Dad

ఫాదర్స్ డే సందర్భంగా.. ‘నాన్న’కి సంబంధించిన ఆసక్తికర అంశాలు..! – (Fathers Day Quotes In Telugu)

Sandeep Thatla  |  May 22, 2019
ఫాదర్స్ డే సందర్భంగా.. ‘నాన్న’కి సంబంధించిన ఆసక్తికర అంశాలు..! – (Fathers Day Quotes In Telugu)

తల్లి మనకి జన్మనిస్తే… తండ్రి ఆ జన్మకి మూల కారణం.  మనమంటూ జీవం పోసుకున్నామంటే.. అది తల్లిదండ్రులిద్దరి  చలవే. అయితే మనలో చాలామంది తల్లి చాటు బిడ్డలనేది సత్యం. 

కానీ తల్లితో సరిసమానమైన ప్రేమను.. తండ్రి కూడా మనకు అందిస్తాడనడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే “తనలో ఉన్న భావోద్వేగాలను అంత సులువుగా బయటపెట్టుకోలేక..  బయటకి చాలా గంభీరంగా కనిపిస్తూ.. ఆ స్పందనని తన ముఖంలో కనబడనివ్వని వ్యక్తే – తండ్రి”  అనే నానుడి మన సమాజంలో బాగా నాటుకుపోయింది. తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే.. తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది. 

అందుకనే మాతృ దినోత్సవాన్ని (Mother’s Day)  జరుపుకునేంత స్థాయిలో.. పితృ దినోత్సవాన్ని (Father’s Day) జరుపుకోరు. ఇక సినిమాల్లో సైతం  తల్లి సెంటిమెంట్‌ని ఆధారం చేసుకునే చిత్రాలు ఎక్కువగా  వస్తుంటాయి. తప్పితే.. తండ్రి సెంటిమెంట్‌ని ఆధారం చేసుకుని వచ్చే చిత్రాలు మాత్రం ఒకటి అరా మాత్రమే ఉంటాయి.

ఫాదర్స్ డే కొటేషన్స్

‘తాతయ్య’కి సంబంధించిన స్పెషల్ కొటేషన్స్

‘నాన్న’ గొప్పతనాన్ని తెలిపే సినిమా పాటలు

ఫాదర్స్ డే కొటేషన్స్ (Amazing Father’s Day Quotation)

ఏదేమైనా.. మన జీవితాల్లో ఓ  విలక్షణమైన పాత్రను పోషించే.. గొప్ప వ్యక్తి తండ్రి‌ అనేది కాదనలేని సత్యం. ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా..  తండ్రి ప్రేమను చాటి చెప్పే కొటేషన్లు మీకోసం ప్రత్యేకం..!

‘నాన్న’కి ఫాదర్స్ డే విషెస్ తెలిపే.. 20 స్పెషల్ కొటేషన్స్ (20 Special Fathers Day Quotations)

* ఓర్పునకు మారుపేరు, మార్పునకు మార్గదర్శి, నీతికి నిదర్శనం… అన్నీ నాన్నే…

* గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకుని… ఓడినప్పుడు మన భుజంతట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి … ‘నాన్న’ ఒక్కడే.

* ప్రేమని ఎలా చూపించాలో తెలియని వ్యక్తి ‘నాన్న’ …

 * నీకు జన్మనే కాదు… భవిష్యత్తుని చూపెట్టేది కూడా నాన్నే..   

 * బయటకి కనిపించే నాన్న కోపం వెనుక.. ఎవ్వరికి కనపడని ప్రేమ ఉంటుంది…

 * నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు… సమాజంలో మంచి పేరుని కూడా ఇస్తాడు…

 * మనమెక్కిన తొలి విమానం… మన తండ్రి “భుజాలే!

 * నాన్న ప్రేమకి రూపం ఉండదు… భావం తప్ప!

 * నాన్న దండనలో ఒక ఒక హెచ్చరిక ఉంటుంది.. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది.

 * మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కాని.. ఆ జాబితాలో తొలిపేరు మాత్రం ‘నాన్నదే’

 * పిల్లలకి మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి… అన్ని ‘నాన్నే’

 * నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు. కాని అపజయం మాత్రం ఉండదు.

 * జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకి వెలకట్టే ‘సాధనం’ ఇంకా కనుగొనలేదు.

 * ఓడిపోయినా సరే… చేసే ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకి చెప్పే తొలి గురువు – ‘నాన్న’.

 * మనకంటూ ఒక గుర్తింపు రాక మునుపే.. మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు తండ్రి

 * మనకి తండ్రి విలు..వ మనం ఒక బిడ్డకి తండ్రి అయినప్పుడు కాని తెలియదు.

 * తల్లి తన మాటలతో పిల్లలో ధైర్యం నింపితే.. అదే ధైర్యాన్ని తండ్రి తన చేతలతో ఇవ్వగలుగుతాడు.

 * మనం జీవితంలో ఎప్పటికి మరవకూడని వ్యక్తుల్లో ‘నాన్న’ ఒకరు.

 * తొలి జీతం అందుకున్న రోజున.. మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి ‘నాన్న’

 * జీవితంలో ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకి వచ్చే మాట ‘నాన్న’.

Also Read About కుమార్తె రోజు శుభాకాంక్షలు

గొప్ప వ్యక్తులు చెప్పిన..  ఫాదర్స్ డే కొటేషన్స్ (Fathers Day Quotes By Great People)

* నేను ఒక మంచి తండ్రిగా నా పిల్లలకి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, నేను ఒక గొప్ప తండ్రికి కొడుకుని కాబట్టి! – కాల్విన్ జాన్సన్ (అమెరికా ఫుట్ బాల్ ఆటగాడు)

* ఈ ప్రపంచంలో దేని గురించి కూడా అతిగా ఆలోచించొద్దని చెప్పాడు మా నాన్న. ఎందుకంటే ‘పెర్ఫెక్ట్’ అంటూ  ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. – స్కాట్ ఈస్ట్ వుడ్ (నటుడు).

 

‘నాన్న’కి సంబంధించిన ఫన్నీ సినిమా డైలాగ్స్  (Best Film Dialogues Related To Father’s Day) 

* అంతా మీరే చేశారు!! (హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు చిత్రంలో తండ్రి పాత్ర చేసిన ప్రకాష్ రాజ్‌తో చెప్పే డైలాగ్)

 * నువ్వు తినే తిండికి.. చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్సింగ్ అవుతుందారా? (రవితేజతో ఇడియట్ చిత్రంలో కోట శ్రీనివాస రావు చెప్పే డైలాగ్)

* తండ్రి: ఒరేయ్ నీకు ప్రేమ పిచ్చి పట్టింది!! 

కొడుకు:  నీకెప్పుడైనా డబ్బు పిచ్చి పట్టింది అని నేను అన్నానా డాడీ? (నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో ప్రకాష్ రాజ్ & సిద్ధార్థ్ మధ్య జరిగే సంభాషణ)

* మీకు అనుమానాలెక్కువే సార్!! mకూతురంటే ఇష్టం సార్… అది ఎక్కువైతే కష్టం సార్!! (బొమ్మరిల్లు చిత్రంలో కోట శ్రీనివాస రావు & ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్ర మధ్య పలికే మాటలు)

* ఈ పండు పేరేంటి పైన్ యాపిల్ … మరి ఈ క్రింద ఉన్న పండు పేరేంటి … కింద యాపిల్!

 కింద యాపిల్  ఏంటి రా? కింద యాపిల్?

అదేంటి నాన్న… పైన ఉన్నది పైన్ యాపిల్ అయితే కింద ఉన్నది కింద యాపిలే కదా నాన్న?!   (నచ్చావులే చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య సాగే సన్నివేశం)

*రేవులో తాటి చెట్టు లాగా పొడుగ్గా… వంకరగా పెరగడం తప్ప… మా అమ్మ దగ్గర కాఫీ సంపాదించడం కూడా నాన్నకి చేతకాదు. (హీరోయిన్ టబుతో నిన్నే పెళ్లాడతా చిత్రంలో నాగార్జున చెప్పే డైలాగ్స్).

* హలో కులాసా నేనా?… ఆ .. కులాసే!! కుమారుడి వల్లే లాస్ (loss) అని అర్ధం… (పడమటి సంధ్యారాగం చిత్రంలో భోజనప్రియుడైన కొడుకుని ఉద్దేశ్యించి ఒక తండ్రి పలికే మాటలు).

*  రేయ్… దేవదాస్‌లో నాగేశ్వర రావు గారి లాగ డాబాలెక్కి … గొడుగులేసుకుని చంద్రుడిని చూస్తే ఉపయోగం లేదు… మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయ్! లేకపోతే వయసైపోయాక నాలాగా ప్రేమకథలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికి రావు. (తరుణ్‌తో నువ్వే నువ్వే చిత్రంలో చంద్రమోహన్ చెప్పే డైలాగ్).

‘నాన్న’ గొప్పతనం గురించి సినీ సెలబ్రిటీలు చెప్పిన మాటలు (Top 10 Celebrity Quotes on Fathers Day)

* మనం ప్రేమించినా లేదా ద్వేషించినా.. తిరిగి మనల్ని ప్రేమించగలిగేది తండ్రి మాత్రమే – సుకుమార్

* ప్రపంచంలో అందరికన్నా నిస్వార్ధంగా మన విజయాన్ని ఆనందించే వాళ్ళు మన తల్లిదండ్రులే – సుకుమార్

* ఈ జీవితాన్ని మనకి ఇచ్చిన నాన్నకి తిరిగి ఏమివ్వగలం… అందుకనే ఆయనని ఎప్పటికి ఒక ‘మంచి జ్ఞాపకంగా’ గుర్తుపెట్టుకుందాం.. – త్రివిక్రమ్ శ్రీనివాస్.

* ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ గురించి మాట్లాడుతూ – ఒక తండ్రికి ఇంక అంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు … ఒక కొడుకుకి అంతకంటే అద్భుతమైన తండ్రి  ఉండడు… ఒక భార్యకి  అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు… మనవడు & మనవరాలికి అంతకంటే అద్భుతమైన తాత  ఉండడు.

* నాన్న ఎక్కడికీ వెళ్ళలేదు.. మనతోనే మన చుట్టూనే ఉన్నారు… (అక్కినేని నాగేశ్వర రావు గురించి నాగార్జున మాటల్లో)

* నాన్న.. నువ్వు మా మనస్సులో ఉన్నావ్. మా గుండెల్లో ఉండిపోయావ్… వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్ళాలని నువ్వు చెప్పిన మాట మేము ఎప్పటికి మర్చిపోము – కళ్యాణ్ రామ్.

* నా పిల్లలుగా జన్మించినంత మాత్రాన మీరు నా వారసులు అవ్వరు.. ఎవరైతే నా భావాలని, లక్షణాలని కొనసాగిస్తారో వారే నాకు అసలైన వారసులు . (ఇది నటుడు అమితాబ్ బచ్చన్ తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రాసిన కవిత నుండి చెప్పిన మాటలు).

* జీవితంలో నువ్వు ఎప్పుడు “నాట్ అవుట్” గానే ఉండాలి . (మాజీ భారత జట్టు క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తనతో తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుచేసుకున్న సందర్భంలో).

* మా నాన్నకి … నేను ఇచ్చే నిజమైన కానుక ఏంటంటే … “ఆయన ఇచ్చిన ఈ జన్మని,  పేరుని చెడగొట్టకుండా చివరి వరకు ఉండటమే” (రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి చెప్పిన సందర్భంలో)

 

ప్రతి కూతురు తన తండ్రికి పంపే 10 ఎమోషనల్ కొటేషన్స్ (10 Emotional Fathers Day Quotes) 

* నేను కళ్ళు మూయగానే కనపడే నువ్వు… అవి తెరవగానే ఎందుకు కనపడట్లేదు నాన్న!

* నాన్న… నా జీవితంలో నువ్వే నా మొదటి హీరో.

* నాన్న … నేను సొంతంగా తెచ్చుకునే గుర్తింపు కన్నా నీ కూతురిగా వచ్చే గుర్తింపు నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది.

* ప్రతి అమ్మాయి తన భర్తకి రాణి అవ్వలేదేమో కాని.. తన తండ్రికి మాత్రం ఎప్పటికి యువరాణే!

* నా ధైర్యం తగ్గింది నిన్ను కోల్పోయిన రోజే నాన్న…

* నన్ను అత్తగారింటికి పంపే సమయంలో నువ్వు కార్చిన కన్నీటిని నేను ఎప్పటికి మర్చిపోలేను నాన్న.

* నా ఇష్టాలని తీర్చడానికి నీ ఇష్టాలని వదులుకున్నావ్ అన్న విషయం నాకు తెలుసు నాన్న…

* నాకు ఉద్యోగం వచ్చిన రోజు నీ కళ్ళలో చూసిన ఆనందం అంతకుముందెన్నడు చూడలేదు నాన్న…

* నాన్న …  జీవితంలో జయం ఎంత ముఖ్యమో అపజయం కూడా అంతే ముఖ్యం అని చెప్పి నాలో వాస్తవిక దృక్పథాన్ని పెంచావు.

* పరీక్షల్లో ఫెయిల్ అయిన రోజు.. పర్లేదులేమ్మా!! ఒకసారి పరీక్షల్లో తప్పితే కాని.. మనకి పరీక్షలంటే ఉన్న భయం పోదు అని నన్ను ఓదార్చిన రోజు ఎన్నటికి మరువను.

 ‘నాన్న’కి సంబంధించిన సరదా కోట్స్ (Top 10 Funny Fathers Day Quotes)

* మా నాన్న అంటే ఇంట్లో అందరికి భయం… కాని ఆయనకి మాత్రం పక్కింటి ‘టామీ’ అంటే చచ్చేంత భయం.

* నీకు అమ్మ కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం కదా.. అని నన్ను మా నాన్న అడిగితే… “అవును నాన్న! ఇలా చెబితేనే కదా, నువ్వు నాకు చాకోలెట్ కొనిచ్చేది…”

* నాన్న పుట్టినరోజు సందర్భంగా చేతి గడియారం కానుకగా ఇస్తే… “అది చూడగానే బాగుంది రా” అని అనే బదులు “ఎంత పెట్టి కొన్నావ్ రా?” అని అడగడం మా నాన్నకే చెల్లింది.

* ఒరేయ్… మన ఇంటి పక్కన ఉండే సతీష్ గాడికి నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయట! ఏంటి సంగతి?

 అవును మరి..  వాళ్ళ నాన్నకి.. నీకన్నా రూ 5 వేలు జీతం ఎక్కువట కదా! అందుకే సతీష్ కన్నా ఒక అయిదు మార్కులు తక్కువ తెచ్చుకుని నీ పరువు నిలబెట్టా నాన్న…

* ఒక పిసినారి నాన్న-

 నాన్న నాకు మోటార్ సైకిల్ కొన్నివ్వవా..

 ఓసి పిచ్చొడా.. కాలేజీలో చదివేటప్పుడు ఫ్రెండ్ మోటార్ సైకిల్ పైన వెళితే వచ్చే ఆ ‘కిక్కే’ వేరు!

 అది నువ్వెలాగా చెప్పగలవు?

 స్వీయానుభవం కన్నా మించింది ఇంకేదీ లేదు రా!

* అందరూ  తమ తండ్రి నుండి వారసత్వంగా ఆస్తులు పొందుతుంటే…

 నేను మాత్రం, మా నాన్న దగ్గర నుండి వారసత్వంగా మూడు అప్పులు ఆరు గొడవలు పొందగలిగాను.

* చిన్నప్పటి నుండి మా నాన్న అంత ఎత్తు ఎదగాలనుకున్నా!

 కాని ఎంత ప్రయత్నించినా… మా నాన్న పొడుగైన ఆరు అడుగులు ఎత్తు పెరగలేకపోయా…

* ప్రోగ్రస్ రిపోర్ట్ వచ్చిన రోజు మా ఇంట్లో ఎక్కడ చూసినా కర్ఫ్యూ  వాతావరణమే కనిపిస్తుంటుంది…

 అలా మా ఇంట్లో కర్ఫ్యూ విధించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి – మా నాన్న.

* సప్తసముద్రాలలో అవలీలగా  ఈతగొట్టి..  పిల్ల కాలువలో పడి చచ్చినట్టు…

 బయట ఎంతోమందిని గడగడలాడించే మా నాన్న.. ఇంటికి రాగానే మా అమ్మ ముందు మూగవాడిలా మారిపోతాడు!

* మా నాన్నకి ‘ఓపిక రత్న’ అనే బిరుదు తప్పకుండ ఇవ్వాలి!

ఎందుకంటే మా లాంటి వాళ్లు ఉన్న ఈ సంసారాన్ని.. ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోకుండా ముందుకి నడిపిస్తునందుకు…

‘తాతయ్య’కి సంబంధించిన స్పెషల్ కొటేషన్స్  (Famous Grand Father Quotes) 

* అసలుకంటే వడ్డీ ముద్దు అని ఊరికే అనలేదు.

* ముందొచ్చిన తోక కన్నా.. వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని…

* మనవడు తానా అంటే  తాత తందానా అనాల్సిందే…

* నాన్నకి ఏదైనా చెప్పాలంటే.. అది ముందు తాతయ్యకి చెప్పాల్సిందే.

* తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య వారధి తాతయ్యలు.

* తండ్రి నుండి వారసత్వం తీసుకుంటే.. తాతయ్య నుండి మార్గదర్శకత్వం తీసుకుంటాం.

* ప్రతి ఇంట్లో ఉండే దేశీయ ‘ఎన్సైక్లోపీడియా’ పేరు తాతయ్య.

* తల్లిదండ్రుల కోపం నుండి కాపాడే.. సూపర్ మ్యాన్ మా ‘తాతయ్య’  

* తప్పు చేస్తే కొడుకుని మందలించే తండ్రి … తాను తాతయ్యగా మారాక మాత్రం తప్పు చేసిన మనవడిని క్షమించగలుగుతాడు.

‘నాన్న’ గొప్పతనాన్ని తెలిపే సినిమా పాటలు (Famous Film Songs Related To Fathers Day) 

 (చిత్రం – ఇద్దరూ ఇద్దరే…)

ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
కలిసొచ్చిన కాలానికి
నడిచొచ్చిన కొడుకుకి
కలిసొచ్చిన కాలానికి
నడిచొచ్చిన కొడుకుకి
స్వాగతం చెబుతున్నా

నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా
జీవితాన ప్రతి పాఠం చేదే అనుకున్నా
తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా
అనుబంధపు తీరానికి
నడిపించిన గురువని
అనుబంధపు తీరానికి
నడిపించిన గురువని
వందనం చేస్తున్నా నేనే

గురుదక్షిణగా అంకితమౌతున్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా
ఉడుకు నెత్తురున్న కొడుకు
దుడుకును ఆపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
ఉడుకు నెత్తురున్న కొడుకు
దుడుకును ఆపాలని
ఆపదలో పడనీయక దీపం చూపాలని
వచ్చిన ఈ పిచ్చి తండ్రి
పితృ ఋణం తీర్చి
చల్లారిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
తోడైన నీ ముందు ఓడానా గెలిచానా
ఒకే తండ్రి నుంచి రెండు జన్మలందుకున్నా
తీరని ఆ ఋణం ముందు తలను వంచుతున్నా
ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా
అందనంత ఎదిగిన నిను చూస్తున్నా నాన్నా

పగలే గడిచింది పడమర పిలిచింది
వయసు పండి వాలుతున్న సూర్యుణ్ణి నేను
కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో
కాటుక నది ఈదొచ్చిన నువ్వు చెప్పు వింటాను
రాతిరి కరిగింది తూరుపు దొరికింది
కళ్ళు తెరిచి ఇపుడిపుడే ఉదయిస్తున్నాను
అచ్చమైన స్వచ్చమైన
తెలుపంటే ఏవిటో మచ్చలేని నీ మనసును
అడిగి తెలుసుకుంటాను
ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికీ గురువురా
ఒకరి కధలు ఇంకొకరికి సరికొత్త చదువురా
పాటలు ఏవైనా నీతి ఒక్కటే నాన్నా
చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా

 (చిత్రం – నాన్నకి ప్రేమతో)

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించిన

ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా

నీ వెంట నేనున్నానని నను నడిపించిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

 

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా

ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా

భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన

 

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

ఈ అందమైన రంగుల లోకాన

ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన

నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో..

 (చిత్రం – మనం)

పల్లవి:
నన నానన నన నానన నానన్నానన
నన నానన నన నానన నానన్నానన ఓ ఓ ఓ
కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యాను గా
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యాను గా
ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కథలిక కదిపిన కథ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ ఆఆ

చరణం 1:

హా ఆ ఆ.. అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా హ ఆ ఆ
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా
పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ ఆఆ

చరణం 2:

హా ఆ ఆ.. కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరిచిపోలేనుగా
మీరూపినా ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కద
ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ ఆఆ

 (చిత్రం – నాన్న)

లాలిజో హ లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలో ఒక వింతగా నీ గొంతే వింటుందీ

హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం హో..
ఏ చిలిపి నవ్వుల గమనం సుధా రాగం
ఇరువురి రెండు గుండెలు ఏకమయ్యెను సూటిగా
కవచము లేని వాడ్ని కాని కాచుట తోడుగా
ఒకే ఒక్క అశృవు చాలు తోడే కోరగా

లాలిజో హ లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలో ఒక వింతగా నీ గొంతే వింటుందీ

మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే
జల్లే ఆగే ఐతే ఏంటి కొమ్మే చల్లులే
ఎదిగీ ఎదిగీ పిల్లా అయిందే
పిల్లైనా ఇవ్వాళ్ళే తనే అమ్మలే
ఇది చాలు ఆనందం వేరేమిటే
ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే
తను కనుపాపలోన చూడగ లోకం ఓడెలే
ఒకే ఒక్క అశృవు చాలు తోడే కోరగా

(చిత్రం – ‘డాడీ’)   

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడీ
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లీ
పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

వర్షంలో తడిసొచ్చీ హాయిరే హాయ్ అనుకుందామా
వర్షంలో తడిసొచ్చీ హాయిరే హాయ్ అనుకుందామా
రేపుదయం జలుబొచ్చీ హాచ్చి హాచ్చి అందామా
ఓ వంక నీకూ ఓ వంక నాకూ
ఆవిరిపడుతూనే మీ మమ్మీ
హైపిచ్ లో మ్యూజికల్లే తిడుతుంటుంటే
మన తుమ్ములు డ్యూయట్లల్లే వినబడుతుంటే

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడీ
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి

 * నీ కన్నులలో నేను …  (చిత్రం – ‘విన్నర్’)

(చిత్రం – కొత్త బంగారు లోకం)

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా
పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా
గతముందని గమనించని నడిరేయికి రేపుందా

గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా
వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా
మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా

మీరు కూడా ఈ ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రికి సంబంధించిన కొటేషన్లు, పాటల గురించి తెలుసుకున్నారుగా

ఈ క్రమంలో మీరు కూడా.. మీ తండ్రితో మీకున్న అనుబంధాన్ని తెలిపే ఏదైనా సంఘటనను మాతో పంచుకోండి.

ఈ క్రింద కామెంట్ సెక్షన్‌లో.. మీ అనుభవాలను పోస్టు చేయండి

ఆఖరుగా.. ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

ఇవి కూడా చదవండి

నాన్న ప్రేమలో మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే.. ఈ ఛాయాచిత్రాలు చూడాల్సిందే

మా అమ్మ, నాన్న విడిపోవడం బాధాకరమే: కమల్‌హాసన్ కుమార్తె అక్షర

#ToMaaWithLove “మదర్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు మీకు ప్రత్యేకం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంపించదగిన సందేశాలు

Father’s Day Caption in Hindi

Read More From Dad