ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ తారలది..!

పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ తారలది..!

ప్రేమ వివాహం – అనగా ప్రేమికులిద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని.. ప్రేమతో రెండు కుటుంబాలను ఒప్పించి  చేసుకునే పెళ్లి (Marriage). ప్రేమ వివాహంలో జంటలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని.. వారిద్దరి మధ్య పొరపొచ్చాలే రావని అంటుంటారు. కానీ అర్థం చేసుకునే తత్వం.. ప్రేమించే గుణం ఉండాలే కానీ కేవలం ప్రేమ పెళ్లిళ్లే కాదు.. పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనూ ప్రేమ నిండి ఉంటుందని ఎన్నో జంటలు నిరూపిస్తున్నాయి.

అందులో చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మరి, ఇలా అరేంజ్డ్ మ్యారేజ్‌తో (Arranged marriage) ఒక్కటై.. ఆ తర్వాత ప్రేమ బంధంతో అల్లుకుపోయి.. పొదరిల్లులా జీవితాన్ని సాగిస్తున్న కొందరు సెలబ్రిటీ (celebs) జంటల గురించి తెలుసుకుందామా..

Instagram

ADVERTISEMENT

1. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి

ఎన్టీఆర్ టాలీవుడ్‌లో అనేకమందికి అభిమాన హీరో. అతడి మనసును దోచుకున్న అమ్మాయి లక్ష్మీ ప్రణతి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. 2011 మే 5 తేదిన వీరిద్దరి వివాహం జరిగింది. పెళ్లి సమయానికి ప్రణతి వయసు 19 సంవత్సరాలే. కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే.. అమ్మాయికి పెళ్లి చేయడం పట్ల అప్పట్లో చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తొమ్మిదేళ్ల వయసు తేడా ఉన్నా.. ఇద్దరిలో ప్రేమ ఉంటే చాలు.. వయసు పెద్ద మ్యాటర్ కాదని నిరూపించారిద్దరూ. వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు ముద్దొచ్చే పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కూడా కలిగారు.

నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య

Instagram

ADVERTISEMENT

2. అల్లరి నరేష్ – విరూప

ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా.. చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. కామెడీ హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించిన అల్లరి నరేష్ చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ విరూపను 2015 మే 29 తేదిన పెళ్లాడాడు. సినిమాలంటే అస్సలు అవగాహన లేని అమ్మాయి విరూప. పెళ్లినాటికి నరేష్ సినిమాలేవీ ఆమె చూడలేదట. అలాంటి అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరిది కూడా పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి అయాన ఇవిక అనే కూతురు ఉంది.

Instagram

3. ధనుష్ – ఐశ్వర్య

పెళ్లైన జంటల ప్రేమ గురించి చెప్పాలనుకుంటే.. అందులో ధనుష్, ఐశ్వర్యల పేరు తప్పకుండా వినిపిస్తుంది. ధనుష్ కోలీవుడ్ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకుంటున్న రోజుల్లోనే.. ఐశ్వర్యతో ఆయనకు వివాహమైంది. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్లికి ముందే వీరిద్దరు కలిసినా.. సహజంగా మాట్లాడుకున్నారే తప్ప ప్రేమనే ప్రసక్తే వారి మధ్య రాలేదట. కానీ ఇప్పుడు పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత.. ‘ఆదర్శ దంపతులంటే వీరే’ అని అభిమానులు మాట్లాడుకొనే స్థాయికి వెళ్లిపోయారు. వీరి ప్రేమకు గుర్తుగా వీరిద్దరికీ యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. 

ADVERTISEMENT

ఉత్తమ భర్తలు అంటే వీరేనేమో.. ఎందుకో తెలుసా?

Instagram

4. గోపీచంద్ – రేష్మ

గోపీచంద్ ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ కుమారుడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు సినిమాల్లోకి వచ్చిన గోపీచంద్ రణం, శౌర్యం, లౌక్యం వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మను 2013 మే 12న వివాహమాడాడు గోపీచంద్. ఆమె అమెరికాలో తన చదువులు కొనసాగించింది. వీరిద్దరికి కూడా ఎనిమిదేళ్లు వయసులో తేడా ఉండడం విశేషం. అయితేనేం.. తమ ప్రేమ, అన్యోన్యతతో అందరికీ కపుల్ గోల్స్ అందిస్తున్నారీ జంట. వీరిద్దరికీ విరాట్ అనే బాబు కూడా ఉన్నాడు.

ADVERTISEMENT

Instagram

5.ఆది – అరుణ

తెలుగు సినిమాలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సాయి కుమార్ కొడుకు ఆది. హీరోగా చాలా సినిమాల్లో తను నటించాడు. ఈ హీరోది కూడా పెద్దలు కుదిర్చిన వివాహం. 2014 డిసెంబర్‌లో ఆది పెళ్లి జరిగింది. ఆది, అరుణల జంట కూడా చూసేవాళ్లకు కన్నులపండువగా ఉంటుంది. వీరిద్దరి కెమిస్ట్రీ అలాంటిది మరి. వీరిద్దరికీ ఓ ముద్దులొలికే పాప కూడా ఉంది. తన పేరు అయాన.

నాకు మీరాకి మధ్య గొడవ.. దాదాపు పదిహేను రోజులుంటుంది: షాహిద్ కపూర్

ADVERTISEMENT

Instagram

6.శ్రీజ – కల్యాణ్ దేవ్

శ్రీజ.. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కుమార్తె. ఆమె పెళ్లి వ్యవహారం గురించి తెలుగునాట అందరికీ తెలిసిందే. అప్పట్లో శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న శ్రీజ.. నివృత్తి అనే పాపకి కూడా జన్మనిచ్చింది. కానీ పాప పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు అంతకుముందు పెళ్లయిందని తెలిసినా కల్యాణ్ దేవ్ తనని పెళ్లాడాడు. పెళ్లి సమయానికి కల్యాణ్ బిజినెస్ చేస్తున్నా.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. 2017 మార్చిలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరిద్దరికీ నవిష్క అనే పాప కూడా ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరూ పెళ్లికి ముందు క్లాస్ మేట్స్ కూడానట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

08 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT