పూజా హెగ్డే ఫ్యాషన్స్ ఫాలో అవ్వండి.. కూల్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకోండి..

పూజా హెగ్డే ఫ్యాషన్స్ ఫాలో అవ్వండి.. కూల్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకోండి..

పూజా హెగ్డే (Pooja Hegde).. ఒక లైలా కోసం.. సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ. ఆ తర్వాత ముకుంద, దువ్వాడ జగన్నాధం, సాక్ష్యం, అరవింద సమేత.. వంటి హిట్ చిత్రాల్లో మెరిసిన ఈ అందాల భామ ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మహర్షితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. వెండితెరపై అందమైన పాత్రల్లోనే కాదు.. వాస్తవ జీవితంలోనూ తనవైన ఫ్యాషన్స్‌తో అందరినీ అలరిస్తుందీ ముద్దుగుమ్మ. కావాలంటే ఈ అమ్మడి ఇన్ స్టాగ్రామ్ నుంచి తీసుకున్న ఈ టాప్ ఫ్యాషన్స్ పై మీరూ ఓ లుక్కేయండి..

కాలేజీ అమ్మాయిలకు బాగా ఇష్టమైన ఫ్యాషన్స్‌లో స్కర్ట్స్ కూడా ఒకటి. అందుకే వీటిని మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో ధరించడంతో పాటు వివిధ ట్రెండ్స్‌తో కూడా కలిపి ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పూజా హెగ్డే కూడా దీనినే ఫాలో అయింది. జామెట్రిక్ ప్రింటెడ్ స్కర్ట్‌కి, వన్ షోల్డర్ ప్లెయిన్ వైట్ కలర్ టాప్‌ని జత చేసి.. కూల్‌గా ఎలా మెరిసిపోతోందో చూడండి. చేతికి ఒక రింగ్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని.. మ్యాచింగ్ ఫుట్‌వేర్‌తో తన లుక్‌ని చాలా సింపుల్‌గా పూర్తి చేసింది.
 

 

 


View this post on Instagram


#maharshi promotions in @pankajandnidhi ❤️ @neeraja.kona @kajol_mulani @suhasshinde1 @manogna.reddy


A post shared by Pooja Hegde (@hegdepooja) on
ధరించిన దుస్తులు ఏవైనా సరే.. వాటికి మనదైన ఆత్మవిశ్వాసాన్ని జోడిస్తేనే మన లుక్‌ని కంప్లీట్ చేయడం సాధ్యపడుతుంది. అందుకే ఒక్కోసారి మన డ్రస్సింగ్ చాలా సింపుల్‌గా ఉన్నా సరే.. భలే అందంగా, స్టైలిష్ గా మెరిసిపోయేలా చేస్తుంది. పూజా హెగ్డే ధరించిన ఈ ఫ్రాక్ కూడా ఈ కోవకు చెందిందే.
 

 

 


View this post on Instagram


Love ❤️


A post shared by Pooja Hegde (@hegdepooja) on
పూజా హెగ్డే ధరించిన ఈ స్లిమ్ అవుట్ ఫిట్‌ని చూడండి.. ప్లెయిన్ బ్లాక్ అండ్ మస్టర్డ్ యెల్లో షేడ్స్ కాంబినేషన్‌లో రూపొందించిన ఈ తరహా డ్రస్‌లు ప్రస్తుతం మార్కెట్లో విరివిగానే లభ్యమవుతున్నాయి. అంతేకాదు.. నచ్చిన కోట్స్ లేదా ప్రింట్స్ ఉన్నవి ఎంపిక చేసుకుంటే.. వీటిని ధరించి ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడం అంత కష్టమేమీ కాదు. పూజా హెగ్డేలా మ్యాచింగ్ ఫుట్ వేర్‌తో పాటు.. డ్రస్‌కు నప్పే విధంగా చక్కని హెయిర్ స్టైల్ ఉంటే చాలు.. ఏమంటారు??
 

 

 


View this post on Instagram


Walking on sunshine ☺️🌼☀️#Maharshi


A post shared by Pooja Hegde (@hegdepooja) on
ఈ రోజుల్లో ఏ కాస్త స్పెషల్ అకేషన్ ఉన్నా సరే.. అమ్మాయిలందరి చూపూ లెహెంగాల వైపే. అయితే ఇవి హెవీగా ఉంటాయన్న కారణంగా కొందరు వీటికి దూరంగా కూడా ఉంటూ ఉంటారు. మీరూ అంతేనా?? అయితే మీరు పూజా హెగ్డేని ఫాలో అయితే సరి.. చూడండి.. ప్రకాశవంతమైన పసుపు రంగులో ఫ్లోరల్ ప్రింటెడ్ లెహెంగాతో సింపుల్‌గానే ఎంత అందంగా మెరిసిపోతోందో. పైగా ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా తేలికగా ఉంటుంది కాబట్టి.. హెవీ లుక్ ఉంటుందనే భయం కూడా అవసరం లేదు.
 

