Brothers

మీ ప్రియమైన వారికి puttina roju subhakankshalu ఇలా చెప్పండి (Birthday Wishes In Telugu)

Sandeep Thatla  |  Jul 30, 2019
మీ ప్రియమైన వారికి puttina roju subhakankshalu ఇలా చెప్పండి (Birthday Wishes In Telugu)

పుట్టిన రోజు (Puttina roju, Janmadhinam) – ఈ రోజుని ఎవరికి వారు తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత అటువంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే – ఈ ప్రపంచంలో మనిషికున్న తెలివితేటలు, సౌకర్యాలూ.. ఏ ఇతర జీవికీ లేవన్నది అక్షర సత్యం.

Table of Contents

  1. అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Mom)
  2. నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Dad)
  3. కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Son)
  4. కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Daughter)
  5. అక్క/చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Sister)
  6. అన్న/తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Brother)
  7. భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Wife)
  8. భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Wishes for Husband)
  9. స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Wishes for Friends)
  10. అమ్మమ్మ /నాన్నమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Wishes for Grandmother)
  11. తాతయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Grandfather)
  12. మనవరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Grand Daughter)
  13. మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Grand Son)

అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అలాగే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు (Puttina roju subhakankshalu) తెలియజేస్తాం. 

‘ఫ్రెండ్‌షిప్ డే’ రోజున.. మీ స్నేహితులకి ఈ సరదా సందేశాలు పంపించండి!

ఈ కాలంలో ఫ్రెండ్ షిప్ డే, వాలెంటైన్స్ డేలతో పాటుగా.. రాఖీ పండుగ, దసరా, సంక్రాంతి & ఉగాది వంటి ప్రధాన పండుగల సందర్భంగా శుభాకాంక్షలను సందేశాల రూపంలో పంపించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. 

ఇక ఇక్కడ మనకి పుట్టినరోజు నాడు ఫ్రెండ్స్‌తో పాటుగా కుటుంబసభ్యులకు ఒక్కొక్కరిగా శుభాకాంక్షలు చెప్పడానికి ఈ క్రింద రకరకాల రిలేషన్స్‌కి సంబంధించి విషెస్‌ని (Happy birthday in telugu) రాయడం జరిగింది. మీరు కూడా ఒకసారి ఈ క్రింద జాబితా చూస్తే మీకే అర్ధమైపోతుంది.

అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Mom)

  1. దేవుడు అన్నిచోట్లా ఉండలేక… సృష్టించిన పాత్రే ‘అమ్మ’! అంతటి గొప్పదైన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. అనుక్షణం మా అభివృద్ధి, శ్రేయస్సు గురించి ఆలోచించే ‘అమ్మ’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. ఏ దేశమేగినా .. ఏ తీరం దాటినా.. మరువని మమకారమే ‘అమ్మ’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. ఎన్నడూ ఆందోళన దరి చేరనీయకుండా కంటికిరెప్పలా కాపాడిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  5. ‘అమ్మ’ ప్రేమ తరువాతే ఇంకెవ్వరి ప్రేమ అయినా అని నాకు తెలిసేలా చేసిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

అమ్మ పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday wishes to Mother in Telugu

నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Dad)

  1. జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  5. గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

నాన్న పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday Wishes to Father

కొడుకుకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Son)

  1. భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  4. చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
  5. నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

మీ కొడుకు పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday wishes to Son

కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Daughter)

  1. నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
  2. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు
  3. నాకు రెండవ మాతృమూర్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
  4. నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
  5. నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

కూతురి పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday Wishes to Daughter

అక్క/చెల్లెలికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Sister)

  1. నా తొలి నేస్తం అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
  3. నాకు అక్కవి అయినా ఎప్పుడూ నన్ను నడిపించే అమ్మగా ఉన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు.
  4. ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
  5. నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  6. ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  7. అక్క… ఈ సంవత్సరం నీకు బాగా కలిసిరావాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  8. మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. అంతటి మంచి జ్ఞాపకాలు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  9. నా పుట్టినరోజు నాడు నీవు ఇచ్చిన బహుమతి ఎప్పటికీ నాకు ఫేవరెట్ గా నిలిచిపోతుంది. అలాంటి ఒక బహుమతే నీకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాను.
  10. నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.

