Darbar Trailer Talk : 'ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్' అంటూ రెచ్చిపోయిన 'సూపర్ స్టార్' రజినికాంత్

 Darbar Trailer Talk :  'ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్' అంటూ రెచ్చిపోయిన 'సూపర్ స్టార్' రజినికాంత్

Superstar Rajinikanth 'Darbar' Movie Trailer Talk Details 

సూపర్‌స్టార్ రజినికాంత్ ఈసారి పండగకి 'దర్బార్' చిత్రంతో మన ముందుకి వచ్చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్నే విడుదలైంది. ఇక చాలాకాలం తరువాత పోలీసు పాత్రలో రజినికాంత్ కనిపిస్తుండడంతో.. ఆయన అభిమానుల్లో ఇంకా ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో నయనతార, నివేతా థామస్ కథానాయికలుగా నటిస్తుండగా.. ప్రతీక్ బబ్బర్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

సూపర్ స్టార్ అనే పదానికి.. అసలైన నిర్వచనం చెప్పిన 'రజినికాంత్' 

ఇక దర్బార్ ట్రైలర్ టాక్ విషయానికి వస్తే.. రజినికాంత్ మరోసారి తనదైన శైలిలో ఈ ట్రైలర్‌లో మెరుపులా కదిలాడు. అలాగే దర్శకుడు మురుగదాస్ కూడా రజినికాంత్‌‌తో.. ఒక మంచి కమర్షియల్ చిత్రాన్ని తీస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఇక ఎప్పటిలాగే రజినికాంత్ తనదైన స్టైల్‌లో డైలాగ్ల వర్షం కురిపించగా.. ఆయన హావభావాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అయితే తెలుగులో రిలీజయ్యే 'దర్బార్' డబ్బింగ్ వెర్షన్ కాబట్టి.. రజినికాంత్ లిప్ సింక్‌కి తగ్గట్టుగా.. మనో తన గాత్రాన్ని సరిగ్గా సూట్ అయ్యే విధంగా అందించారు.

ఈ 'దర్బార్' ట్రైలర్‌లో రజినికాంత్ ఎంట్రీ ఇవ్వగానే.. అతని పాత్ర స్వభావాన్ని తెలిపే ఒక డైలాగ్‌ను చెప్పించాడు మురుగదాస్.  "వాడు పోలీసు ఆఫీసరా సార్?? హంతకుడు!!" అన్న రజనీ పలికే డైలాగ్‌కి కొనసాగింపుగా.. ఒక పవర్ ఫుల్ పోలీసు పాత్రలో రజనీ సత్తాను కూడా ఇవే సంభాషణల ద్వారా చూపించాడు దర్శకుడు.

"ఆదిత్య అరుణాచలం - పోలీసు కమిషనర్ ఆఫ్ ముంబై

ఆఫీసర్స్ .. పోలీస్ ఈజ్ నాట్ ఏ జాబ్

వి లివ్ టు ప్రొటెక్ట్

వి డై టు సర్వ్".

అన్న రజనీ డైలాగ్స్‌కి ఇప్పటికే విపరీతమైన స్పందన వస్తోంది.

 

ఇక ఈ ట్రైలర్‌ మధ్యమధ్యలో హీరోయిన్ నయనతారని ప్రత్యేకంగా చూపించారు.  ఒక కొత్త లుక్‌‌తో ఉన్న నయనతారని మనం ఈ సినిమాలో చూడవచ్చు. అలాగే నయనతార.. రజినికాంత్‌ల జోడి కూడా చాలా కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రముఖ హిందీ హీరో సునీల్ శెట్టి నటించడం జరిగింది. ఆ పాత్ర కోసం ఆయనకి ఒక కొత్త లుక్‌ను కూడా డిజైన్ చేశారు. మరి ఆయన ఈ సినిమాకి  ఎంత వరకు ప్లస్ అవుతారు అనేది..? సినిమా విడుదలైతే కాని తెలియదు.

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా...

అలాగే రజినికాంత్ సినిమా అంటేనే స్పెషల్ డైలాగ్ మాడ్యులేషన్స్‌కి పెట్టింది పేరు. ఈ 'దర్బార్' సినిమా కూడా ఇందుకు అతీతమేమీ కాదు. ఎందుకంటే విలన్తో చెప్పే డైలాగ్స్‌లో.. రజిని మార్క్ పంచ్ డైలాగ్స్ ఎక్కువగా కనిపించాయి. అందులో ఒక డైలాగ్ మీకోసం -

"సార్.. వాళ్లకి చెప్పండి - పోలీసుల దగ్గరికి లెఫ్ట్‌లో రావొచ్చు .. రైట్‌లో రావొచ్చు... స్ట్రెయిట్‌గా రావొద్దు అని!!"

ఇక ఆఖరులో రజినికాంత్ తన సహచర పోలీసులతో - "ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్నమ్మ..." అంటూ సూపర్ ఎండింగ్ ఇస్తే.. "ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్..." అంటూ చిన్న స్టెప్స్ వేసుకుంటూ రజినికాంత్ నడుస్తూ రావడం.. ఈ ట్రైలర్ మొత్తానికి హైలైట్ అని చెప్పవచ్చు. ఈ ట్రైలర్‌తో ఇప్పటికే 'దర్బార్' చిత్రం పైన ఉన్న అంచనాలు పదింతలు పెరిగాయి.

మనం కూడా ఈ అంచనాలు సినిమా విడుదల అయ్యాక.. నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం...

ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా - సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?