అందానికి & అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్ అనుష్క..

అందానికి & అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్ అనుష్క..

అనుష్క (anushka) - ఈ పేరు చెప్పగానే అందమైన మనసున్న ఓ అద్భుత అందాల రాశి మన కళ్ల ముందు మెదులుతుంది. ఆమె నటన గురించి చెప్పగానే ఓ అరుంధతి, ఓ దేవసేన,  మరో భాగమతి పాత్రలు గుర్తొస్తాయి. ఇవే కాదు.. ఆమె అద్భుతమైన నటనకు తార్కాణంగా తెరకెక్కిన పాత్రలు ఎన్నో.. అలాంటి ముద్దుల స్వీటీ పుట్టినరోజు (birthday) ఈ రోజు.. ఈ సందర్భంగా ఆమె సినిమా కెరీర్ గురించి.. ఈ ప్రత్యేకమైన ఆర్టికల్ మీకోసం.. 

 

అనుష్క నిశ్శబ్దం టీజర్ టాక్ మీకోసం

మన దేశంలోనే ప్రముఖ యోగా గురువుగా పేరున్న భరత్ ఠాకూర్ వద్ద యోగా శిక్షకురాలిగా కొంత కాలం పనిచేసింది స్వీటీ.. అలా యోగా ట్రైనర్ గా ఉంటూ బెంగళూరులో నివసిస్తున్న సమయంలో ఈమె ఫోటోలు దర్శకుడు పూరి జగన్నాధ్ చూడడం & వెంటనే ఆమె ఎవరు అని తెలుసుకుని హైదరాబాద్ కి పిలిపించడం జరిగింది. అలా ఆమె మొదటి సారి కెమెరా ముందు నిలబడింది. మొదటి ఫోటో షూట్ లో కెమెరా ముందు నిలబడి వారు చెప్పింది చేస్తున్న సమయంలో తన అమాయకత్వానికి అక్కడున్నవారంతా కూడా నవ్వడం తనకి ఇప్పటికి కూడా గుర్తే అని చెబుతుంటుంది. ఆ స్క్రీన్ టెస్ట్ లో పాసవ్వడంతో అక్కినేని నాగార్జున పక్కన సూపర్ చిత్రంలో అవకాశం లభించింది. ఆ సినిమాతో ఒక గ్లామర్ హీరోయిన్ (actress) తెలుగు తెరకు పరిచయమైంది అని అనుకున్నారంతా.. ఆ తరువాత కూడా తను చేసిన సినిమాలన్నిటిలో కూడా గ్లామర్ పాత్రలే కావడంతో ఆమె పైన ఆ ముద్ర పడింది.

అయితే 2009లో విడుదలైన అరుంధతి చిత్రం ఈ ముద్రని శాశ్వతంగా చెరిపేయడమే కాకుండా.. ఆమెని తెలుగు పరిశ్రమలో నెంబర్ 1 హీరోయిన్ గా గుర్తించేలా చేసింది. జేజమ్మగా అనుష్క నటన ఎంతోమంది విమర్శకులని చేత శబాష్ అనిపించుకునేలా చేసింది. మళ్ళీ అదే సంవత్సరం ఆమె తెలుగులో వచ్చిన బిల్లా చిత్రం కోసం బికినీ ధరించి తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది. తాను రెండు రకాల పాత్రలు పోషించగలనని నిరూపించింది. ఆ మరుసటి ఏడాదే తమిళంలోకి అడుగుపెట్టి సూర్య పక్కన సింగం చిత్రంలో నటించడం & అది ఘన విజయం అందుకోవడంతో ఆమె అక్కడ కూడా నెంబర్ 1 హీరోయిన్ అయింది. అలాగే తెలుగులో గ్లామర్ పాత్రలతో పాటుగా అభినయ ప్రాధాన్య పాత్రల్లో కూడా మెరిసింది. అవే - వేదంలో సరోజ, నాగవల్లి లో చంద్రముఖి, మిర్చిలో వెన్నెల ఇలా మంచి పాత్రలు చేసింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో పైన సామాన్య ప్రజలు ఇచ్చిన రివ్యూ ఏంటంటే

ఇక 2013లో ఆమెకి రాజమౌళి చేసిన బాహుబలి చిత్రంలో ఎప్పటికి నిలిచిపోయే పాత్ర ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ పాత్రే- దేవసేన. బాహుబలి మొదటి భాగంలో తన కొడుకు కోసం ఎదురు చూసే ఒక ముసలావిడ పాత్రలో కనిపిస్తే, రెండవ భాగంలో ఒక యువరాణి దేవసేన పాత్రలో కనిపించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. ఇదే సమయంలో గుణశేఖర్ తీసిన రాణి రుద్రమదేవి చిత్రంలో కూడా టైటిల్ పాత్ర పోషించి ఆ పాత్రకే వన్నె తెచ్చింది.

వీటి తరువాత చేసిన సైజ్ జీరో & భాగమతి చిత్రాలు కూడా ఆమెకి నటనపరంగా మంచి మార్కులే తీసుకువచ్చాయి. ఇక ఇప్పుడు నిశ్శబ్దం అనే చిత్రంలో ఒక మ్యూట్ ఆర్టిస్ట్ పాత్రలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. నిన్ననే అనుష్క పుట్టినరోజు (anushka birthday) సందర్భంగా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఆసక్తిని కలిగించింది. ఇక ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఇప్పటికి అనుష్క సినిమా పరిశ్రమకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది. ఈ 15 ఏళ్ళలో ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగిందే తప్ప ఏనాడు తగ్గలేదు. దీనికి ఆమె నటన ఒక కారణం అయితే మరొక బలమైన కారణం ఆమె వ్యక్తిత్వం. ఇప్పటివరకు ఆమె చిత్రపరిశ్రమలో ఏ ఒక్కరితో చిన్నపాటి వివాదం కూడా లేదు అంటే ఆమె మనసు & ప్రవర్తన ఎంత మంచిదో అర్థం చేసుకోవచ్చు. సినిమా షూటింగ్ లేనప్పుడు ఎంతో సంప్రదాయబద్ధమైన అమ్మాయిగా కనిపించినా.. సినిమాల్లో గ్లామరస్ డ్రస్సులు కూడా ధరిస్తుంది. దర్శకుడు చెప్పినట్లుగా విని పాత్రలో ఒదిగిపోవడంలో ఇండస్ట్రీలో అనుష్కని మించిన వారు మరొక కథానాయిక లేరని చాలామంది చెబుతుంటారు. 

ఇంతటి మంచి మనసు కలిగిన నటి ఇటువంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అనుష్క అలియాస్ స్వీటీకి స్వీటెస్ట్ బర్తడే విషెష్ మా POPxo తెలుగు తరపున తెలియచేస్తున్నాము.

యాడ్ షూట్ లో కలిసి జీవితాంతం ఒకరికి ఒకరై.. విరాట్ - అనుష్క ల అద్బుత ప్రేమ కథ..