Celebrity Life

కీర్తి సురేష్ & రామ్ చరణ్ .. సైమా అవార్డ్ విన్నర్స్ వీరే ..!

Babu Koilada  |  Aug 16, 2019
కీర్తి సురేష్ & రామ్ చరణ్ .. సైమా అవార్డ్ విన్నర్స్ వీరే ..!

సాత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ – సైమా (siima awards)  వేడుక నిన్న ఖతర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినీ అవార్డు వేడుకలకు దక్షిణాదికి చెందిన చలన చిత్ర ప్రముఖులందరూ హాజరయ్యారు. తెలుగు, తమిళం, కన్నడ పరిశ్రమలకు చెందిన నటీ నటులందరూ ఈ వేడుకలో కనువిందు చేశారు. యశ్, విజయ్ దేవరకొండ లాంటి యువ నటులతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

ఈ అవార్డ్స్ ఫంక్షనుకు యాంకర్ సుమ, కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి తమదైన శైలిలో ఛలోక్తులను విసిరి.. కార్యక్రమంలో నవ్వులు పూయించారు.

2012లో తొలిసారిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త విష్ణువర్థన్ ఇందూరి చేతుల మీదుగా సైమా పురస్కారాల ప్రదానోత్సవం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రతీ సంవత్సరం ఈ అవార్డులను దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డుల్లో భాగంగా జనరేషన్ నెక్స్ట్ పేరుతో వర్థమాన నటులకు అవార్డులను అందించిన తర్వాత.. సైమా ప్రధాన అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. 

 

 

ఈ అవార్డ్స్ విజేతల జాబితా (తెలుగు)

ఉత్తమ చిత్రం: మహానటి

ఉత్తమ నటుడు: రామ్ చరణ్ (రంగస్థలం)

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (మహానటి)

ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)

ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)

ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)

ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ (రంగస్థలం)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (రంగస్థలం- ఎంత సక్కగున్నావే)

ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100,  పిల్లారా.. పాట)

ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)

ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)

ఉత్తమ నూతన దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)

ఉత్తమ నూతన నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ నూతన నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)

ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)

ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)

పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ

ఇవి కూడా చదవండి

కేన్స్ వేదికపై మెరిసిన భారతీయ రైతు.. రహీబాయి సోమా..!

“మహానటి”కే మేటి పురస్కారం: జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న “కీర్తి సురేష్”

అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకొని.. అవార్డులు సొంతం చేసుకున్నారు..!

ఈ అవార్డ్స్ విజేతల జాబితా (కన్నడం)

ఉత్తమ నటుడు – యష్ (కేజీఎఫ్ ఛాప్టర్ 1)

ఉత్తమ దర్శకుడు – ప్రశాంత్ నీల్ (కేజీఎఫ్ ఛాప్టర్ 1)

ఉత్తమ హాస్యనటుడు – ప్రకాష్ తుమినర్ (సర్కార్ హి ప్ర సాలే కసరగోడు)

ఉత్తమ విలన్ – ధనుంజయ (తగరు)

ఉత్తమ సహాయనటి – అర్చన (కేజీఎఫ్ ఛాప్టర్ 1)

ఉత్తమ నూతన కథానాయిక – అనుపమ గౌడ (ఆ కరాళ రాత్రి)

ఉత్తమ నూతన దర్శకుడు – మహేష్ కుమార్ (అయోగ్య)

ఉత్తమ గేయ రచయిత – చేతన్ కుమార్ (యన్నమి యన్నమి, అయోగ్య)

ఉత్తమ సినిమాటోగ్రఫ్ – భువన గౌడ (కేజీఎఫ్ ఛాప్టర్ 1)

ఉత్తమ గాయని – అనన్య భట్ (హోల్డ్ ఆన్, తగరు)

 

 
 
 

 
 

Read More From Celebrity Life