“Arjun Reddy” Director Sandeep Reddy Vanga Tweets on Hyderabad Vet’s Rape, Murder case
“అర్జున్ రెడ్డి” సినిమాతో దేశం దృష్టిని మొత్తం ఆకర్షించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని “కబీర్ సింగ్” పేరుతో హిందీలో రీమేక్ చేయగా.. బాలీవుడ్‌లో కూడా కాసుల వర్షం కురిపించిందీ సినిమా. అయితే ఇదే చిత్రం సందీప్‌ను విమర్శల బారిన పడేలా కూడా చేసింది. పురుషాధిక్య భావజాలాన్ని ప్రోత్సహించేలా.. మహిళా స్వేచ్ఛను హరించే విధంగా ఈ చిత్రం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే అటువంటి అభిప్రాయాలను వ్యక్తపరిచిన వారికి… తనదైన శైలిలో అప్పట్లో కౌంటర్ ఇచ్చారు సందీప్. కేవలం ఒక వర్గం ఆడియన్స్ కోసం తాను సినిమాలు తీయలేనని.. అయినా ఆ సినిమాలో తనకెక్కడా తప్పు కనిపించలేదని తన వెర్షన్ తాను చెప్పారు.
తాజాగా హైదరాబాద్‌లో “దిశ” అత్యాచార ఘటనపై స్పందిస్తూ.. సందీప్ తన భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేేశారు. “భయం అనేది ఇలాంటి విషయాలలో ప్రధాన పాత్ర పోషించాలి. అదే సమాజంలో మార్పును తీసుకొస్తుంది. ఇలాంటి పనులు చేయాలంటే నేరస్తులు భయపడాలి. వారు భయపడే విధంగా చట్టాలు చేయాలి. ఇలాంటి తప్పులు చేసే వారిని చాలా కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రతీ అమ్మాయి సురక్షితంగా ఉంటుంది” అని తెలిపారు. అయితే సందీప్ చేసిన ట్వీట్‌కి మిశ్రమ స్పందనలతో పాటు సెటైర్లు, వ్యతిరేక వ్యాఖ్యలు కూడా రావడం గమనార్హం.
మహిళలపై ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ అనుచిత వ్యాఖ్యలు
“మీరు హిపోక్రసీతో మాట్లాడవద్దు” అని కొందరు ట్వీట్ చేయంగా.. మరికొందరు “అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి సినిమాలు చూసే యువకులు భయం లేకుండా తిరుగుతూ ఇలాంటి నేరాలు చేస్తున్నారని” తెలిపారు. అలాగే ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ జయోతి బెనర్జీ కూడా సందీప్ వ్యాఖ్యలపై స్పందించారు. “మీరు ఆశిస్తున్న మార్పు మీతోనే ఎందుకు మొదలవ్వకూడదు. మీరు తీసే చిత్రాలలో స్త్రీని వ్యాపార వస్తువుగా చూపించకండి. అలాగే రేప్ కల్చర్‌ని ప్రమోట్ చేయకండి” అని ఆమె బదులిచ్చారు.
FEAR is the only factor which can change things radically in a society and FEAR should be the new rule. Brutal sentence will set an example. Now every girl in the country needs a firm guarantee.I request @warangalpolice to come into action.#RIPPriyankaReddy
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 30, 2019
Why not start with you?
By having less of misogynistic characters & not promoting rape culture in your movies..— JAYOTI BANERJEE, IFS (@jayotibanerjee) December 1, 2019
It could’ve just as easily been Kabir Singh raping that woman. Still proud of your movie @shahidkapoor? And you @advani_kiara ? Ab feminism par lecture mat dena. You’re plain trash.
— afrustratedfeminist (@thequirkykitty) December 1, 2019
😂😂 Ladies and Gentlemen i present to you the great and fabled hypocrisy of our society in action. Keep making feudal and patriarchal movies like Arjun Reddy and also keep preaching along with Vijay devarakonda about rule of law and values.
— Basileos Basilieus (@Basileos_B) December 1, 2019
Will that FEAR stop them from slapping her? https://t.co/dgOIHyTWlU
— Vikramaditya Motwane (@VikramMotwane) December 1, 2019
అలాగే మరో దర్శకుడు విక్రమాదిత్య కూడా సందీప్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. సందీప్ ట్వీట్‌లో భయం గురించి ప్రస్తావించిన అంశం పై మాట్లాడుతూ “మరి ఆ భయం ఆ అమ్మాయిని కొట్టకుండా ఆపుతుందా” అని ప్రశ్నించారు విక్రమ్. ఆ ప్రశ్న ఒక రకంగా సెటైర్‌గా అర్థమవుతోంది. ఎందుకంటే.. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్‌ను కొట్టే సన్నివేశం ఉంటుంది. దానికి రిఫరెన్స్‌గానే ఈ జవాబు ఇచ్చారనే భావన కనబడుతోంది. అయితే ఈ క్రమంలో సందీప్‌ను సపోర్ట్ చేస్తూ కూడా కొందరు ట్వీట్స్ చేశారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు.. మహిళ స్వేచ్ఛగా అనుభవించేదెన్నడు?
“అర్జున్ రెడ్డి ఒక క్యారెక్టర్ మాత్రమే. దాని ప్రేరణతోనే దేశంలో అత్యచారాలు, అరాచకాలు జరుగుతున్నాయంటే ఎలా” అంటూ పలువురు సమాధానమిచ్చారు. బాలీవుడ్ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ గతంలో ఉడాన్, లుటేరా, ట్రాప్డ్, భవేష్ జోషీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఉడ్తా పంజాబ్, రమణ్ రాఘవ్, క్వీన్, అగ్లీ లాంటి సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన తీసిన సినిమాలలో కూడా కొన్ని హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని గతంలో విమర్శలు వచ్చాయి. అలాంటి దర్శకుడే మళ్లీ “అర్జున్ రెడ్డి” పై కామెంట్ చేయడం ఏమిటని నెటిజన్లు పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
మహిళా శక్తిని గుర్తించండి.. సాధికారత దిశగా వారిని ప్రోత్సహించండి..!
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.