
ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ ప్రపంచంలో ఏదైనా సరే.. చేయడం సాధ్యమేనని మీరు మనసారా భావిస్తే అందుకు గల మార్గాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక్కసారి గతంలో మీరు సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని ఉత్సాహం నింపుకోండి. కోరుకున్నది సాధించేందుకు ప్రయత్నించండి.
వృషభం (Tarus) – మీకు ప్రస్తుతం చాలా సమస్యలు ఉండి ఉండచ్చు. కానీ వాటికి పరిష్కారం త్వరలోనే లభిస్తుందని మీరు గట్టిగా విశ్వసించండి. పాజిటివిటీతో వ్యవహరిస్తే తప్పకుండా సమస్యలు సర్దుకుంటాయి.
మిథునం (Gemini) – బిజినెస్ పరంగా మీకు ఉన్న అవగాహన, అనుభవం, తెలివితేటలు అద్భుతం. కాబట్టి మీరే కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించి చూడండి. ఆత్మవిశ్వసం కోల్పోకుండా దానిని ముందుకు నడిపించండి.
కర్కాటకం (Cancer) – మీకు ప్రస్తుతం కాస్త తాజా గాలి అవసరం. కాబట్టి ప్రకృతితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. మీలో ఉన్న సమస్యలు, బాధలను వదిలేయండి. అన్నీ సర్దుకుంటాయి.
సింహం (Leo) – మీకు అనుకున్న పని చేయగల సామర్థ్యం, ప్రతిభ, తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మీ లక్ష్యాలపై ఇతరుల అభిప్రాయాల ప్రభావం పడనీయకండి. కేవలం మీపై మీరు దృష్టి పెట్టండి.
కన్య (Virgo) – ప్రస్తుతం ఈ రాశివారు కొందరు పెళ్లి చేసుకోవాలని భావిస్తుండవచ్చు. ఇంకొందరు దగ్గర బంధువుల పెళ్లికి హాజరవుతుండవచ్చు. కానీ పెళ్లైన వారు మాత్రం తమ బంధాన్ని సంరక్షించుకునేందుకు ప్రయత్నించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
తుల (Libra) – ఇతరులకు సంబంధించిన సమస్యలు, అంశాల గురించి మీరు ఎందుకు అతిగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు?? ఇలాంటి అనవసర విషయాలను మీ బుర్రలో నుంచి తీసేయండి. మీకు లాభం చేకూర్చని ఇలాంటి అంశాల కోసం మీ శక్తిని వృథా చేసుకోవద్దు.
వృశ్చికం (Scorpio) – మీకు ఎవరో వచ్చి ప్రత్యేకంగా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఒక గిఫ్ట్ ఇచ్చుకోండి. మీపై మీరే ప్రేమ కురిపించుకోండి. మీకు మీరు ప్రాధాన్యం ఇస్తూ.. మీ కోరికలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించండి.
ధనుస్సు (Saggitarius) – మీకు ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. ఒకవేళ ఇందుకు సమయం పట్టినా సరే.. కాస్త సహనంతో వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది.
మకరం (Capricorn) – మీకు ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఉంటే అవి త్వరలోనే సర్దుకుంటాయి. మీరు ఊహించని విధంగా వాటికి పరిష్కార మార్గాలు లభిస్తాయి. భగవంతునిపై విశ్వాసం ఉంచండి.
కుంభం (Aquarius) – విరామం తీసుకోకుండా పని చేయడం వల్ల మీరు డల్‌గా అయిపోయారు. కాబట్టి విశ్రాంతి కోసం కాస్త సమయం కేటాయించుకొని సరదాగా గడపండి. అతిగా పని చేస్తే.. అది మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. సృజనాత్మకతను దెబ్బ తీస్తుంది.
మీనం (Pisces) – మీరు అతిగా ఒత్తిడికి గురయ్యారా? అయితే సరదాగా బీచ్‌కి వెళ్లి కాసేపు సేదతీరండి. మానసిక ప్రశాంతత మీ సొంతమవుతుంది.
ఇవి కూడా చదవండి
నేటి రాశిఫలాలు చదవండి.. మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోండి..!
పుట్టిన తేదీ ప్రకారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా…?
మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!