 

 


View this post on Instagram


That dreamy mood in @imansaab ❤️ @eshaamiin1 @kajol_mulani @suhasshinde1 @saurabhdalvi_photography #zeeCineAwards


A post shared by Pooja Hegde (@hegdepooja) on
సాయంత్రం లేదా రాత్రి వేళల్లో జరిగే పార్టీలకు హాజరయ్యేటప్పుడు మన లుక్ చాలా ప్రత్యేకంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా కొందరు పార్టీలకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతూ ఉంటారు. అలాంటివారందరిలోనూ మనం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలంటే మాటలా చెప్పండి?? అందుకు మనం ధరించే డ్రస్ దగ్గర్నుంచి ఉపయోగించే యాక్సెసరీస్ వరకు.. ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పూజా హెగ్డేని చూడండి.. డార్క్ మెరూన్ షేడ్ లాంగ్ ఫ్రాక్‌కు, సింపుల్ డైమండ్ నెక్లెస్ జత చేసి సింపుల్‌గా, స్టైలిష్ గా ఎలా మెరిసిపోతోందో..
 

 

 


View this post on Instagram


Success is golden ✨✨ in @manishmalhotra05 @jet_gems for the Sucess Event of #AravindhaSametha


A post shared by Pooja Hegde (@hegdepooja) on
ఈ రోజుల్లో కొత్తగా వినిపిస్తూన్న ట్రెండ్స్‌లో షరారాకు అమ్మాయిలు ఎక్కువగా ఓటేస్తున్నారు. ఇవి ధరించడానికి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు స్టైలిష్ లుక్‌ని అందించడమే ఇందుకు కారణం. కావాలంటే పూజా హెగ్డే ధరించిన ఈ షరారాను చూడండి. దీనిపై వర్క్ కాస్త హెవీగా ఉన్నా.. చూడడానికి సింపుల్‌గా ఉన్నవి కూడా చాలా డిజైన్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.

అసలే ఎండలు మండిపోతున్నాయి.. వీటికి తోడు వడగాలులు.. ఇలాంటి సమయంలో కాస్త హాయిగా ఉండాలంటే అందుకు తెలుపు రంగు దుస్తులు ధరించడం కూడా ఒక మార్గమే. వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్స్‌లో మనం అందంగా కనిపించడం మాత్రమే కాదు.. శరీరానికి కూడా ఎండ వేడి నుంచి ఉపశమనం లభించి హాయిగా అనిపిస్తుంది. పూజా హెగ్డేని చూడండి.. ప్లెయిన్ వైట్ కలర్ టాప్ అండ్ బాటమ్‌కు వైట్ కలర్ స్నీకర్స్ జత చేసి కూల్ లుక్స్‌తో ఎలా కనిపిస్తుందో..

ప్రకాశవంతమైన రంగులను ధరించడం కూడా ఒక ఆర్ట్. ముఖ్యంగా ఎరుపు రంగు. దీనిని వేరే కలర్స్‌తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించేవారే చాలా ఎక్కువ. అలాకాకుండా పూర్తిగా ఇదే రంగు అవుట్ ఫిట్‌ని ధరించాలంటే.. అందుకు ఎంతో ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే ప్లెయిన్ షేడ్స్ అందరికీ నప్పకపోవచ్చు. కానీ పూజా హెగ్డే ధరించిన ఎరుపు రంగు అవుట్ ఫిట్‌ని చూసిన తర్వాత.. ప్లెయిన్ షేడ్‌లో ఇంత అందంగా మెరిసిపోవచ్చా అని మీరు ఆశ్చర్యపడక మానరు.


ఇవి ఆమె స్టైల్ ఫైల్ లోని కొన్ని ఫ్యాషన్స్ మాత్రమే. ఈ అమ్మడు ఫాలో అయ్యే వాటిలో కొన్ని ఫ్యాషన్స్ హాట్ లుక్‌ని కూడా ఇస్తాయి. కావాలంటే ఈ అమ్మడి ఇన్ స్టాగ్రామ్ పై మీరూ ఓ లుక్కేయండి..


ఇవి కూడా చదవండి


బాపూ గారి బొమ్మ ప్ర‌ణీత ఫ్యాష‌న్స్ ఫాలో అవ్వండి.. మీరూ భ‌లేగా మెరిసిపోండి..!


ఈ సుంద‌రి అంద‌మే కాదు.. ఫ్యాష‌న్స్ కూడా లావ‌ణ్య‌మే..!


కలర్ ఫుల్ అండ్ కూల్ ఫ్యాషన్స్.. 'జెర్సీ' ఫేమ్ శ్రద్ధ శ్రీ‌నాథ్ సొంతం..!