Bigg Boss Telugu 3: టాస్క్‌లో బాబా భాస్కర్‌ని తోసేసిన వితిక.. ప్రశ్నించిన నాగార్జున ..!

Bigg Boss Telugu 3:  టాస్క్‌లో బాబా భాస్కర్‌ని తోసేసిన వితిక.. ప్రశ్నించిన నాగార్జున ..!

(Nagarjuna to question Vithika in Bigg Boss Telugu Season 3)

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3'లో భాగంగా రేపటితో 12వ వారం ముగియనుంది. ఇక ఈ వారం మొత్తం బిగ్ బాస్ 'బ్యాటిల్ అఫ్ ది మెడాలియన్' కోసం ఇంటిసభ్యులు పోటీపడిన సంగతి తెలిసిందే. ఈ పోటీలో బాబా భాస్కర్, వితికలు ఫైనల్‌కు చేరారు. అయితే నిన్న జరిగిన ఫైనల్ పోటీ చివరలో.. అనూహ్యంగా బాబా భాస్కర్‌ని కిందకి తోసేసి వితిక ఈ టాస్క్‌ని గెలవడం జరిగింది. అయితే బిగ్ బాస్ టాస్క్‌లో వితిక గెలిచిందని ప్రకటించినప్పటికి కూడా.. ఇంకా ఏదో ఒక ట్విస్ట్ ఉందంటూ.. ఆ మెడల్‌ని ఆమెకి బహుకరించకుండా ఉంచారు.

Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా?

ఇక కొద్దిసేపటి క్రితమే ప్రసారమైన ప్రోమోలో.. వితిక టాస్క్‌లో బాబా భాస్కర్‌ని తోసేసిన అంశం పై చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ విషయమై వితికని నాగార్జున ప్రశ్నిస్తుండడం ఈ ప్రోమోలో ప్రసారమైంది. అదే ప్రోమోలో వితిక, అలీ రెజాల మధ్య కూడా ఏదో డిస్కషన్ జరుగుతున్నట్లు చూపించారు. ఇక ఈ వారం జరిగిన ఎపిసోడ్లను ఒకసారి పరిశీలిస్తే.. చాలా విషయాలు లైమ్‌‌లైట్‌లోకి వచ్చాయి.

ముఖ్యంగా వరుణ్ సందేశ్, అలీ రెజాలు తమకోసం కాకుండా.. తామెవరికైతే మద్దతు ఇవ్వాలని భావించారో.. వారి కోసమే టాస్క్‌లు ఆడడం గమనార్హం. అలాగే వారిని గెలిపించేందుకు సహాయం చేయడాన్ని కూడా ప్రేక్షకులు చూశారు. దీనికి సంబంధించే శనివారం ఎపిసోడ్‌లో వరుణ్, అలీలకి.. నాగార్జున క్లాస్ పీకుతారేమో అన్న అభిప్రాయం ఉంది.

ఇదేకాకుండా రాళ్లే రత్నాలు, కుళాయి కొట్లాట, బ్యాలెన్స్ & రిక్షాలో వీరవిహారం - ఇలా సాగిన వివిధ టాస్క్‌లలో ఇంటి సభ్యులు చేసిన పొరపాట్లు.. అలాగే హూస్ మేట్స్ ముందు కాకుండా.. వారి వెనుక మాట్లాడిన సందర్భాలని ఈ రోజు ప్రసారం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో నాగార్జున హూస్ మేట్స్ చేసిన తప్పులను ప్రస్తావించే సూచనలూ కనిపిస్తున్నాయి. 

అయితే నిన్నటి టాస్క్ 'రిక్షాలో వీరవిహారం' ప్రారంభమైన సందర్భంగా.. ఇంటిసభ్యులు అందులో చాలా సరదాగా పాల్గొన్నారు. అందరూ కూడా టాస్క్‌లో పాల్గొన్న బాబా భాస్కర్ & వితికలకి ఫన్నీగా జుట్టుకి కలర్స్ వేయడంతో పాటు.. లిప్ స్టిక్స్ రాయడం వంటివి చేశారు.

అలాగే బిగ్ బాస్ కూడా టాస్క్‌లో పాల్గొన్న బాబా భాస్కర్, వితికలకి ముందుగా మూడు స్వెటర్లు ఇవ్వడం.. అలాగే వాటిని ధరించమని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే భారీగా వర్షం కురవడంతో.. ఇద్దరూ వానలోనే తడుస్తూ ఉండిపోయారు. మరలా బిగ్ బాస్ ఈ ఇద్దరికి చెరొక.. 10 పచ్చి మిరపకాయలు ఇచ్చి వాటిని తినమని తెలిపారు. మొత్తానికి కష్టపడైనా సరే.. వారు ఆ టాస్క్‌ని పూర్తిచేశారు.

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & పునర్నవి

అలా ఈ ఇద్దరు అన్ని పరీక్షలని ఓపికగా దాటుకుంటూ ముందుకి వెళుతుండగా.. బిగ్ బాస్ ఒక కఠినమైన పరీక్షని పెట్టారు. ఆ పరీక్ష ప్రకారం వారు వేసుకున్న స్వెటర్స్‌ని తీయించేసి.. వారి చేతే మళ్లీ చల్లటి కూల్ డ్రింక్‌ని తాగించడం జరిగింది. దీనితో ఈ ఇద్దరికి కాస్త ఇబ్బంది కలగడం & టాస్క్‌లో ఓడిపోకుండా ఉండడానికి బాబా భాస్కర్.. తనకి మద్దతు ఇచ్చే వాళ్ళ సహాయంతో అక్కడే మూత్ర విసర్జన చేయడానికి సిద్ధమవుతున్న వేళ.. వితిక ఆయనని కిందకి తోసెయ్యడం జరిగింది. దీనితో బాబా భాస్కర్ టాస్క్‌లో ఓడిపోయినట్టుగా బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వరుణ్ సందేశ్, పునర్నవి, మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్‌లలో ఒకరు ఈరోజు సేఫ్ జోన్‌లో ఉంటారనేది కూడా తెలుస్తుంది. మరి ఈ నలుగురిలో ఎవరు సేఫ్ జోన్‌లో ఉండబోతున్నారో.. ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలియనుంది. ఆఖరుగా నాగార్జున.. ఈరోజు ఎపిసోడ్‌లో ఎలా ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు