Lifestyle

టిక్ టాక్ ( Tiktok) యాప్ బ్యాన్ అయింది.. మీమ్‌ల పండగ మొదలైంది..

Soujanya GangamSoujanya Gangam  |  Apr 18, 2019
టిక్ టాక్ ( Tiktok) యాప్ బ్యాన్ అయింది.. మీమ్‌ల పండగ మొదలైంది..

టిక్ టాక్ ( Tiktok) ప్రముఖ వీడియో షేరింగ్ యాప్. ఇందులో వచ్చే సంగీతానికి అనుగుణంగా హావభావాలను చూపుతూ లేదా డ్యాన్స్ చేస్తూ నటించి చూపించేవాళ్లు. ఇలా చాలామందికి తమలో ఉన్న టాలెంట్‌ని చూపించేందుకు చక్కటి మార్గంగా మారింది. అయితే అశ్లీలంగా ఉన్న వీడియోలను పోస్టు చేయడంతో పాటు..  టిక్ టాక్ వల్ల చాలామంది ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వాటిని వీడియో తీసి పెడుతుండడం గమనించిన మద్రాస్ హైకోర్టు దాన్ని బ్యాన్ చేయాలని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే థర్డ్ పార్టీ అప్ లోడ్ చేసే వీడియోలకు తమని బాధ్యులు చేయడం సరికాదని ఈ సంస్థ యాజమాన్యం సుప్రీం కోర్టుకి వెళ్లింది. సంస్థ అశ్లీలమైన వీడియోలను, ప్రమాదకరమైన వాటిని అరికట్టేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని చెబుతూ దాన్ని బ్యాన్ (Ban) చేయాలనే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ తమ స్టోర్ నుంచి దీన్ని తీసేయాలని గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది సుప్రీంకోర్టు.

దీంతో యాప్ స్టోర్లో టిక్ టాక్ డౌన్ లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే.. అందుబాటులో లేదని కనిపిస్తోంది. ఇకపై భారత్ లో వినియోగదారులకు దీని అప్ డేట్స్ కూడా అందవు. అయితే ఇప్పటికే దీన్ని ఫోన్లో డౌన్ లోడ్ చేసిన వారు మాత్రం దీన్ని ఉపయోగించవచ్చు.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో టిక్ టాక్ యూజర్లు బాధపడుతుంటే టిక్ టాక్ వాడని చాలామంది మాత్రం సంతోషపడుతున్నారు. ఆ తర్వాత పబ్ జీని కూడా బ్యాన్ చేయాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే టిక్ టాక్ బ్యాన్ గురించి చాలామంది తమకు నచ్చిన విధంగా మీమ్స్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. యాప్ బ్యాన్ అయిన బాధలో ఉన్నా చాలామందిని ఈ మీమ్స్ నవ్విస్తున్నాయి. మరి అలా పాపులర్‌గా మారిన మీమ్స్‌ని మనమూ చూసేద్దామా?

1. రోజూ కనీసం ఏడెనిమిది గంటలు అదే పనిలో ఉండేవారు మరి.. ఇలా బాధపడడం సహజమే.

2. ప్రభుత్వం చేసిన పనిని మెచ్చుకుంటూ చేసిందీ మీమ్

3. అవును. ప్లే స్టోర్లో తీసేసినా ఫోన్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని ఉపయోగించవచ్చు.

4. టిక్ టాక్ పోతే దాని ప్రభావం ఎంతో మంది రైజింగ్ స్టార్స్ పైన ఉంటుంది మరి..

5. యాప్ స్టోర్‌లో లేకపోతేనేం.. ఏపీకే వర్షన్ డౌన్ లోడ్ చేసుకుంటాం అనుకునేవారు చాలామందే..

6. అవును.. ఆ టిక్ టాక్ నోటిఫికేషన్స్ రాకుండా ఉంటే చాలా సంతోషం కదా..

7. టిక్ టాక్ లేకపోతేనే లైక్, డబ్ స్మాష్ వంటి యాప్స్ ఉన్నాయిగా.. వాటిని ఉపయోగిస్తే పోలే..

8. టిక్ టాక్‌లో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీ అనుపమా పరమేశ్వరన్.. మరి, తనూ బాధపడుతుందేమో కదా..

9. టిక్ టాక్‌తో పాటు పబ్ జీని కూడా బ్యాన్ చేస్తే సరి.. మొబైల్ పై గడిపేవాళ్లందరికీ బయటవాళ్లతో మాట్లాడేందుకు సమయం దొరుకుతుంది.

10. అవును.. ఇలా సీరియస్ గా టిక్ టాక్ చేసే వాళ్లు కూడా ఉంటారండోయ్..

11. హాహాహా.. వీళ్లెవ్వరికో చాలామంచి ఆలోచన వచ్చింది కదండీ..

12. అవును మరి.. టిక్ టాక్ చేసేవారి ఎక్సప్రెషన్స్ చూడలేక ఇబ్బంది పడే స్నేహితులు ఎందరో..

ఇవి కూడా చదవండి.

టిక్ టాక్ (Tik Tok) వీడియోలతో ఆకట్టుకుంటోన్న కథానాయికలు వీరే..

మజిలీ సినిమాతో అబ్బాయిలందరికీ.. ఓ డ్రీమ్ వైఫ్ దొరికేసింది..!

ఐపీఎల్ పై వ‌స్తున్న ఈ జోక్స్ భలేగున్నాయ్.. మనం చదివి ఆనందించేద్దామా..!

Read More From Lifestyle