Beauty

కళ్ల కింద నల్లటి వలయాలా? తేనెతో వాటిని దూరం చేసుకోవచ్చు

Lakshmi Sudha  |  May 3, 2019
కళ్ల కింద నల్లటి వలయాలా? తేనెతో వాటిని దూరం చేసుకోవచ్చు

మన కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకేనేమో.. కాస్త ఒత్తిడికి గురైనా.. నిద్ర లేకపోయినా కళ్ల కింద నల్లటి వలయాలు (dark circles) ఏర్పడతాయి.  పోషకాహార లోపం వల్ల కూడా ఇవి ఏర్పడవచ్చు. ఈ డార్క్ సర్కిల్స్ గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాటి వల్ల ముఖం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది.

అందుకే వాటిని కవర్ చేయడానికి మేకప్ టెక్నిక్స్ వాడతాం. కానీ ఇలా కవర్ చేసుకోవడం ఎందుకు? కొన్ని చిట్కాలు పాటిస్తే వాటిని సులభంగా తగ్గించుకోవచ్చు. మళ్లీ కళ్లను అందంగా మెరిపించుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలి? తేెనె ఉపయోగిస్తే సరిపోతుంది. తేనె(honey) ఉపయోగించి ఎలాంటి చిట్కాలు పాటిస్తే.. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి? అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం

Also Read: మొటిమలను తొలగించడానికి చిట్కాలు (Tips To Remove Acne)

1. కీరదోస, తేనె మిశ్రమం

కీరదోస ముక్కను సన్నగా తురమాలి. తురిమిన కీరదోసను పలుచని వస్త్రంలో వేసి బాగా పిండి రసాన్ని వేరు చేయాలి. రెండు చెంచాల తేనెకు చెంచా కీరదోస రసం కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. తేనె, కీరదోస రసం ఒకదానితో ఒకటి బాగా కలిసేంతవరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి మూడు సార్లు పాటించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.

2. పసుపు, నిమ్మరసం, తేనె

చిన్న గిన్నెలో టీస్పూన్ తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని కళ్ల కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ పై రాసి రెండు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆపై పూర్తిగా ఆరేంత వరకు ఆగి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.

3. అరటి, తేనె

బాగా ముగ్గిన అరటి పండు ముక్కను తీసుకొని దాన్ని మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ సమానంగా అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా ఈ చిట్కాను పాటించడం ద్వారా డార్క్ సర్కిల్స్ సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.

4. పాలు, తేనె

కాస్త వేడిగా ఉన్న పాలల్లో టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ ఉన్న చోట అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ చిట్కాను వారంలో మూడు సార్లు పాటించడం ద్వారా కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

5. టొమాటో, తేనె

టేబుల్ స్పూన్ చొప్పున తేనె, టొమాటో గుజ్జు తీసుకొని మిశ్రమంగా చేసి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. పది నిమిషాలు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. రోజుకి రెండు సార్లు అంటే ఉదయం, సాయంత్రం ఈ చిట్కాను పాటించడం ద్వారా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. కొత్తవి ఏర్పడకుండా ఉంటాయి.

6. పెరుగు, తేనె

టేబుల్ స్పూన్ చొప్పున పెరుగు, తేనె తీసుకొని మిశ్రమంగా చేయాలి. దీన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి 20-25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరిపోతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించడం ద్వారా కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

7. బంగాళాదుంప, తేెనె

బంగాళాదుంపను సన్నగా తురిమి ఐస్ వాటర్లో వేయాలి. ఐదు నిమిషాల తర్వాత నీటిని మరో గిన్నెలోకి వడపోయాలి. బంగాళాదుంప తురుములో టీస్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని కళ్లు మూసుుకొని.. కళ్లు చుట్టూ, రెప్పలపై కూడా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వడపోసిన నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే టీస్పూన్ చొప్పున బంగాళాదుంప గుజ్జు, తేనె తీసుకొని మిశ్రమంగా చేసి దాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసిన యెడల కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.

Featured Image: Shutterstock

Running Images: Pexels

ఇవి కూడా చదవండి:

సులభమైన పద్ధతిలో.. ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు..!

సహజమైన ఈ చిట్కాలు.. మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తాయి

జుట్టు ఎక్కువగా రాలుతోందా? ఈ నేచురల్ టిప్స్ మీకోసమే

Read More From Beauty