Entertainment

నా భర్తని చంపింది నేనే అంటోన్న ఈషా.. అసలు ఏం జరిగింది?

Sandeep Thatla  |  Nov 6, 2019
నా భర్తని చంపింది నేనే అంటోన్న ఈషా.. అసలు ఏం జరిగింది?

ఈషా రెబ్బ (eesha rebba) – ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న అతికొద్దిమంది తెలుగు హీరోయిన్స్ లలో ఒకరు. ఆమె సినిమాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం తన కెరీర్ అద్భుతంగా సాగుతోందని చెప్పుకోవచ్చు. ఇతర హీరోయిన్స్ మాదిరిగా ఏ ఆఫర్ వచ్చినా ఒప్పేసుకోకుండా తనకి సరిపడే పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ముందుకి వెళ్తోందీ అందాల భామ. తాజాగా ఆమె నటించిన చిత్రం రాగల 24 గంటల్లో (ragala 24 gantallo).

బాలీవుడ్ లో మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల ప్రేమకథ ఇప్పుడు హాట్ టాపిక్

రేడియో లేదా టీవీలో తుఫాను సమయంలో హెచ్చరికలు జారీ చేసేటప్పుడు ఉపయోగించే మాటలని టైటిల్ గా పెట్టడం అన్నిటికన్నా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ విడుదల కాగా, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించిన చర్చనే నడుస్తుంది. మరి ముఖ్యంగా ఈ ట్రైలర్ (trailer) లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి ఈషా .. ట్రైలర్ చూస్తుంటే దాదాపు కథ మొత్తం ఈమె చుట్టూ తిరుగుతుంది అని అర్ధమవుతుంది. 

ఈ ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం, యాడ్ ఫిలిం డైరెక్టర్ అయిన సత్యదేవ్ .. ఈషా తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. అలా వారు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి ఒకరోజు అనూహ్యంగా సత్యదేవ్ తన ఇంటిలో హత్యకు గురవుతాడు. అయితే తన ఇంట్లోనే సత్యదేవ్ ఎలా హత్యకు గురయ్యాడు? ఆ సమయంలో అతని భార్య ఈషా ఇంటిలోనే ఉందా? సత్యదేవ్ ని చంపడానికి ఎవరైనా బయట నుండి వచ్చారా? సత్యదేవ్ హత్యకి కుట్ర చేసింది ఈషా నేనా అన్న అనుమానం పోలీసులకి రావడం & పోలీస్ ఆఫీసర్ శ్రీరామ్ ఆమెను విచారించడం వంటివి మనకి ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఆఖరులో మా ఆయన్ని నేనే చంపేశాను.. అంటూ ఈషా చెప్పడం సినిమా కథను మరింత హైలైట్ చేస్తోంది. 

మొత్తానికి ఈ రాగల 24 గంటల్లో ట్రైలర్ (ragala 24 gantallo trailer) చూస్తుంటే, ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ లాగా కనిపిస్తున్నది. అదే సమయంలో థియేటర్ లో సినిమా చూసే వారు ఒక మంచి థ్రిల్లర్ ని చూసిన అనుభూతిని పొందగలరు అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఇక ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఇప్పటివరకు దాదాపు ఎక్కువశాతం కామెడీ చిత్రాలే చేయడం జరిగింది. ఆయన కెరీర్ మొత్తంలో నాగార్జున తో చేసిన డమరుకం ఒక్కటే వైవిధ్యమైన చిత్రం.

భార్యాభర్తల్లా విడిపోతున్నాం.. స్నేహితుల్లా కలిసుంటాం – మంచు మనోజ్

ఇక ఆ చిత్రం చేసిన చాలా రోజులకి మరోసారి ఈ ‘రాగల 24 గంటల్లో’ అనే థ్రిల్లర్ చిత్రంతో మన ముందుకురాబోతున్నారు. ఇప్పటివరకు ఆయన కేవలం కామెడీ చిత్రాలు మాత్రమే తీయగలరు అనే ఒక ముద్రని ఈ చిత్రం ద్వారా చెరిపేస్తారు అని అందరు కోరుకుంటున్నారు. మరి ఈ నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది చిత్రం విడుదలయ్యాక కాని తెలియదు.

ఇదిలావుండగా ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు రఘు కుంచె సంగీతం అందిస్తుండగా, ఛాయాగ్రహకుడిగా అంజి పనిచేశారు. ఇక ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి నవంబర్ 15న రాబోతున్నది. ఈ ట్రైలర్ విడుదల్లయ్యాక వస్తున్న క్రేజ్ చూస్తుంటే, చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆఖరుగా ఈ చిత్రంలో ఈషా రెబ్బ, సత్యదేవ్ లతో పాటుగా మరికొన్ని ప్రధాన పాత్రల్లో గణేష్ వెంకట్రామన్, ఒకరికి ఒకరు మూవీ ఫేమ్ శ్రీరామ్ నటించడం జరిగింది. ఈమధ్యకాలంలో సత్యదేవ్ కి మంచి పాత్రలు వస్తున్నాయి, మొన్నటికి మొన్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించగా ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కూడా ఒక కీలక పాత్ర దక్కింది అని సమాచారం. అలాగే గణేష్ వెంకట్రామన్ కూడా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన డమరుకం చిత్రంలో మంచి పాత్ర వేశాక, మరోసారి ఈ చిత్రంలో మరొక ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతున్నారు. మరో వైపు ఈషా కూడా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసిందంటూ వార్తలొస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస్ కానూరు ఎక్కడా కూడా నిర్మాణ విలువల్లో రాజీపడకుండా సినిమాని నిర్మించడం జరిగింది. మరి ఇన్ని హిట్ లక్షణాలున్న ఈ చిత్రం తప్పకుండా హిట్ అవ్వాలని మనసారా కోరుకుందాం.

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా…

Read More From Entertainment