Education

“యువతా మేలుకో..” – అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. ఈ కొటేషన్లు మీకోసం..!

Soujanya Gangam  |  Aug 8, 2019
“యువతా మేలుకో..” – అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. ఈ కొటేషన్లు మీకోసం..!

1985 సంవత్సరం నుండీ స్వామి వివేకానంద ( Swami Vivekananda) జయంతిని పురస్కరించుకొని.. జనవరి 12 తేదిన మన దేశంలో “యూత్ డే”ని (Youth day) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. యువత తమ శక్తిని ఎలా వెలికితీయాలి? ఎలా విజయవంతంగా ముందుకు సాగాలి? వంటి అంశాల పై చర్చిస్తూ.. యువతలో ప్రేరణను నింపే థీమ్స్‌తో.. ఈరోజును జరుపుకోవడం విశేషం.

కానీ మన దేశానికి ఒక “యూత్ డే” ఉన్నట్లే.. అంతర్జాతీయంగా కూడా యువత కోసం ప్రత్యేకంగా ఒక రోజుంది. అదే  “అంతర్జాతీయ యువజన దినోత్సవం”. 2000 సంవత్సరం నుంచి.. ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తోంది ఐక్యరాజ సమితి. ఈ రోజును పురస్కరించుకొని.. వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి, స్నేహితులకు పంపడానికి వీలుగా.. కొన్ని ప్రేరణాత్మకమైన కొటేషన్లను మీకు అందిస్తున్నాం ..!

Shutterstock

యూత్ డే విషెస్.. (Youth Day Wishes)

1. రేపటి తరానికి హీరోలు.. రేపటిని నిర్దేశించే శక్తి నిండిన వ్యక్తులు మీరే. యూత్ డే శుభాకాంక్షలు.

2. ఒక దేశం భవిష్యత్తు..  యువతపై ఆధారపడి ఉంటుంది. మన దేశాన్ని నడిపించే యువ హీరోలకు నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు.

3. మీలోని శక్తి, మీ ఆలోచనలు, మీ చేతలు మీ భవిష్యత్తు ఎలా ఉండాలో చెబుతాయి. మీ భవిష్యత్తు చాలా అందంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ నేషనల్ యూత్ డే.

4. మన దేశ యువత బాధ్యత.. వారి భవిష్యత్తు పట్ల మాత్రమే కాకుండా.. వారి కుటుంబం, సమాజం, దేశం పట్ల  కూడా బాధ్యతాయుతంగా ఉండడమే. అలాంటి యువ శక్తికి “యూత్ డే” శుభాకాంక్షలు.

5. యువత ఎప్పుడూ స్వేచ్ఛ కలిగి ఉండాలి. అయితే ఆ స్వేచ్ఛలోనూ కాస్త బాధ్యత ఉండాలి. అప్పుడే వారి జీవితం సరైన దారిలో నడుస్తుంది. యూత్ డే శుభాకాంక్షలు.

6. యువకులుగా మీ జీవితాన్ని సరైన రీతిలో గడపండి. ఎందుకంటే ఆ రోజులు తిరిగి ఎప్పుడూ రావు. దాన్ని బాధ్యతాయుతంగా గడిపితేనే.. భావి జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. హ్యాపీ యూత్ డే.

7. ఏ దేశంలో అయితే యువ శక్తి ఎక్కువగా ఉంటుందో.. ఆ దేశం ప్రపంచంలోనే ఎక్కువ వనరులతో ముందుకెళ్తుంది. యూత్ డే శుభాకాంక్షలు.

 

ఇంతే అద్భుతంగా మీ ప్రియమైన వారికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పండి.

సోదరులకి చెప్పే రక్షాబంధన్ విషెస్ (Raksha Bandhan Quotes In Telugu)

Shutterstock

8.  నిరంతరం కష్టపడుతూ.. విజయాన్ని కాంక్షించడమే యువత లక్ష్యం కావాలి. హ్యాపీ యూత్ డే.

9. యవ్వనం శక్తిని చాటుతుంది. పాజిటివిటీని, అనుకునేది చేయగలిగే శక్తిని చాటుతుంది. ఇవన్నీ మీకు అందాలని కోరుకుంటూ యూత్ డే శుభాకాంక్షలు.

10. మనల్ని మనం నమ్మడం మొదలుపెట్టిన రోజే మన జీవితం మొదలవుతుంది. అందుకే అన్నింటికంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టండి. హ్యాపీ యూత్ డే.

11. మన దేశ యువత శక్తియుక్తులు, తెలివితేటలు అసామాన్యం. ఈ యూత్ డే రోజున మీకోసం ప్రత్యేకమైన శుభాకాంక్షలు పంపుతున్నా..

12. మన దేశంలో కొత్త మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్న యంగ్ గన్స్‌కి యూత్ డే శుభాకాంక్షలు. ఈ యంగ్ గన్స్ దేశాన్ని ఓ కొత్త మార్పు దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.

