
Amala Paul to act in Telugu Remake of ‘Lust Stories’
నెట్ ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా విడుదలై.. ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన చిత్రం “లస్ట్ స్టోరీస్”. ఇందులో పలు బోల్డ్ సన్నివేశాలలో నటించిన కైరా అద్వానీ పలు విమర్శలతో పాటు ప్రశంసలను కూడా అందుకుంది. అలాగే అందులోని ఆమె పాత్ర ఎన్నో చర్చలకు కూడా దారితీసింది. ఇప్పుడు అదే వెబ్ సిరీస్‌ను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారట. ఈ సిరీస్‌లో కైరా అద్వానీ చేసిన పాత్రను తెలుగులో చేసేందుకు.. నిర్మాతలు అమలాపాల్‌ని సంప్రదించారని సమాచారం.
ఆనాడు ‘మహానటి సావిత్రి’ పాత్ర కోసం.. అమలా పాల్‌కి ఆఫర్..?
అమలా పాల్‌కు బోల్డ్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ఈ సంవత్సరం ఆమె తమిళంలో నటించిన “ఆడై” చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ చిత్రంలోని సగ భాగం సన్నివేశాలలో నగ్నంగా నటించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది అమలా పాల్. ఇదే చిత్రాన్ని తెలుగులో “ఆమె” పేరుతో తెరకెక్కించారు. ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో అమలా పాల్ గతంలోనూ నటించింది. 2009లో ‘నీలి తామర’ చిత్రం ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమలా పాల్.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషలలో నటించింది.
సినిమా రివ్యూ: స్టీరియోటైప్స్ బ్రేక్ చేసిన.. వినూత్న ప్రయోగం “ఆమె”
తమిళంలో ఆమె నటించిన సింధు సమవేలి, మైనా లాంటి చిత్రాలలో.. ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘మైనా’ చిత్రంలో ఆమె నటనకు గాను.. తమిళనాడు ప్రభుత్వం చేత ఉత్తమ నటిగా రాష్ట్ర పురస్కారం కూడా అందుకుంది. ఇదే మైనా చిత్రం తెలుగులో ‘ప్రేమఖైదీ’ పేరుతో విడుదలైంది. అయితే తర్వాతి కాలంలో అమలా పాల్ టాలీవుడ్‌లో పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాలలో కూడా నటించడం ప్రారంభించింది.
తెలుగు సినిమాల విషయానికి వస్తే.. బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, జెండా పై కపిరాజు లాంటి చిత్రాలలో నటించింది అమలా పాల్. అయితే రామ్ చరణ్ సరసన నటించిన “నాయక్”.. అల్లు అర్జున్ సరసన నటించిన “ఇద్దరమ్మాయిలతో” చిత్రాలు తనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ధనుష్ హీరోగా నటించి.. తెలుగులో కూడా డైరెక్ట్ రిలీజ్‌గా విడుదలైన “విఐపి 2” చిత్రంలో కూడా నటించింది అమలా పాల్. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళ చిత్రం ఉన్నాయి.
అవును.. ప్రేమలో ఉన్నా.. అతడు నా బాధను మర్చిపోయేలా చేశాడు : అమలాపాల్
ఇక లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ విషయానికి వస్తే.. ఈ సిరీస్‌ను నలుగురు తెలుగు డైరెక్టర్లు తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నందినీ రెడ్డి.. ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఉందనేది సోషల్ మీడియా టాక్. అలాగే ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా ఈ సిరీస్‌లో నటిస్తున్నారని వినికిడి. లస్ట్ సిరీస్ తెలుగు రీమేక్‌ని.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోన్నీ స్క్రూవాలా తెరకెక్కిస్తున్నారని కూడా పలు వెబ్ సైట్స్ ప్రకటించాయి.
Featured Image: Instagram.com/Amala Paul
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.