Astrology

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ కలలను నెరవేర్చుకోండి..!

Sridevi  |  Jun 16, 2019
ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ కలలను నెరవేర్చుకోండి..!

ఈ రోజు (జూన్ 17) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు మీరు సాధ్యమైనంత మేరకు సహనంగా ఉండండి. ఎందుకంటే కావాలనే కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే.. అది పనిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒంటరిగా మీతో మీరు సమయం గడపడం ద్వారా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి.

వృషభం (Tarus) – ఈ రోజు జరిగే ఒక ముఖ్యమైన సమావేశం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో నిజాయతీగా మీ మాటకి కట్టుబడి ఉండండి. అదేవిధంగా.. పనిలో ఎదురయ్యే ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్లకండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు అవసరమైన సమయం కేటాయించండి. 

మిథునం (Gemini) – ఈ రోజు పలు సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. దీంతో మీలో అభద్రతాభావం పెరగవచ్చు. ఈ క్రమంలో మీకు పలువురి పై అనుమానాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వివేకంతో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు పని విషయంలో మరిన్ని బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని.. మీరు మరింత ఎదిగేందుకు తోడ్పడతారు. ఇక మీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ కుటుంబ సభ్యులతో  ఎక్కువ  సమయం గడపండి. దీని ద్వారా మీ బంధాలను మరింత బలపరుచుకోవచ్చు. 

సింహం (Leo) – పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయని కారణంగా.. మీపై మీకే చిరాకుగా అనిపించవచ్చు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. అలాగే మీతో మీరు గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోండి. ఎన్ని పనులున్నా.. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపించండి. 

క‌న్య (Virgo) –  ఈ రోజు సమావేశాల్లో జరిగే ఆలస్యం కారణంగా పని చాలా నిదానంగా సాగుతుంది. గతంలో జరిగిన సమావేశాలకు సంబంధించిన స్పష్టత కూడా మీకు వస్తుంది. ఇతరులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయంలో మీకు క్లారిటీ లేకపోవచ్చు. కానీ సహనంతో వ్యవహరిస్తూ రోజుని గడవనీయండి. ఒకవేళ మీరు కొత్త పని ఏదైనా ప్రారంభించాలని అనుకుంటే.. దాని గురించి ఎవ్వరితోనూ చర్చించకండి.

తుల (Libra) –  ఈ రోజు మీరు చాలా ఉత్సాహంతో పనిచేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీకు సహకరించడమే కాదు.. మీ నుంచి అంతే స్థాయిలో పని రాబట్టుకోవాలని ఆశిస్తారు కూడా. కాబట్టి మీ వంతు పాత్ర మీరు న్యాయంగా పోషించండి. ఇతరుల ఫీలింగ్స్‌ని కూడా పరిగణనలోకి తీసుకోండి. 

వృశ్చికం (Scorpio) – మీరు చేస్తున్న పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. అవి మానసికంగా మిమ్మల్ని మరింత బలంగా మారుస్తున్నాయి. కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ధైర్యాన్ని కోల్పోవద్దు.  మీ శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. 

ధనుస్సు (Saggitarius) – ఇతరులను నమ్మే విషయంలో మీకు చాలా ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. పనిలో ఉన్న పరిస్థితులను డీల్ చేయడంలో మీరు అతిగా ఆలోచిస్తున్నారేమో సరి చూసుకోండి. గతంలో జరిగిన సంఘటనల కారణంగా మీ మనసులో అభద్రతాభావం ఏర్పడనీయకండి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీ చుట్టూ ఉన్నవారిని నమ్మండి. గతాన్ని వదిలేయండి.

మకరం (Capricorn) – మీ ప్రణాళికల్లో చివరి నిమిషంలో జరిగే మార్పుల కారణంగా పని చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఆఫీసులో సహచరుల విషయంలో మరింత సహనంతో వ్యవహరించండి. అన్నీ మీరు అనుకున్నట్లు, మీరు ఆశించిన సమయానికి జరగకపోవచ్చు. మీ స్నేహితుల్లో ఒకరి ప్రవర్తన కారణంగా మీకు ఇబ్బంది కలగవచ్చు.

కుంభం (Aquarius) – మీ కొత్త క్లయింట్స్‌తో సంప్రదింపులు మొదలైనప్పటికీ.. పని కార్యరూపం దాల్చడానికి కాస్త సమయం పట్టచ్చు. అలాగే మీ సహచరులతో మీకు సమస్యలు ఉండచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ వ్యక్తిగత విషయాలు, పని గురించి మీతో మాట్లాడతారు. గతంలో మీకు దూరమైన పాత స్నేహితులను తిరిగి కలుసుకుంటారు.

మీనం (Pisces) – ఈ రోజు పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న గుర్తింపు మీకు లభిస్తుంది. కొన్ని విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. పని కారణంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కాస్త తగ్గవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ రాశుల వ్యక్తులు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లు

సెల్ఫీకి..రాశిఫలాలకు మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసా

మకరరాశి అమ్మాయిల గురించి తెలుసుకుందామా

 

 

Read More From Astrology