13. యూత్ డే అనేది.. నువ్వు అనుకున్న పనులు చేసేందుకు తగిన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, మోటివేషన్ అన్నీ నీలో ఉన్నాయని.. నీకు చాటి చెప్పే మరో అద్భుతమైన రోజు మాత్రమే. యూత్ డే శుభాకాంక్షలు.

14. నీకు కలలు కనే శక్తి ఉంది. ఆ కలలను నిజం చేసుకునే శక్తి కూడా ఉంది. అద్భుతమైన శక్తి, బలమైన ఆలోచనలు నీకెప్పుడూ తోడుండాలని కోరుకుంటున్నా. హ్యాపీ యూత్ డే.

15. యువత అనేది చక్కటి శక్తిసామర్థ్యాలు, ఉన్నతమైన కొంగొత్త ఆలోచనలు, ఆకట్టుకునే తెలివితేటల ప్యాకేజీ. దేశం సక్సెస్‌కి ఇదే మంచి ఫార్ములా. హ్యాపీ యూత్ డే.

కుటుంబం అంటేనే సంతోషం .. (ఈ కొటేషన్లు కచ్చితంగా మీ ఫ్యామిలీని గుర్తుచేస్తాయి)

వివేకానందుని కోట్స్ (Vivekananda Quotes)

wikipedia

1. జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు గెలిస్తే అందరినీ ముందుండి నడిపిస్తారు. ఓడిపోతే ఇతరులను నడిపించవచ్చు. : స్వామి వివేకానంద

2. జీవితం అంటే బలమే.. బలహీనంగా ఉంటే అది చావే..

3. జీవితంలో అనుభవం అనేది మంచి టీచర్. మనం ఎంతైనా మాట్లాడొచ్చు.. కానీ ఏదైనా మన జీవితంలో అనుభవం అయ్యేవరకూ మనం కొన్ని విషయాలు నేర్చుకోలేం.

4. ధ్యానం తెలివితక్కువ వాళ్లను కూడా మహాత్ములను చేస్తుంది. కానీ తెలివితక్కువ వాళ్లు మాత్రం ఎప్పుడూ ధ్యానం చేయరు.

5. ఇతరులలో నీకు లేని ఏ మంచి అలవాటు ఉన్నా.. దాన్ని నేర్చుకోవడం అవసరం. అయితే దాన్ని వాళ్లు చేసినట్లుగా కాకుండా.. ఆ అలవాటును మాత్రం నేర్చుకొని.. నీ పద్దతిలో నువ్వు ఆచరించడం వల్ల.. నువ్వు నీలాగే ఉన్నా.. మంచి అలవాట్లు పాటించగలుగుతావు.

6. మానసికంగా బలహీనంగా ఉన్నవారే తప్పులు చేస్తారు. అయితే ఈ బలహీనత వారి బలహీనత వల్ల, వారి తెలియనితనం వల్ల వచ్చిందని మాత్రం వారు గ్రహించరు.

7. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడూ కార్యసిద్ధికి అత్యావశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కంటే ముఖ్యమైనది.

జీవితం విలువను తెలియజేసే ఈ 75 లైఫ్ కొటేషన్స్ .. మీలో స్ఫూర్తిని కలిగిస్తాయి..!

8. మన ఆలోచనలను బట్టే మన జీవితం ఉంటుంది. మనం బలహీనులమని భావిస్తే బలహీనంగానే ఉంటాం. శక్తివంతులం అని భావిస్తే మీలోని శక్తిని గుర్తించగలుగుతారు.

9. విజయం నీ సొంతమైందని విర్రవీగకు.. ఓటమి ఎదురైందని నిరాశపడకు. విజయం అంతం కాదు.. ఓటమి నువ్వు వెళ్లే దారిలో ఆఖరి మెట్టు కూడా కాదు.

10. మిమ్మల్ని మీరు నమ్మకపోతే.. మీరు దేవుడిని కూడా నమ్మలేరు.

11. రాబోయే ఫలితం మీద ఎలా శ్రద్ధ చూపిస్తారో.. దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పెట్టి పనిచేయాలి. వెళ్లే దారి మంచిదైతేనే ఫలితం కూడా మంచిది అనిపించుకుంటుంది.

12. ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. గొప్ప విశ్వాసం ఉన్నప్పుడే అద్భుతమైన పనులు సాధ్యమవుతాయి.

13. ఇతరులు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని బాధపడకు. వాళ్లను నచ్చినట్లుగా మాట్లాడనివ్వండి. మీరు మీ ఆశయాలను సాధించేందుకు.. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సమస్త లోకం మీ పాదాక్రాంతం అవుతుంది.

14. మనిషి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నప్పుడు అతడు ఏదో కోల్పోయినట్లు కాదు.. కోల్పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి అంతా కోల్పోయినట్లు లెక్క.

15. తనను తాను ద్వేషించుకోవడం మనిషికి ఉన్న అన్ని బలహీనతల కంటే పెద్దది. తనని తాను ద్వేషించుకోవడం ప్రారంభించిన వ్యక్తి తప్పక పతనమవుతాడు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Education