Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా ?

Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా ?

(Ali Reza sacrifices his task for Shiva Jyothi in Bigg Boss Telugu 3)

'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3'లో గ్రాండ్ ఫినాలేకి సంబంధించి..  బిగ్ బాస్ మెడాలియన్ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలలో అలీ రెజా ఆటతీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం తన ఆటని పక్కన పెట్టి.. శివజ్యోతిని గెలిపించడానికి గేమ్ ఆడుతున్నానని తను చెప్పడం.

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & పునర్నవి

అసలు జరిగిందేంటంటే - బిగ్‌బాస్ మెడాలియన్‌కు సంబంధించిన పోటీలలో.. నామినేషన్స్‌కి గురి కాని అయిదుగురు సభ్యులకి ఓ టాస్క్‌ను ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ పేరే 'కుళాయి కొట్లాట'. ఈ టాస్క్‌లో అయిదుగురు ఇంటి సభ్యులకి.. రెండు పంపులను ఇచ్చారు. ఆ పంపుల నుండి వచ్చే నీటిని.. బకెట్స్‌లో నింపుకోవాలి.

అయితే వారికి కేటాయించిన గ్లాసులతోనే వాటిని నింపుతూ.. పనిని పూర్తి చేయాలి. ఈ క్రమంలో మిగతా ఇంటి సభ్యులు.. టాస్క్ ఆడుతున్న వ్యక్తులలో.. తమకు నచ్చిన వారికి మద్దతు ఇచ్చుకోవచ్చని బిగ్‌బాస్ తెలిపారు. ఈ క్రమంలో ఆయా సభ్యులు.. తమ ఫేవరెట్ పార్టిసిపెంట్స్ కోసం.. ఇతరుల టాస్క్‌ని చేయనీయకుండా అడ్డుకోవచ్చు.

ఈ పోటీలో అలీ రెజా నీరు పోస్తుండగా.. రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌లు అడ్డుకోవడం వల్ల.. ఆయన ఈ టాస్క్‌ను చేయలేకపోయాడు. ఈ క్రమంలో అలీ సోదరభావంతో.. తనకు ఇష్టమైన శివజ్యోతికి మద్దతు తెలిపాడు. ఆమెకి వాటర్ ట్యాంక్‌లో నీళ్ళని పోశాడు. దీనికి శ్రీముఖి, వితికలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈ టాస్క్‌కి సంచాలకురాలిగా ఉన్న పునర్నవి.. ఇదే విషయమై బిగ్ బాస్‌ని వివరణ కోరింది. దీంతో ఆట నియమాలు ఉల్లఘించినందుకు.. శివజ్యోతి, అలీ రెజాలను ఈ టాస్క్ నుండి తప్పిస్తున్నట్లు బిగ్‌బాస్ తెలిపారు.

దీంతో టాస్క్ పూర్తిచేయడానికి.. కేవలం ముగ్గురు సభ్యేలే మిగిలారు.  ఆ ముగ్గురిలో శ్రీముఖి, బాబా భాస్కర్‌లని మిగతా వాళ్ళు అడ్డుకోవడంతో.. వితిక తన వాటర్ ట్యాంక్‌ని నింపుకోవడం జరిగింది. దీనివల్ల వితిక ఈ టాస్క్ విజేతగా నిలిచింది. ఈ విజయం ద్వారా నేరుగా.. మెడాలియన్ టాస్క్‌కి సంబంధించి 'లెవెల్ 3'కి ఆమె చేరుకోవడం జరిగింది.

Bigg Boss Telugu 3: మరోసారి ఘర్షణ పడిన.. వరుణ్ సందేశ్ & వితిక షేరు

ఇక అలీ రెజా ఈ టాస్క్‌లో చేసిన పనికి వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌లు తర్వాత కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అలీ రెజా వరుణ్‌కి జవాబిచ్చారు. " ఈ టాస్క్‌లో మీరు మీ భార్యకి పూర్తిగా మద్దతు తెలపకుండా.. అందరిని తికమక పెడుతూ గేమ్ ఆడారు" అని వరుణ్‌కు తెలిపారు. పైగా తనని కూడా ఆటలో ముందుకి వెళ్లనివ్వరని అర్ధమైందని.. అందుకే తదుపరి టాస్క్‌లో తన సోదరి శివజ్యోతికి మద్దతు తెలిపానని అలీ ప్రకటించాడు. మరి ఈ ప్రకటన గురించి నాగార్జున ఏమంటారో వేచి చూడాల్సిందే.

ఇక ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మెడాలియన్ కోసం.. లెవల్ 2 పోటీ జరగనుంది. దీనికోసం ఇంటి సభ్యులకి బ్యాలెన్స్ టాస్క్‌ని ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి, అలీ రెజాలు పోటీపడుతున్నారు. ఎవరైతే ఎక్కువ సేపు నిలబడి తమ తల పైన ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేస్తారో.. వారే ఈ 'లెవెల్ 2'‌లో విజేతలవుతారు. అయితే ఈ టాస్క్‌ నుండి అలీ రెజా కావాలని తప్పుకున్నట్టుగా ప్రోమోస్‌లో చూపించారు. మరి ఇది కావాలని చేస్తున్నారా? లేదా? అనేది ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

ఏదేమైనా... 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3'లో 74 రోజులు గడిచిపోయి.. ఇంకా కేవలం 26 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో హౌస్ మేట్స్‌లో చాలా మార్పులే కనిపిస్తున్నాయి. చూద్దాం.. రాబోయే ఎపిసోడ్స్‌లో పోటీ ఇంకెలా ఉంటుందో..?

Bigg Boss Telugu 3: ఇంటిసభ్యులు టాస్క్‌లో గెలిస్తేనే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటారట!