"మహానటి"కే మేటి పురస్కారం: జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న "కీర్తి సురేష్"

"మహానటి"కే మేటి పురస్కారం: జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న "కీర్తి సురేష్"

"మహానటి" చిత్రం ద్వారా అలనాటి కథానాయిక సావిత్రి జీవితాన్ని వెండితెర పై ఆవిష్కరించారు దర్శకులు నాగ్ అశ్విన్. అయితే ఆయన .. ఈ సినిమా తీయడానికి సిద్ధమైనప్పుడు.. అలాగే సావిత్రి పాత్రకి కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకున్నప్పుడు.. చాలానే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే "మహానటి" చిత్రం మొదటి లుక్ చూడగానే సావిత్రి గారే తన చిత్రంలో నటించారన్నంతగా.. చాలా దగ్గర పోలికలతో కీర్తి సురేష్ చక్కగా ఆ పాత్రకి సరిపోయింది.

"మన్మథుడు" మ్యాజిక్ రిపీట్ చేయడంలో.. తడబడ్డ నాగార్జున (మన్మథుడు 2 మూవీ రివ్యూ)

ఇక ఈ మహానటి చిత్రం విడుదలయ్యాక.. ప్రపంచం మొత్తం కీర్తిసురేష్ నటనకి ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా.. కచ్చితంగా ఈ సంవత్సరం ఇచ్చే అవార్డులన్ని ఆమె సొంతం అని ముక్తకంఠంతో చెప్పారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది. సాక్షాత్తు జాతీయ ఉత్తమ నటి గా మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ ఎంపిక కావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రకటన కొద్దిసేపటి క్రితమే వెలువడింది.

దీనితో ఆ చిత్రం యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఈ అవార్డుతో పాటుగా "మహానటి"కి జాతీయ ఉత్తమ చిత్రం - తెలుగు అవార్డు కూడా దక్కింది. అలాగే బెస్ట్ కాస్ట్యూమ్ విభాగంలో కూడా ఈ చిత్రం మరో అవార్డు కైవసం చేసుకుంది. దీనితో మొత్తం 3 అవార్డులని మహానటి తన ఖాతాలో వేసుకుంది.

 

భారత ప్రభుత్వం వారిచే ప్రకటించబడ్డ.. 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు చిత్రాలు తమ సత్తా చాటాయి అనే చెప్పాలి. పైన చెప్పినట్టుగా మహానటి చిత్రం 3 అవార్డులు గెలుచుకోగా, ఉత్తమ ఓరిజినల్ స్క్రీన్ ప్లే క్రింద చి.ల.సౌ చిత్రం పురస్కారం గెలుచుకుంది. ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ మిక్సింగ్) క్రింద రంగస్థలం చిత్రం అవార్డు గెలుచుకుంది. అలాగే 'అ' చిత్రం ఉత్తమ మేకప్ & స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలలో రెండు అవార్డులని సొంతం చేసుకోవడం జరిగింది.

అలా తెలుగు సినిమాలు మొత్తంగా.. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 7 పురస్కారాలని సొంతం చేసుకోవడం జరిగింది. ఈ అవార్డులు రాబోయే కాలంలో తెలుగు చిత్రాలు రూపొందించే వారిలో స్ఫూర్తిని కలిగించడానికి ఎంతో దోహదపడతాయన్నది నిజం. 

హీరో నుంచి బిజినెస్‌మెన్ వరకు.. "సూపర్ స్టార్ మహేష్ బాబు" బర్త్ డే స్పెషల్

ఇక ఈ యేడు జాతీయ ఉత్తమ చిత్రంగా "హెల్లోరి" అనే గుజరాతి చిత్రం పురస్కారం అందుకోగా.. ఉత్తమ పాపులర్ చిత్రం కేటగిరిలో "బదాయి హో" చిత్రానికి పురస్కారం దక్కింది. ఉత్తమ హీరో పురస్కారానికి బాలీవుడ్‌కి చెందిన ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్‌లకి సంయుక్తంగా అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా "ఉరి - ది సర్జికల్ స్ట్రైక్" చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య ధార్ పురస్కారం అందుకోనున్నారు.

వీటితో పాటు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు -

ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌కిరే (చంబక్‌)

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బదాయ్‌ హో)

ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ (మరాఠీ)

ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్‌

ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో

ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి (నాల్‌: మరాఠీ)

జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌

జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌

జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌

ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ (పద్మావత్‌)

జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం (మలయాళం)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: కేజీఎఫ్‌ (కన్నడ)

ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ)

ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి (కన్నడ)

ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌

ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌ (బెంగాలీ)

ఉత్తమ గాయని: బిందుమాలిని (నాతి చరామి: మాయావి మానవే)

ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌ (పద్మావత్‌: బింటే దిల్‌)

ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా (కన్నడ)

జాతీయ పురస్కారాలు అందుకున్న విజేతలకు POPxo తెలుగు తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

వన కన్యలా మెరిసిన గీతా మాధురి.. మెటర్నిటీ ఫొటోషూట్ చూశారా?