ADVERTISEMENT
home / Bollywood
బాలీవుడ్ లో మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల ప్రేమకథ ఇప్పుడు హాట్ టాపిక్

బాలీవుడ్ లో మలైకా అరోరా – అర్జున్ కపూర్ ల ప్రేమకథ ఇప్పుడు హాట్ టాపిక్

ఛయ్య ఛయ్య చయ్యా చయ్యా…అంటూ కుర్రకారును తన హొయలతో ఆకర్షించిన అందాల నటి మలైకా అరోరా (malaika arora).. తెలుగులోనూ కెవ్వు కేక అంటూ పవన్ కల్యాణ్ సరసన డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. సల్మాన్ సోదరుడు నటుడు, నిర్మాత & దర్శకుడు అయిన అర్బాజ్ ఖాన్ ని 1997 లో వివాహమాడి.. తాజాగా రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ పదహారేళ్ల కొడుకు అర్హాన్ కూడా ఉన్నాడు. తన ఇరవై ఏళ్ల బంధం విడాకుల దిశగా వెళ్లేందుకు కారణం ఇద్దరి మధ్య మనస్పర్థలు, సఖ్యత కుదరకపోవడమేనని వెల్లడించింది. విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే ప్రముఖ బాలీవుడ్ హీరో, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ (arjun kapoor) తో తన ప్రేమ వ్యవహారం కొన్ని నెలల నుంచి వార్తల్లో అంశంగా మారిపోయింది. 

భార్యాభర్తల్లా విడిపోతున్నాం.. స్నేహితుల్లా కలిసుంటాం – మంచు మనోజ్

అయితే వీరిద్దరికి సంబంధించి వార్తలు చాలారోజుల నుండి మీడియాలో ప్రచారమవుతున్నప్పటికి కూడా వీరంటూ ప్రపంచానికి తమ మధ్య ఉన్న ప్రేమని వ్యక్తం చేసింది మాత్రం కొన్ని నెలల క్రితం మాత్రమే. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన విడాకులు, తిరిగి పెళ్లి చేసుకోవడం వంటి అంశాల గురించి మాట్లాడిన మలైకా..  సాధార‌ణంగా ప్ర‌తిఒక్క‌రూ జీవితంలో చేదు జ్ఞాప‌కాలు ఎదురైనా ముందుకు సాగిపోవాల‌ని కోరుకుంటారు. త‌మకు న‌చ్చిన వారితో ప్రేమ‌, రిలేష‌న్‌షిప్ కొన‌సాగించాల‌ని భావిస్తారు. అలా మీకెవ‌రైనా దొరికితే మీరు చాలా అదృష్ట‌వంతుల‌ని చెప్పుకోవాలి. రెండోసారి అర్థం చేసుకునే వ్య‌క్తి దొర‌క‌డం, త‌నతో జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌డం అనేది చాలా త‌క్కువ మంది అదృష్ట‌వంతులకు ఎదుర‌య్యే అవ‌కాశం. నా చుట్టు ఉన్న‌వాళ్లు ఎన్ని చెప్పినా నా జీవితం గురించి నేనే ఓ నిర్ణ‌యం తీసుకున్నా. అది నాకెంతో ఆనందాన్ని అందిస్తోంది.. అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఇక తన రిలేషన్ షిప్ కి సంబంధించిన విషయాన్ని ప్రపంచానికి చెప్పింది మాత్రం అర్జున కపూర్ పుట్టినరోజు నాడే అని చెప్పుకోవచ్చు. ఆ రోజు మలైకా అరోరా తన సోషల్ మీడియా వేదికగా అర్జున్ కపూర్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసి తమ మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా ప్రకటించేసింది. తాజాగా మలైకా అరోరా పుట్టినరోజు సందర్భంగా అర్జున్ కపూర్ తన సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ కలిసి దిగిన మరొక ఫోటోని పోస్ట్ చేస్తూ లవ్ సింబల్ ని చేర్చాడు. దీంతో వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా వెల్లడించారని చెప్పుకోవచ్చు.  అలాగే ఈమధ్య కాలంలో వీరిరువురు ఇచ్చిన ఇంటర్వ్యూలల్లో కూడా ముచ్చటించడం జరిగింది.

ADVERTISEMENT

 

జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే

మొన్నీమధ్యనే ఒక ఇంటర్వ్యూ లో మలైకా అరోరా మాట్లాడుతూ తాను తన భర్త నుండి ఎందుకు విడాకులు తీసుకున్నానో తమ ఇద్దరికీ ఒక స్పష్టత ఉంది అని తెలిపింది. అలాగే తన 16 ఏళ్ళ కొడుకు అర్హాన్  ఖాన్ కి కూడా తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే విషయం గురించి తామిద్దరం చెప్పడం జరిగిందని వివరించింది. అయితే ఇలాంటివి పిల్లల పైన ప్రభావం కచ్చితంగా చూపిస్తాయి కాబట్టే, తాను జాగ్రత్తలు తీసుకున్నాను అని వివరించింది.

బాలీవుడ్ లో వీరిద్దరి ప్రేమకథ (love story) చాలా పెద్ద సంచలనం. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. అర్జున్ కపూర్ సల్మాన్ ని తన గురువుగా భావిస్తాడు. అర్జున్ సినిమాల్లో హీరోగా నిలదొక్కుకునేందుకు కూడా తను సాయం చేశాడట. అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం  కాకముందు సల్మాన్ సోదరి అర్పితా ఖాన్, అర్జున్ కపూర్ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారట. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఒకే ఇంట్లో ముందు అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత ఆమెకు వదిన వరసలో ఉన్న వ్యక్తిని అదీ తన కంటే పన్నెండేళ్లు పెద్దదైన స్త్రీని అర్జున్ ప్రేమించడం పై మీడియా కోడై కూసింది. మలైకా అర్జున్ ల బంధం వల్లే అర్భాజ్, మలైకాలు విడిపోయారని కూడా కొన్ని ఛానెళ్లు ప్రసారం చేశాయి. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. 

ADVERTISEMENT

ఇవన్ని పక్కకి పెడితే, మలైకా అర్జున్ ల ప్రేమ అనగానే వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడానే గుర్తొస్తుంది. తనకన్నా 12 ఏళ్ళ చిన్నవాడితో ప్రేమ గురించి కూడా వెల్లడించింది మలైకా.. వయసు పరంగా తను నాకంటే చిన్నవాడు అయి ఉండొచ్చు.. కానీ మానసికంగా తను నాకంటే మెచ్యూర్డ్. తను జీవితంలో చాలా ఒడిదొడుకులు ఎదురుకున్నాడు. నేను కూడా దాదాపు అంతే… అందుకే మా ఇద్దరికి ఒకరంటే ఒకరు నచ్చి ఉండవచ్చు అని చెప్పింది. అంతేకాదు.. ప్రస్తుతం తాము ఉన్న బంధంలో ప్రశాంతంగా ఉన్నాము అని, ఈ బంధాన్ని పెళ్లి గా మార్చుకునేంతగా ఆలోచించలేదు అని చెప్పుకొచ్చింది. అర్జున్ కూడా పెళ్లి చేసుకునే ఆలోచనలు ఇప్పుడప్పుడే లేవని స్పష్టంగా చెప్పడం జరిగింది. 

ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు కేవలం మనసులు ఒక్కటైతే చాలు అని చాటుతుందీ జంట. అంతేకాదు.. జీవితంలో ఒక్కసారి పరాజయం ఎదురైతే జీవితాంతం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. ముందుకెళ్తే మన జీవితం ఆనందంగా మారుతుందని మలైకా కథ మనకు చెబుతుంది. వీరిద్దరి ప్రేమ, పెళ్లి, జీవితం సాఫీగా సాగాలని కోరుకుందాం.

మాది 100 % ‘లవ్ స్టోరీ’ – సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

24 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT