Bollywood

సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!

Sandeep Thatla  |  May 21, 2019
సాహో విడుదల తేదీని.. స్టైలిష్‌గా ప్రకటించిన ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం సాహో (Saaho). ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. కారణం ఇది ప్రభాస్‌కు బ్రేక్‌నిచ్చిన బాహుబలి తరువాత వస్తోన్న చిత్రం కావడమే. అలాగే తెలుగు, తమిళ & హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతుండడం కూడా మరో  కారణం.

అయితే సాహో చిత్రానికి సంబంధించి బయటకు వెలువడిన వార్తలు చాలా తక్కువ. అలాగే ఈ సినిమా విడుదల గురించి ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులంతా సాహో విడుదల తేదీ గురించి ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ.. పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రభాస్ తన అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ సాహో సినిమా విడుదల తేదీని చాలా స్టైలిష్‌గా ప్రకటించాడు. నిన్న ప్రభాస్ ఇన్ స్టాగ్రాం వేదికగా సాహో చిత్రానికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయాన్ని.. ఈ రోజు (మే 21) ప్రకటించనున్నట్లు తెలిపారు. దాంతో ఆ విషయం ఏమై ఉంటుందా.. అని అంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు ఆయన అభిమానులు.

 

నిన్న చెప్పినట్లుగానే.. ఈ రోజు ప్రభాస్ కొద్దిసేపటి క్రితమే తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా.. సాహో సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేశాడు. ఇందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించగా, సాహో చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్నట్లు దానిపై రాసి ఉంది. ఈ పోస్టర్ ద్వారా తన స్టైలిష్ లుక్‌తో సినిమా విడుదల తేదీని చాలా స్మార్ట్‌గా ప్రభాస్ ప్రకటించాడని.. ఇప్పటికే ఆయన అభిమానులు ఉప్పొంగిపోతున్నారు.

 

అయితే ఈ సినిమా ఎలా ఉండనుందనే విషయం.. ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1లో మనకి అర్థమైంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లోని ప్రభాస్ స్టైలిష్ లుక్ కూడా.. ప్రేక్షకులను ఫిదా చేసేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుందని ఈ పోస్టర్ ద్వారా వెల్లడవుతోంది.

ఈ సినిమా విడుదల హక్కులను T – Series సంస్థ సుమారు 400 కోట్ల రూపాయల మేర చెల్లించి తమ సొంతం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే విడుదలయ్యే స్క్రీన్స్ విషయంలోనూ సాహో కొత్త రికార్డు సృష్టిస్తుందంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించే అవకాశాలు సైతం ఉందంటున్నారు.

మరోవైపు యువదర్శకుడు సుజీత్ (Sujeeth) ఈ చిత్రాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్ దృష్ట్యా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడమంటే కాస్త కష్టమే. అయినప్పటికీ.. అందుకు తగిన ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు.. తన పాత్రకు తెలుగు & తమిళ భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు ట్రైనింగ్ తీసుకుంది. అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హిందీ భాషపై పట్టు సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.

పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న.. ఈ చిత్ర  సాంకేతిక వర్గాన్ని కూడా దర్శకుడు చాలా పకడ్బందీగా ఎంచుకున్నాడని చెప్పవచ్చు. సాహోకి ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్ (Sabu Cyril); కెమెరామెన్‌గా మది (Madhie) & ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్ (Sreekar Prasad) వ్యవహరించడం గమనార్హం. ఈ చిత్రానికి యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ – ప్రమోద్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఇప్పటి నుంచే.. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చే.

ఇవి కూడా చదవండి

తన డ్యాన్స్‌తో అందరికి షాక్ ఇచ్చిన.. ఐశ్వర్యారాయ్ ముద్దుల కూతురు ఆరాధ్య ..!

మాస్ మసాలా… పూరి జగన్నాధ్ – రామ్‌ల “ఇస్మార్ట్ శంకర్” టీజర్..!

ముగింపు లేకుండా ‘సాగే’ కథ (మహేష్ బాబు ‘మహర్షి’ మూవీ రివ్యూ)

 

Read More From Bollywood