Entertainment

Bigg Boss Telugu 3: మహేష్.. పున్నరవి.. శిల్ప చక్రవర్తి.. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు?

Sandeep Thatla  |  Sep 15, 2019
Bigg Boss Telugu 3: మహేష్.. పున్నరవి.. శిల్ప చక్రవర్తి.. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు?

బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 3లో భాగంగా ఈరోజుతో ఎనిమిదవ వారం ముగియనుంది. ఇక పోయిన వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా.. ఎవ్వరు ఊహించని విధంగా అలీ రెజా ఎలిమినేటైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా జరగచ్చనే దానికి అది సరైన ఉదాహరణ అని చెప్పచ్చు. గతవారం ఇచ్చిన షాక్‌తో.. ఈ వారం ఎలిమినేషన్ పైన తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.

నేను తప్పు చేయలేదు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేను చేయను : పునర్నవి

ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న అయిదుగురు సభ్యులు – మహేష్ విట్టా, శ్రీముఖి, హిమజ, పునర్నవి & శిల్పా చక్రవర్తి. ఇందులో నుండి నిన్న హిమజ సేఫ్ అయినట్టుగా ప్రకటించారు. ఈ తరుణంలో మిగిలిన నలుగురు సభ్యుల నుండి.. ఒకరు ఎలిమినేట్ అయ్యే ఆస్కారం ఉండగా.. వారు ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్.. ఇతరత్రా అంశాలను బట్టి ఆమెకి ఓట్లు బాగానే వస్తాయి అని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో.. మిగిలిన ముగ్గురు సభ్యులైన – శిల్పా చక్రవర్తి (Shilpa Chakravarthy), మహేష్ విట్టా (Mahesh Vitta), పునర్నవిలలో (Punarnavi) ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి అందరూ ఊహించినట్టుగానే.. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేక అందరికి షాక్ ఇస్తూ శ్రీముఖి ఇంటి నుండి నిష్క్రమిస్తుందా? అనేది ఈరాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తేలిపోతుంది.

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యులతో కాస్త వాడివేడిగానే మాట్లాడారు. ముఖ్యంగా మహేష్ విట్టా టాస్క్ విషయంలో చేసిన కామెంట్స్, బిగ్ బాస్‌ని పునర్నవి నిందించడం.. అలాగే ఇతర సభ్యులని మ్యానిప్యులేట్ చేస్తున్న శ్రీముఖిలని కూడా కాస్త గట్టిగానే మందలించారు నాగార్జున. వారు ఏయే తప్పులు చేశారు? ఎలాంటి పనులు చేయడం వల్ల.. ఈరోజు ఇలా తప్పు చేసిన వాళ్ళలా నిలబడ్డారు అనేవాటి పైన ఆయన మాట్లాడడం జరిగింది.

ఇక వారితో కాస్త హాట్‌గా మాట్లేడేశాక.. “మహానటి/మహానటుడు.. అంతకుమించి” అనే ఒక ఫన్నీ టాస్క్‌‌ని ఆడించారు నాగార్జున. ఈ క్రమంలో పునర్నవి, రాహుల్‌ల మధ్య మరోసారి వాగ్వాదం కారణమైంది. అలా ఈ టాస్క్ కూడా ఇంటి సభ్యుల మధ్య.. కొంత చర్చకు కారణమైంది. కాకపోతే నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్‌‌లో పునర్నవి మాత్రమే.. అందరికన్నా ఎక్కువ లైమ్ లైట్‌లో పడిందని చెప్పాలి.

Bigg Boss Telugu 3: కెప్టెన్స్ టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!

నిన్నటి ఎపిసోడ్ మొత్తం వాగ్వాదాలు.. కన్నీళ్ళ మధ్య సాగగా.. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా సాగనుంది. దీని ప్రోమో విడుదల కాగా, అందులో ఇంటి సభ్యుల వ్యక్తిత్వం గురించి రాసిన పేరడీ సాంగ్స్‌ని.. రాహుల్‌తో పాడిస్తూ హౌస్ మేట్స్ చేత స్టెప్స్ వేయించారు నాగార్జున. అందులో పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య ‘రీఛార్జ్’ టాపిక్ నవ్వులు పోయించగా.. మధ్యలో బాబా భాస్కర్ వచ్చి.. ఆ టాస్క్‌ని ఇంకా ఫన్నీ గా మార్చాడు.

ఇక ఈరోజు ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ మినహా.. ఎపిసోడ్ మొత్తం ఫన్నీగా సాగిపోయేలాగానే కనిపిస్తుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్.. ఎటువంటి షాక్ ఇస్తుందో అని ఇంటిసభ్యులు భయపడుతున్నారు. గతవారమే ఎలిమినేషన్ ప్రక్రియ ఊహించని ఫలితాన్ని ఇవ్వడంతో.. ఈ వారం అటువంటిది పునరావృతం అవుతుందా అనే ఉత్కంఠ అయితే షో చూస్తున్న అందరిలో ఉంది.                                                                         

మరి ఈరోజు ఎపిసోడ్ షాక్ ఇస్తుందా లేక రొటీన్ గా ముగుస్తోందా అనేది వేచి చూడాలి.

Bigg Boss Telugu 3: బిగ్ బాస్‌ని నిందించారు.. అందుకే పునర్నవి, శ్రీముఖిలకి శిక్ష పడిందా?

Read More From Entertainment