Bigg Boss

Bigg Boss Telugu 3: శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి & రవికృష్ణలలో.. కొత్త కెప్టెన్ ఎవరు?

Sandeep Thatla  |  Sep 26, 2019
Bigg Boss Telugu 3: శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి & రవికృష్ణలలో.. కొత్త కెప్టెన్ ఎవరు?

(Sreemukhi, Baba Bhaskar, Ravi Krishna and Shiva Jyothi are in Captain Race)

ఈ ఆదివారంతో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.. 10 వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా ఫేక్ ఎలిమినేషన్ పేరుతో ఇంటిసభ్యులకి తెలియకుండా.. రాహుల్ సిప్లిగంజ్‌‌కి రెండు రోజుల పాటు ఓ ప్రత్యేకమైన గదిలో చోటు కల్పించారు.

అలాగే మంచి స్నేహితులైన రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్‌‌ల మధ్య వివాదం ఏర్పడింది. అన్నింటి కన్నా ముఖ్యంగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో అలీ రెజా.. మరోసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి అందరినీ షాక్‌కి గురిచేశాడు. 

Bigg Boss Telugu 3: అలీ రెజా రీ-ఎంట్రీతో.. బిగ్ బాస్ ఇంటిసభ్యులు షాక్?

ఈ మూడు పరిణామాల నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో తగుతున్న జోష్.. ఒక్కసారిగా తిరిగి వచ్చినట్లయింది. ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న నలుగురు సభ్యులలో ముగ్గురు.. ఇప్పుడు కెప్టెన్సీ రేసులో ఉండడం గమనార్హం. అలాగే కెప్టెన్సీ రేసులో భాగంగా జరిగిన ఎంపిక కూడా.. చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా టాస్క్‌లో మంచి ప్రదర్శనను కనబరిచిన జంట శ్రీముఖి, రవికృష్ణలతో పాటు.. అదే టాస్క్‌లో మంచి వినోదాన్ని పంచిన బాబా భాస్కర్.. అలాగే  టాస్క్‌లో కీలకమైన వీలునామాను తనవద్దే దాచుకున్న శివజ్యోతి ఈ రేసులో ఉన్నారు.

ఇక ఈ నలుగురిలో.. శివజ్యోతి మినహా మిగతా ముగ్గురు సభ్యులు కూడా.. ఈ వారం నామినేషన్స్‌లో ఉండడం గమనార్హం. మరి ఈ ముగ్గురిలో ఎవరైనా కెప్టెన్సీ టాస్క్ గెల్చుకుని.. ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్ అవ్వగలిగితే.. వారు వచ్చే వారం నామినేషన్స్ నుండి ఉపశమనం పొందుతారు. దీన్నిబట్టి ఈ నలుగురికి కెప్టెన్సీ  గెలవడం ఎంత కీలకమో తెలుస్తోంది. మరి ఈ టాస్క్ ఎవరు గెలుస్తారో.. ఈ రోజు తేలిపోనుంది. 

ఇదిలావుండగా.. మొన్న రాహుల్, వరుణ్‌ల మధ్య జరిగిన వివాదం కారణంగా.. వీరి మధ్య ఎటువంటి మాటలూ లేకుండా పోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గొడవ కారణంగా.. పునర్నవి సైతం వరుణ్ సందేశ్, వితికలతో మాట్లాడం ఆపేసింది. మొన్నటివరకు ప్రాణ స్నేహితుల్లా కలిసున్న వీరంతా.. ఒక చిన్న వివాదం కారణంగా ఒకరికొకరు దూరమైపోయారు.

ఇదే అంశంపై రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ “వారు మళ్ళీ ఈ టాపిక్ నా ముందు ప్రస్తావిస్తే.. అది తప్పకుండా గొడవే అవుతుంది” అని తెలిపాడు. అలాగే “తన వ్యక్తిత్వం గురించి కామెంట్స్ చేయడం.. తనకి ఏమాత్రం నచ్చలేదని.. కావాలంటే ఈ విషయమై ఎంతవరకైనా పోరాడతాను” అని తను నిర్మొహమాటంగా చెప్పేశాడు. 

Bigg Boss Telugu 3: రాహుల్ హౌస్‌‌లోకి రావడంతో.. డల్ అయిన శ్రీముఖి!

వితిక కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ – “వరుణ్, రాహుల్‌ల మధ్య వివాదం జరిగితే.. పునర్నవి మాతో మాట్లాడడానికి ఏంటి సమస్య? వరుణ్‌‌తో తను మాట్లాడడం లేదు. కనీసం మా పక్కనున్న బెడ్స్ పై కూడా పడుకోవడం లేదు. నాకు ఏం చెప్పాలో అర్ధమవట్లేదు” అని శ్రీముఖితో తన భావాలను పంచుకుంది. అయితే వీరి మధ్యనున్న దూరం సమసిపోతుందో లేదో కాలమే నిర్ణయించాలి.  అలాగే వీకెండ్‌లో నాగార్జున వీరి సమస్యని ఎలా  పరిష్కరిస్తారో కూడా చూడాలి.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీముఖి – రవికృష్ణలకి సంబంధించిన పెళ్లి చూపుల సన్నివేశం.. ఇంటి సభ్యులని కడుపుబ్బా నవ్వించిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా బాబా భాస్కర్.. ఆ సమయంలో చేసిన కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఆ కామెడీనే తనని ఈ టాస్క్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచేలా చేసింది.

చివరిగా.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ వారం కెప్టెన్ అయ్యే వ్యక్తి..  ఇంట్లో మరో రెండు వారాలు తప్పక ఉంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. 

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. వరుణ్ సందేశ్ & రాహుల్ సిప్లిగంజ్‌ల మధ్య గొడవ

 

Read More From Bigg Boss