Education

Inspirational Quotes In Telugu – ఈ 75 లైఫ్ కొటేషన్స్ మీలో స్ఫూర్తిని కలిగిస్తాయి..!

Soujanya Gangam  |  Jul 16, 2019
Inspirational Quotes In Telugu –  ఈ 75 లైఫ్ కొటేషన్స్ మీలో స్ఫూర్తిని కలిగిస్తాయి..!

జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.

ఈ క్రమంలో మనం జీవితంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు.. అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు కాస్త స్ఫూర్తి అవసరమే. అలాంటప్పుడు జీవితం విలువను.. మనల్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని, సానుకూలతను పెంపొందించుకోవాలి. అందుకే ఈ  అవసరాన్ని గుర్తు చేసే మంచి లైఫ్ కొటేషన్స్ (Life quotes) రోజూ చదువుకోవడం.. వీలుంటే స్నేహితులతో కూడా షేర్ చేయడం వల్ల మనకు జీవితంలో.. ఓ కొత్త ఆనందం, స్ఫూర్తి కలుగుతాయి.

 

జీవితం గురించి ప్రముఖ వ్యక్తులు చెప్పిన కొటేషన్లు (Famous Life Quotes)

shutterstock

1. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం.. : హెలెన్ కెల్లర్

2. ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి : మార్క్ ట్వెయిన్

3. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి : డేవిడ్ బ్రింక్ లీ

4. సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్

5. నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే.. ఒక్కసారి జీవించినా చాలు : మే వెస్ట్

6. తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు. : బెంజమిన్ ఫ్రాంక్లిన్

7. సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు : జాక్సన్ బ్రౌన్

8. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది : ఆంథోనీ రాబిన్స్

9. ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. : పాబ్లో పికాసో

వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? మీ కోసమే ఈ 160 కొటేషన్లు (Quotes For Whatsapp In Telugu

పాజిటివ్ కోట్స్ (Positive Quotes)

shutterstock

1. మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.

2. మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది ఫీలవుతాం. అదే జీవితం. కానీ జరిగేదంతా.. మనకు ఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.

3. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు.. మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్నమాట.

4. సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు. అయితే మనకు కావాల్సిందల్లా  పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.

5. జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు.. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం. 

6. మనం అందరి గురించి పాజిటివ్‌గా ఆలోచించి.. పాజిటివ్‌గా మాట్లాడితే.. అదే పాజిటివిటీ మనకు కూడా సంక్రమిస్తుంది.

7. ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు  అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే.. తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి. 

8. ఉదయం నిద్ర లేవగానే.. నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగటివ్‌గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. నేనైతే ఆశావాదిగా ఉంటాను. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది.

9. జీవితంలో మనం ఎవరిని కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది.. మనపై ఆధారపడి ఉంటుంది.

Read More: Good morning quotes in telugu

రక్షాబంధన్‌కి మీ సోదరుడికి ఇలా విషెస్ చెప్తే వాళ్లెంతో సంతోషిస్తారు..

జీవిత సత్యాలను తెలిపే కొటేషన్లు (Life Quotes)

shutterstock

1. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి.

2. మన జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే.. అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది.

3. జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే.. అది అందించే ఫన్‌ని ఎంజాయ్ చేయలేం.

4. మన జీవితంలో రెండు తేదీలు ముఖ్యం. మన సమాధిపై రాసే జనన, మరణ తేదిలవి. కానీ ఆ రెండు తేదీల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో.. మనం ఏం చేశామనేది మాత్రమే.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు.

5. జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువ పొందడానికి ఒకే ఒక్క దారి.. దాన్నో పెద్ద అడ్వెంచర్‌గా చూసి.. ధైర్యంగా ముందుకెళ్లడమే..

6. జీవితంలో మనం సాధించగలిగే సక్సెస్ ఒకటే. అది మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా జీవించగలగడమే. 

7. జీవితం అనేది ఓ పెద్ద కాన్వాస్ లాంటిది. దానిపై ఎన్ని కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే.. జీవితం అంతే కలర్ ఫుల్‌గా ఉంటుంది. అందుకే కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడద్దు.

8. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు .. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.

9. గతం గురించి ఎప్పటికీ గుర్తుంచుకోండి.. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కనండి. కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం.

స్ఫూర్తినిచ్చే కొటేషన్లు (Inspirational Quotes)

shutterstock

1. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి.. ఆ పని చేయడమే.

2. నిరాశావాది తనకు ఎదురైన.. ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు.

3. జీవితంలో మనం గెలుపు కంటే.. ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

4. జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే.. దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ.. ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.

5. తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.

6. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.

7. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు. దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు. దాని గురించి పని చేయడం తెలియాలి.

8. జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏదీ మిగలదు.

9. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.

10. జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు.. అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.

బైబిల్, ఖురాన్, భగవద్గీతలోని కోట్స్ (Religious Quotes)

shutterstock

1. ఒకరిగా ఉండడం కంటే ఇద్దరుగా ఉండడం మంచిది. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుతారు : బైబిల్

2. అన్నింటికంటే.. ఒకరిపై మరొకరు చూపే ప్రేమ గొప్పది. అది ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది. : బైబిల్

3. చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. : బైబిల్

4. ప్రార్థన చేయడం.. ఓపిగ్గా వేచి చూడడం వల్ల.. అల్లా కష్టాల నుంచి మనల్ని దూరం చేస్తాడు. : ఖురాన్

5. అల్లా మంచి వాళ్లకు మేలు చేయడం ద్వారా.. వారి మంచితనానికి ప్రతిఫలాన్ని అందిస్తాడు. : ఖురాన్

6. దేవుడు నిన్ను వదిలేయలేదు. నీ కష్టాలను చూసి దూరంగా ఉండలేదు. ఇది పరీక్ష కాలం మాత్రమే. దీన్ని గెలిస్తే అల్లా నీకు చక్కటి జీవితాన్ని అందిస్తాడు. : ఖురాన్

7. వెయ్యి యుద్ధాలు గెలవడం కంటే నిన్ను నువ్వు గెలవడం.. నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎంతో అవసరం. నిన్ను నువ్వు గెలిస్తే.. నీ నుంచి నీ గెలుపును ఎవరూ దూరం చేయలేరు. : గౌతమ బుద్ధుడు

8. మన మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే.. అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. : భగవద్గీత

9. ఇతరుల పనులను మనం సమర్థంగా చేయడం కంటే.. మన పనులను మనం కనీసం తప్పులతో అయినా చేయడం మంచిది. : భగవద్గీత

10. ఒక వ్యక్తి చేసే పనిని ఆనందిస్తూ చేయడం వల్లే.. అందులో ఎనలేని నైపుణ్యాన్ని సాధించగలుగుతాడు : భగవద్గీత

ఓటమి గురించి కొటేషన్లు (Failure Quotes)

shutterstock

1. జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి.. కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చేయలేకపోయిన అంశాలే ఉంటాయి.

2. మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు.. కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్ని సార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి.

3. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతిఒక్కటీ.. భయానికి అవతలి వైపు దాగి ఉంటుంది.

4. ఓటమనేది.. మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే.. గెలుపు మన సొంతమవుతుంది.

5. జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతాయి. అయితే జీవితంలో ఈ రెండూ మనకు ఎంతో ముఖ్యం.

6. నేను ఓడిపోలేదు. నేను సాధించాలనుకున్న చోటుకు చేరలేని.. మరో పదివేల మార్గాలను కనుక్కున్నా.

7. ఓటమి భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది. మనం కన్న కలలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది.

8. గెలుపు పొందేవారు ఓటమి గురించి భయపడతారు. కానీ ఓడిపోయిన వాళ్లు ఇక భయపడేందుకు ఏమీ ఉండదు. గెలుపు కోసం కష్టపడడం తప్ప.

9.ఓటమి అనేది గెలుపుకి మార్గం. ఓటమి వద్దనుకున్నవాళ్లు గెలుపును కూడా సాధించలేరు.

10. ఓటమి భయాన్ని గెలిచిన వ్యక్తే జీవితంలోనూ గెలుస్తాడు. అనుకున్నది సాధిస్తాడు.

జీవిత పాఠాలు చెప్పే కొటేషన్లు (Motivational quotes)

shutterstock

1. మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది.

2. జీవితంలో కొన్ని తలుపులు మూసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది మీ గర్వం, పొగరు, పనికిరానితనం వల్ల కాదు.. ఆ తలుపులు మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లలేవు కాబట్టి.

3. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు. పైగా గర్వపడాలి. ప్రతిఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది.

4. మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చేయాలి. అది అవతలివారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా.. వారిని బాధిస్తుందన్నా.. మన కోసం మనం జీవించాల్సిందే.

5. ఒక తెలివైన వ్యక్తి.. ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేని వాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు.

6. జీవితం అనేది పది శాతం మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90 శాతం ఆ పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది.

7. మనం మనసులో ఎంత వరకూ ఆనందంగా ఉండాలనుకుంటామో.. అంతే ఆనందంగా ఉండగలుగుతాం.

8. జీవితంలో ప్లాన్ A పని చేయకపోతే.. మరో 25 అక్షరాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. తెలుగులో అయితే 56.

9.జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచిచూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచీ మంచివై ఉంటాయి లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి.

10. లైఫ్‌లో ఎదురయ్యే కష్టాలు.. ఆర్డినరీ వ్యక్తులను ఎక్స్‌ట్రార్డినరీ వ్యక్తులుగా మార్చేస్తాయి.

జీవితం గొప్పదనాన్ని చెప్పే కోట్స్ (Valuable Quotes)

shutterstock


1. తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. 

2. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడ్‌ని మాత్రమే కాదు.. మీతో పాటు ఉండే చాలామంది మూడ్‌ని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి. ఇతరులతో ప్రేమగా ఉండండి.

3. జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే .. జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం.

4. జీవితం మొత్తం ఎగుడుదిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్లినప్పుడు పొగరు పెరగకుండా.. కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా.. ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత.

5. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా.. మనం సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉండే ఉంటాయి.

6. జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళ్తూనే ఉండాలి.

7. జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామో.. అది అంత కంటే గొప్పగా మారుతుంది.

8. జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దాని కోసం బెస్ట్‌గా ప్రయత్నిస్తే చాలు.

9. జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైన విషయం జీవితాన్ని ఎంజాయ్ చేయడం.. అదొక్కటి చేస్తే చాలు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

కుటుంబం అంటేనే సంతోషం .. (ఈ కొటేషన్లు కచ్చితంగా మీ ఫ్యామిలీని గుర్తుచేస్తాయి)

Read More From Education