Entertainment

సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం.. పబ్లిక్ టాక్ మీకోసం..

Sandeep Thatla  |  Dec 20, 2019
సాయి ధరమ్ తేజ్ – రాశి ఖన్నా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం.. పబ్లిక్ టాక్ మీకోసం..

Sai Dharam Tej, Raashi Khanna starrer Prathiroju Pandage Movie Public Talk

కొన్ని సినిమాలు ట్రైలర్ చూడగానే.. ప్రేక్షకులని తమవైపు తిప్పేసుకుంటాయి. అటువంటి  చిత్రమే ‘ప్రతిరోజూ పండగే’ .. ఇక ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వగా.. సంక్రాంతి పండుగ మేనియా వల్ల ముందుగానే చిత్రాన్ని రిలీజ్ చేయడం గమనార్హం.

ఆ తల్లీ, కొడుకుల బంధం.. ఎంతో స్ఫూర్తిదాయకం (టాలీవుడ్ కమెడియన్ ‘అలీ’కి మాతృవియోగం)

ఈ సినిమాతో 2019లో టాలీవుడ్ ప్రస్థానం దాదాపు ముగిసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చేవారం ఒక చిన్న చిత్రం మినహా.. మరే ఇతర తెలుగు చిత్రాలు కూడా విడుదల కావడం లేదు. మళ్ళీ జనవరి 10 నుండి సంక్రాంతి వరకు.. వరుసగా చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ  ‘ప్రతిరోజూ పండగే’  చిత్రం  పైనే సినీ పరిశ్రమ దృష్టి మొత్తం నెలకొని ఉంది. దానికి కారణం.. 2019 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక హిట్ చిత్రాన్ని ఇచ్చి మరీ సెలవు తీసుకుంటుందా.. లేదా..? అన్న ప్రశ్న తలెత్తడమే.

ఈ క్రమంలో ప్రతిరోజూ పండగే పబ్లిక్ టాక్  మీకోసం 

ఈ సినిమా కథ విషయానికి వస్తే, మనిషి పుట్టుకని ఎంత సంబరంగా జరుపుకుంటామో.. చావుని కూడా అలాగే చూడాలి అంటూ ఒక విభిన్నమైన పాయింట్‌ని తెరమీద చూపించే ప్రయత్నం చేశాడట మారుతి. మరణం ఎప్పుడనేది తెలిశాక.. దాని గురించి ఆలోచిస్తూ వేదనకి గురవుతూ ఉండేదానికన్నా.. ఆ మిగిలిన రోజులను సరదాగా.. మనకి దగ్గరైన వారితో గడపాలంటూ ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశాడట.

అందుకనే ఈ సినిమా ట్రైలర్‌లో కూడా ఎక్కడా సెంటిమెంట్ సన్నివేశాలు చూపకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో సినిమాలో కూడా.. కథలో నుండే పుట్టిన పాత్రల ద్వారానే. వీలైనంత మేర హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం జరిగిందట. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలుగా.. సత్యరాజ్ & రావు రమేష్ నిలిచాయని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు.

ఈ రెండు పాత్రలే కాకుండా ఏంజెల్ ఆర్నా పాత్రలో కనిపించిన రాశి ఖన్నా.. అలాగే సుహాస్ & మహేష్‌లు కూడా ప్రేక్షకులకి కావాల్సినంతగా వినోదాన్ని పంచడం జరిగిందట. ఈ సినిమాలో హాస్యానికి ప్రధాన ప్రాధాన్యత దక్కగా.. ఆ తరువాత తమన్ అందించిన సంగీతం కూడా థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులకి పైసా వసూల్ ఫీల్‌ని ఇచ్చిందట. ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ సాంగ్ & ‘బావా’ పాటలు థియేటర్లో వినసొంపుగానే కాకుండా.. చూడడానికి కూడా అందంగా ఉన్నాయట.

‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్’ అంటూ రెచ్చిపోయిన ‘సూపర్ స్టార్’ రజినికాంత్

మొత్తానికి ఈ సినిమాతో అపజయాల నుండి మారుతి బయటపడగలిగాడనే అంటున్నారు. ఆయన తీసిన గత చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కాస్త నిరుత్సాహపరచగా.. ఈ చిత్రంతో మాత్రం ఆయన హిట్ బాట పట్టినట్టుగానే చెబుతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ కూడా ఈ చిత్ర విజయంతో.. మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పవచ్చు.

అయితే గత వారం విడుదలైన వెంకీ మామ.. ఈ ఈ వారం విడుదలైన ‘ప్రతిరోజూ పండుగ’ చిత్రాలతో వరుసగా.. రెండు వారాల్లో రెండు హిట్స్ అందుకుని ..ఈ 2019లో తెలుగులో చేసిన రెండు చిత్రాలతోనూ మంచి పేరు తెచ్చుకోగలిగింది ఈ ముద్దుగుమ్మ.

ఆఖరుగా ఈ 2019వ సంవత్సరంలో వచ్చిన ఆఖరి ప్రముఖ తెలుగు చిత్రంగా నిలిచిన ఈ ‘ప్రతిరోజూ పండగే’ హిట్ అనిపించుకుంది. ఈ సినిమా చూసి వస్తున్న ప్రేక్షకులు చెప్పే దాన్ని బట్టి.. ఈ చిత్రం ఒక మంచి హిట్ అని & ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈ చిత్రం తప్పక నచ్చి తీరుతుందని చెబుతున్నారు.

ఏదేమైనప్పటికి.. ఈ వారానికి సంబంధించి సాయి ధరమ్ తేజ్ నటించిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం.. హిట్‌గా నిలవడంతో పాటు ఈ వారాంతం.. అలాగే న్యూ ఇయర్‌ను కూడా పురస్కరించుకొని.. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ పండగ సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.

“స్టైల్‌గా ఉంది కదా! నాకు కూడా నచ్చింది – “అల వైకుంఠపురంలో” టీజర్‌లో అల్లు అర్జున్

Read More From Entertainment