అక్క/చెల్లెలు పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday Wishes to Sister

అన్న/తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Brother)

  1. తండ్రి తరువాత తండ్రి అంతటి పాత్రని నా జీవితంలో పోషించిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య.
  2. పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
  3. తమ్ముడు … భవిష్యత్తులో నీవు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.. దానికి నా వంతు సహాయం తప్పక చేస్తాను.. అని మాటిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  4. ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో నువ్వు విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
  5. నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా గడపాలని కోరుకుంటూ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు.
  6. నాన్న లేని లోటుని మన ఇంటికి ఎవరైనా తీర్చగలిగారు అని అంటే అది నువ్వే అన్నయ్య. మాకు ధైర్యాన్ని ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  7. తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నీ గుండె ధైర్యాన్నీ మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.
  8. నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది అంటే నమ్ము. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.
  9. చిన్నప్పుడు మనమిద్దరం కలిసి చూసిన మొదటి సినిమా ఇప్పుడు టీవీలో వస్తుంటే నాకు మన చిన్ననాటి జ్ఞాపకాలే కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అటువంటి ఎన్నో జ్ఞాపకాలు నా మనసులో పదిలంగా ఉన్నాయి. అంతటి మంచి జ్ఞాపకాలు ఇచ్చిన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
  10. నా తమ్ముడి జీవితంలో నా తరువాతే ఎవరైనా! అంతటి ప్రేమ నాపై కురిపించే వాడికి జన్మదిన శుభాకాంక్షలు.

అన్న/తమ్ముడి పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

ఫ్రెండ్‌షిప్ డే గిఫ్ట్ ఐడియాస్ & గ్రీటింగ్ కార్డ్స్ (Friendship Day Gift Ideas In Telugu)

Birthday Wishes to Brother

భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Wife)

  1. నీ రాక తో నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది. నా పైన అంతటి ప్రభావం చూపిన ప్రియసఖీ.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. ఎల్లప్పుడూ నా కష్టసుఖాల్లో తోడుండే నీకు జన్మదిన శుభాకాంక్షలు.
  3. నా గెలుపులో ఆనందాన్ని ఓటమిలో బాధని పంచుకునే నా భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు
  4. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకానికి కారణమైన నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  5. నా పిల్లలకే కాకుండా నాకు సైతం తల్లిగా మంచి విషయాలు చెప్పే నా భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  6. భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టి మా తల్లిదండ్రులకి కూతురు లేని లోటు తీర్చిన నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  7. నేను లేని సమయాల్లో ఇంటిని సమర్ధవంతంగా నిర్వహించే నా ప్రియమైన భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  8. నా జీవితంలోకి నువ్వు సరైన సమయంలో రావడంతో నేను మంచి నిర్ణయాలు తీసుకోగలిగాను అని నిర్మొహమాటంగా చెప్పగలను. అంతటి సమర్ధురాలైన నా భార్యకి జన్మదిన శుభాకాంక్షలు.
  9. మా ఇంటినే కాకుండా మా మనసులను కూడా అందంగా చూపించగలిగే నేర్పు మా ఆవిడ సొంతం.. అంతటి ఓర్పు & నేర్పు కలిగిన మా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  10. ఇంటి కోడలిగానే కాకుండా ఒక కూతురిగా కూడా ఆమె నిర్వహించే పాత్ర అభినందనీయం. అంతటి సమర్ధురాలైన నా భార్యకి జన్మదిన శుభాకాంక్షలు.

