగా.. తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమైంది. సెలబ్రటీ కపుల్స్‌లో తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగిన ఆ జోడియే..  డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి. 

మాది 100 % 'లవ్ స్టోరీ' - సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

ఈ ఇద్దరి జర్నీని ఒక చూస్తే, ఒకరు తూర్పు.. మరొకరు పడమర అన్నట్లుగా ఉంటారట. అలాంటి ఈ ఇద్దరు ప్రేమలో పాడడం ఒకింత ఆశ్చర్యంగాను.. అదే సమయంలో ఆసక్తినీ రేకెత్తించిందని వారి సన్నిహితులు చెబుతుంటారు. ఇంతకీ అసలు వీరిద్దరి ప్రేమకి బీజం ఎప్పుడు పడిందో తెలుసా - జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ ఇద్దరు తొలిసారిగా కలుసుకోవడం జరిగింది. అక్కడే తొలిసారిగా ప్రణవిని చూసిన రఘు.. ఆమె గుణగణాలు తనని బాగా ఆకర్షించడంతో.. తనతో స్నేహం చేసేందుకు మెల్లగా ప్రయత్నించగా.. అటువైపు నుండి పెద్దగా స్పందన రాలేదట.

ఇది జరిగిన కొన్నిరోజులకి తన పేరు బయటకి రాకుండా రఘు ప్రణవికి ఓ పెళ్లి ప్రపోజల్ పంపిస్తే.. ఆ ప్రపోజల్ పంపించింది ఎవరని కూడా కనుక్కోకుండా తిరస్కరించేసిందట ఆమె. అయితే అసలు ఆమెకి ఆ సమయంలో ప్రేమ, పెళ్లి లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండేదని కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ఇలా పరోక్షంగా అడగడం కుదరడం లేదని భావించి..  కొద్దిరోజుల తరువాత ఆమెకి నేరుగానే తన ప్రేమని వ్యక్తం చేశాడు రఘు. దానికి ప్రణవి తన సమాధానంగా 'నాకు ఇష్టంలేదండి! మీరు మీ ఇంట్లో చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి.. అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చింది' 

దీనితో రఘు.. కాస్త కలత చెందడమే కాకుండా.. ప్రణవి తన ప్రేమని తిరస్కరించినందుకు కాస్త కోపాన్ని కూడా ప్రదర్శించాడట (ఒక ఇంటర్వ్యూ‌లో ఈ విషయాన్ని ప్రణవి చెప్పింది). ఆ తర్వాత కొంత కాలం వీరి మధ్య గ్యాప్ రావడంతో.. ఎవరి కెరీర్‌లో వాళ్ళు బిజీ అయిపోయారు. మళ్ళీ ఒక సంవత్సరం తరువాత తిరిగి రఘునే  ఒక వాట్సాప్ కాల్ రికార్డింగ్ ద్వారా.. ప్రణవికి ప్రపోజ్ చేశాడట. అయితే ఈసారి ప్రణవి మునుపటిలా కాకుండా.. అలాగే అటు 'సరే' అనకుండా..  సైలెంట్‌గా ఉండిపోయింది.

హీరో 'శ్రీకాంత్' తన రియల్ లైఫ్ హీరోయిన్ 'ఊహ'కి చేసిన.. ప్రపోజల్ గురించి మీకు తెలుసా?

ఈ తరుణంలో వీరిద్దరి ప్రేమకి పరోక్షంగా.. ప్రణవి తల్లి కూడా  సహకరించిందనే చెప్పాలి. ఆమె ఈ ఇద్దరితో మాట్లాడుతూ.. అటు కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రణవిని.. అలాగే ప్రణవి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న రఘుకి మధ్య సయోధ్య కుదిర్చి.. వీరిద్దరి ప్రేమకి ఆమె ఒక వంతెనలా నిలిచారు.

క్రమక్రమంగా రఘు ప్రేమని ప్రణవి అంగీకరించడం..  ఆ తరువాత వారి ప్రేమని ఇరు కుటుంబాలు ఆనందంగా సమ్మతించడంతో వీరిద్దరి వివాహం జరిగింది. బంధుమిత్రులు, ఆత్మీయుల మధ్య ఏప్రిల్ 21, 2016 తేదిన.. వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత మార్చి 11, 2019 తేదిన వీరికి ఓ పాప పుట్టింది. ఇప్పుడు వీరి బంధం.. ఒక అందమైన కుటుంబంగా మారింది.

ఇప్పటికి కూడా వీరిద్దరూ కలిసి ఏదైనా ప్రోగ్రాం లేదా షోలో పాల్గొంటే, తమ ప్రేమాయణం గురించి రకరకాలుగా చెబుతుంటారు. అలాగే ప్రణవికి రఘు వాట్సాప్ ద్వారా పంపిన ప్రపోజల్‌ని సైతం.. ఒక షోలో వేసి అందరికి వినిపించడం జరిగింది. ఈ ప్రపోజల్ వింటే.. రఘు మాస్టర్ ఆ సమయంలో ఎలా ఫీల్ అవుతూ.. ఆ సందేశం పంపించాడన్నది స్పష్టంగా తెలుస్తుంది.

ఇదండీ.. మన డ్యాన్స్ డైరెక్టర్ రఘు & సింగర్ ప్రణవిల ఉప్పెనంత ప్రేమకథ.

'ప్రతి ప్రేమకథ కంచికి చేరదు' అని తెలిపే.. 'పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్‌'ల లవ్ స్టోరీ ..!