జీవితంలో ముఖ్యమైనవి కూడు, నీడ.. మాత్రమే అని ఎవరన్నారో కానీ అది చాలా అబద్థం. ఏ మనిషైనా ఒక పూట తిండి లేకుండా ఉండగలడేమో గానీ ఒక్క రాత్రి నిద్ర(Sleep) లేకపోతే మాత్రం చాలా నీరసంగా తయారైపోతారు. అందుకే మనుషులకు తిండి, నిద్ర ఎంతో ముఖ్యం. కొందరికి తిండి కంటే నిద్రంటే మరీ ఇష్టం అని చెప్పవచ్చు. మీరూ అలాంటివారేనా.. రాత్రంతా మాత్రమే కాదు.. పగలంతా పడుకోవడం అంటే కూడా మీకు ఇష్టమా? నిద్ర కోసం అప్పుడప్పుడూ భోజనానికి కూడా దూరమవుతుంటారా? ఇలా రాత్రీపగలూ నిద్రపోవడానికి వీకెండ్స్ ఎప్పుడు వస్తాయా అని వేచి చూస్తుంటారా? అయితే అదృష్టం మీ తలుపు తట్టినట్లే !ఎందుకంటారా? మీరు నాసా ప్రకటించిన ఓ ఉద్యోగానికి ఎంపికవ్వడానికి మీరు అర్హులయ్యారు కాబట్టి..!
యూఎస్ఏ టుడే కథనం ప్రకారం నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) (NASA) స్పేస్‌లోకి వెళ్లినప్పుడు వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు రెండు నెలల పాటు రీసర్చ్ నిర్వహించనుంది. దీనికి పన్నెండు మంది అమ్మాయిలు, పన్నెండు మంది అబ్బాయిలు వాలంటీర్లుగా కావాలట. వీరికి కావాల్సిన అర్హత నిద్రంటే ఇష్టం ఉండడం మాత్రమే. ఈ వాలంటీర్లకు రెండు నెలలకు గాను 19000 అమెరికన్ డాలర్లు (సుమారు 1.3 లక్షల రూపాయలు) అందించనుందట.
ఇదంతా చూస్తుంటే ఆనందంగా ఉంది కదా..! ఈ ఉద్యోగానికి ప్రయత్నించాలని అనిపిస్తుంది కదా.. అయితే దీనికి కొన్ని షరతులు కూడా వర్తిస్తాయండోయ్.. నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) రెండూ కలిసి నిర్వహిస్తోన్న ఈ అధ్యయనం కోసం జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ డీఎల్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందట. ఈ ఇంటర్వ్యూలలో ఎంపికైన పన్నెండు మంది అమ్మాయిలు, పన్నెండు మంది అబ్బాయిలను తమ రీసర్చ్‌లో భాగం చేస్తారు. వీరిపై చేసే పరీక్షల్లో అంతరిక్షంలో భారరహిత పరిస్థితికి మన శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది..అన్న విషయంపై ముఖ్యంగా పరీక్షలు చేస్తారట. ఇలా వీరిపై చేసే పరిశోధనల తర్వాత శరీరంపై ఎదురయ్యే నెగెటివ్ ప్రభావాలను తెలుసుకొని అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు వ్యోమగాములకు అలాంటి పరిస్థితి ఎదురవకుండా ఉండేలా ప్రతి చర్యలను ప్లాన్ చేస్తారట.
ఇంతేకాదు.. ఇక్కడ చేయాల్సింది ఇంకా ఉంటుందట. ఏబీసీ న్యూస్ కథనం ప్రకారం ఈ అధ్యయనంలో పాల్గొనే వాలంటీర్లను రెండు వర్గాలుగా విభజిస్తారట. ఇందులో మొదటి వర్గానికి చెందిన వారిని సెంట్రిఫ్యూజ్‌లో ఉంచి గుండ్రంగా తిరిగేలా చేస్తారట. ఎందుకనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ గ్రావిటీ ఛాంబర్.. అంటే అంతరిక్షంలో భూమ్యాకర్షణ శక్తి లేని చోట ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉండేలా చేసేందుకు ఈ ఏర్పాటు అన్నమాట. దీని వల్ల రక్తప్రసరణ, రక్తపోటు.. ఇతర శరీర భాగాల పనితీరుపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో గమనిస్తారు పరిశోధకులు.
మొదటి బృందానికి చెందిన వారికి ఇలాంటివన్నీ ఉంటాయని ఇది చూసి భయపడుతున్నారా? ఏమాత్రం భయం అవసరం లేదు. ఇక రెండో బృందానికి చెందినవారు చేయాల్సిన పని ఇంకేమీ ఉండదు తెలుసా.. ఓ మంచి బ్లాంకెట్, స్లీపింగ్ మాస్క్ తీసుకొని హ్యాపీగా నిద్రపోవడం మాత్రమే వారు చేయాల్సిన పని.. చాలా బాగుంది కదా.. మరి, మీరూ ఓ ట్రయల్ వేస్తారా?
ఈ ప్రపంచంలో నిద్రపోవడానికి సంబంధించి ఎన్నో ఉద్యోగాలున్నాయని మీకు తెలుసా? గతంలో కూడా ఓ పరుపుల తయారీ కంపెనీ తమ పరుపుల నాణ్యత చెక్ చేయడానికి గాను వాటిపై నిద్రపోవడానికి ఉద్యోగులను ఎంపిక చేసుకుంది. మీకు ఆసక్తి ఉంటే చాలు.. ఇలాంటి ఉద్యోగాలను వెతుక్కోవచ్చు. హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించవచ్చు.
మీకు ఒకవేళ ఈ ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే ఇక్కడ అప్లై చేసి ఉద్యోగం గురించి ప్రయత్నించండి మరి..!
ఇవి కూడా చదవండి.
నిద్రంటే ప్రాణమైతే.. ఇలాంటి ఆలోచనలు మీకూ వస్తుంటాయి..!
రెండు గర్భాశయాలతో.. నెల వ్యవధిలో ముగ్గురికి జన్మనిచ్చిందీ తల్లి..!
బిడ్డను ఎయిర్‌పోర్ట్‌లో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కిందో తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
Images : Shutterstock, Giphy.
Read More From Education
ఆమె 105 సంవత్సరాల విద్యార్థిని.. నాలుగో తరగతి పాసై రికార్డు సాధించిన బామ్మ..
Soujanya Gangam
ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేసే 85 టీచర్స్ డే కొటేషన్లు (Teacher’s Day Quotes In Telugu)
Lakshmi Sudha