భార్య పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday Wishes to Wife

భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Wishes for Husband)

  1. నా ప్రాణస్నేహితుడినే జీవిత భాగస్వామిగా పొందగలిగే అదృష్టం కలిగించిన మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  2. నన్ను మీ భార్యగానే కాకుండా మీ మొదటి బిడ్డగా చూసుకునే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  3. నేను చేసే పొరపాట్లని సరిద్దిదుతూ ముందుకి నడిపించే నా ప్రియమైన భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నా జీవితభాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  5. నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  6. పెళ్ళైన తరువాత కూడా నా కెరీర్‌ని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఎల్లవేళలా నాకు మద్దతునిచ్చే నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  7. పెళ్లి & పిల్లలే జీవితం కాదు! నువ్వనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పెళ్లి అడ్డు కాకూడదు అని.. నాతో ఉన్నత విద్యని అభ్యసించేలా ప్రోత్సహించిన నా భర్తకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  8. నాకు తెలియని ఎన్నో విషయాలను నా భర్త ద్వారా తెలుసుకోగలిగాను. నాకున్న సమస్యలని సులువుగా తొలగించే భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  9. జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా.. దానిని నీవు తట్టుకుని నిలబడగలగాలి అని నాలో ధైర్యాన్ని నింపిన నా భర్తకి జన్మదిన శుభాకాంక్షలు.
  10. జీవితంలో లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. దాని కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉండాలి అని నాలో లక్ష్యసిద్ధిని పెంపొందించిన నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.

భర్త పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

Birthday Wishes to Husband

స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Wishes for Friends)

  1. నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
  2. నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.
  3. నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  4. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
  5. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
  6. స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు.
  7. జీవితంలో గెలవగలను అన్న ధైర్యంతో పాటుగా స్ఫూర్తిని కూడా నాలో నింపిన వారిలో నువ్వు ముందుంటావు నేస్తం. అటువంటి నీవు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
  8. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మన స్నేహమైతే.. ఆ స్నేహం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నువ్వే అన్నది సత్యం. నీలాంటి స్నేహితుడు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  9. జీవితంలో గెలవడానికి ఉన్న ప్రాధాన్యత కేవలం నీ మాటల వల్లే తెలుసుకోగలిగాను. నీలాంటి ప్రభావశాలి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
  10. ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో మంచి పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

స్నేహితుడి పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

 

Birthday Wishes to Friend

అమ్మమ్మ /నాన్నమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Wishes for Grandmother)

  1. నాకు తెలియని ఎన్నో విషయాలను అర్ధమయ్యేలా వివరించి చెప్పిన అమ్మమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
  2. అమ్మానాన్నలు తిడుతుంటే వారి నుంచి నన్ను ఎన్నోసార్లు కాపాడావు. నువ్వు ఎప్పుడూ నా వెన్నంటే నిలిచి నన్ను ముందుకి నడిపించావు నాన్నమ్మ. అలా నన్ను ప్రోత్సహించిన నీవు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
  3. జీవితంలో ఏది మంచి? ఏది చెడు? అని ఒక అవగాహన కల్పించడంలో నీ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేను బామ్మ. నీవు ఇలాగే ఎప్పుడూ నా వెంట ఉండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
  4. తల్లి లేని లోటుని నాకెన్నడూ తెలియకుండా పెంచిన అమ్మమ్మ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
  5. ప్రతిరోజూ రాత్రి నువ్వు చెప్పే కథలతో నా బాల్యమంతా కూడా ఒక తీయటి జ్ఞాపకంగా మారిపోయింది నాన్నమ్మ. ఇటువంటి జ్ఞాపకాలు నువ్వు నాకు ఇంకా అందిస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అమ్మమ్మ/నాన్నమ్మ పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

తాతయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Grandfather)

  1. స్కూల్‌లో నేను క్రికెట్ ఇంత బాగా ఆడుతున్నాను అని అంటే దానికి కారణం నువ్వు చిన్నప్పుడు నన్ను క్రికెట్ కోచింగ్ తీసుకెళ్లడమే తాతయ్య. అందుకే ఈ రోజు నీ పుట్టినరోజు సందర్భంగా స్కూల్‌లో క్రికెట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి నీకు అది బహుమతిగా ఇస్తాను.
  2. తాతయ్య పేరు చెప్పగానే గుర్తొచ్చేది మా కాలనీలో ఉన్న పార్క్. ఎందుకంటే చిన్నతనంలో నన్ను ఆడించడానికి పార్క్ కి తీసుకెళ్లేవాడివిగా.. అది నాకు ఎప్పటికీ గుర్తే. అంత మంచి జ్ఞాపకాలు ఇచ్చిన నీవు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
  3. డాడీ నన్ను ఎప్పుడు కోప్పడినా మీరు నన్ను వెనకేసుకోచ్చేవారు. అలా నా బాల్యం అంతా మీ చేతుల్లోనే గడిచింది. థ్యాంక్యూ తాతయ్య & మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలిచే మా తాతయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.
  5. నేను ఏది అడిగినా తాతయ్య దానికి అడ్డు చెప్పలేదు. నా అభిప్రాయాలను అన్ని వేళలా సమర్ధించే మా ప్రియమైన తాతయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.

