Bigg Boss

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య గొడవ

Sandeep Thatla  |  Sep 24, 2019
Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య గొడవ

(Fight between Varun Sandesh and Rahul Sipligunj in Bigg Boss House)

బిగ్ బాస్ హౌస్‌‌లో ఎవరు ఎప్పుడు మిత్రులవుతారో? ఎవరు ఎప్పుడు శత్రువులవుతారో? మనకు తెలియదు. ఎప్పుడు ఎవరి మధ్య మనస్పర్థలు వస్తాయో కూడా ఊహించలేం. మొన్నటికి మొన్న రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయ్యాడని తెలియగానే.. వెంటనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు వరుణ్ సందేశ్. అలాగే వరుణ్ సందేశ్‌ని కూడా.. బిగ్ బాస్ హౌస్‌లోని ‘అందరి కన్నా బెస్ట్ ఫ్రెండ్’ అని రాహుల్ సిప్లిగంజ్ చెప్పడం జరిగింది.

Bigg Boss Telugu 3 : రాహుల్ హౌస్‌‌లోకి రావడంతో.. డల్ అయిన శ్రీముఖి!

అయితే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోలో మాత్రం.. ఈ ఇద్దరు బాహాబాహీకి దిగినట్టుగా చూపించారు. కారణం తెలియదు కానీ.. ఇద్దరూ కూడా ఒకరిపై మరొకరు దూషణలకు దిగడం.. అలాగే పాత టాస్క్‌లలో ఒకరిపై ఇంకొకరు ఎలా దాడి చేశారో చెబుతూ.. ఇద్దరూ గొడవపడడం గమనార్హం. వీరిద్దరిని ఇంటి సభ్యులు ఆపే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇది టాస్క్ వల్ల జరిగిందా? లేక బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా వీరు నటించారా? లేదా వీరిద్దరూ టాస్క్‌లో గెలవడానికి వేసుకున్న స్కెచ్చా..? అనేది ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తేలిపోతుంది.

పైన చెప్పిన దాంట్లో ఏది జరిగినా కూడా.. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలావుండగా నిన్న బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన టాస్క్ పేరు – అత్త రాజ్యంలో కోడళ్ళ పాట్లు. ఈ టాస్క్‌లో శివజ్యోతి ఒక పిసినారి అత్తగా కనిపించడం విశేషం. ఆమె ముగ్గురు కొడుకులుగా రవికృష్ణ, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్‌లు నటించారు. వారి భార్యలుగా శ్రీముఖి, వితిక, పునర్నవిలు కనిపించారు. వీరితో పాటు శివజ్యోతికి మేనేజర్‌గా బాబా భాస్కర్.. అతని సహాయకుడిగా మహేష్ విట్టా వ్యవహరించారు.

ఈ టాస్క్‌లో భాగంగా శివజ్యోతి వీలునామాని ఎవరు తస్కరిస్తారో.. వారే ఈ టాస్క్ విజేతగా నిలుస్తారని బిగ్ బాస్ తెలిపారు. అలాగే టాస్క్‌ను మూడు జంటలలో ఎవరైతే బాగా చేస్తారో.. వారికి కూడా ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడే అవకాశం మెండుగా ఉందని టాక్. దీంతో ఈ టాస్క్‌లో మంచి ప్రతిభ కనబర్చేందుకు ఇంటి సభ్యులందరూ బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి.. కెప్టెన్సీ టాస్క్‌లో నిలుస్తారో చూడాలి.

Bigg Boss Telugu 3 : హౌస్ మేట్స్ కోసం.. వారి కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం ..!

ఇక ఈ టాస్క్ జరిగే ముందు..  నామినేషన్స్ ప్రక్రియకి సంబంధించి శ్రీముఖి, బాబా భాస్కర్‌ల మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. ఈ ఇద్దరు తమ మధ్య ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టి.. కేవలం గేమ్ పైనే దృష్టి పెట్టాలని శ్రీముఖి కరాకండీగా చెప్పేశారు. ఈ క్రమంలో పునర్నవితో నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. తన ప్రవర్తన గురించి కూడా బాబా భాస్కర్ వివరణ ఇచ్చారు. అయితే ఇదే వివరణ నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కూడా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని.. వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్‌లు చెప్పడం జరిగింది.

అదే సమయంలో రవికృష్ణ పై వితిక, పునర్నవిలు కూడా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియలో రవికృష్ణ చేసిన వ్యాఖ్యల దృష్ట్యా.. అతనిని హౌస్ మేట్స్ విమర్శించారు. ఈ క్రమంలో దాదాపు ఇంటి సభ్యులంతా రెండు గ్రూపులుగా విడిపోయారనే చెప్పాలి. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కూడా వేచి చూడాలి.

అలాగే… వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య జరిగిన వివాదం నిజమో కాదో అనేది.. సాయంత్రం ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

Bigg Boss Telugu 3: హౌస్‌లో శివజ్యోతి చేత.. కన్నీళ్ళు పెట్టించిన బాబా భాస్కర్!                                                              

Read More From Bigg Boss