తాతయ్య పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

మనవరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Grand Daughter)

  1. నువ్వు మా ఇంటి మహాలక్ష్మి. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదిస్తున్నాను.
  2. నీ పుట్టినరోజు ఇంటిల్లిపాదికీ పండగ రోజు అని వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఈ రోజు మన ఇల్లంతా పండగ వాతావరణంతో మెరిసిపోతున్నది.
  3. నీలో మీ అత్తయ్య (నా కూతురు) పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నువ్వు వచ్చాక మీ అత్తయ్యని గుర్తు తెచ్చుకోవడం మానేసాము. పుట్టినరోజు శుభాకాంక్షలు.
  4. నీ ప్రతి పుట్టినరోజుకీ నేనొక బహుమతి ఇవ్వడం నాకు అలవాటు. అందుకే ఈ పుట్టినరోజుకి కూడా నీకు ఒక బహుమతి ఇస్తున్నాను.
  5. నాకు & మీ అమ్మమ్మకి తోడుగా నిలిచిన నీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అమ్మ.

మనవరాలి పుట్టినరోజుకి పైన పేర్కొన్న స్టైల్ లో విషెస్ చెప్పొచ్చు.

మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes for Grand Son)

  1. నా కొడుకు ఎదుగుతున్నపుడు చూడలేకపోయిన నేను… ఆ తరువాత నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను చూస్తూ ఆ ముచ్చట తీర్చుకున్నాను మనవడా.. నువ్విలా ఎప్పుడు సంతోషంగా గడపాలి అని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
  2. మనవడా … నువ్వు నిండా నూరేళ్ళు సంతోషంగా జీవించాలి అని ఆశీర్వదిస్తున్నాను.
  3. నేను చేయాలనుకున్న పనిని నాకోసం నువ్వు చేసినప్పుడు నా ఆనందానికి అవధుల్లేవ్. నా ప్రియమైన మనవడికి జన్మదిన శుభాకాంక్షలు.
  4. నీ పుట్టినరోజు నాడు, నీకిష్టమైన స్వీట్స్ ప్రత్యేకంగా తయారు చేయించాను. హ్యాపీ బర్త్ డే.
  5. నీతో కలిసి చేసిన మోటార్ సైకిల్ ప్రయాణం ఎప్పటికీ నా మనసులో పదిలంగా ఉంటుంది. జన్మదిన శుభాకాంక్షలు మనవడా.
  6. చదివారు కదా.. మన ఇళ్ళల్లో ఉండే ప్రతి కుటుంబ సభ్యుని పుట్టినరోజు సందర్భంగా మనం వారికి శుభాకాంక్షలు తెలిపే విధంగా రకరకాల అనుబంధాలకు సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు..

మీకోసం మరికొన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్:

Happy Holi Wishes in Hindi

పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలా చెప్పి మీ జీవిత భాగస్వామిని ఇంప్రెస్స్ చేయండి

సోదరులకి చెప్పే రక్షాబంధన్ విషెస్

ఉపాధ్యాయుల గొప్పతనాన్ని తెలియజేసే 85 టీచర్స్ డే కొటేషన్లు

ఆగష్టు 15 న ఇలా విష్ చేయండి

మీ గారాల కూతురికి daughters day విషెస్ ఇలా చెప్పండి

नन्ही बिटिया के जन्मदिन पर कविता

Birthday Wishes for Brother in Hindi

पति के लिए जन्मदिन की शुभकामना

जन्मदिन की बधाई सन्देश

छोटी बहन के जन्मदिन पर शायरी

महिला दिवस की हार्दिक शुभकामनाएं