నాకు మీరాకి మధ్య గొడవ.. దాదాపు పదిహేను రోజులుంటుంది: షాహిద్ కపూర్

నాకు మీరాకి మధ్య గొడవ.. దాదాపు పదిహేను రోజులుంటుంది: షాహిద్ కపూర్

బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరు షాహిద్ కపూర్ (Shahid kapoor), మీరా (Mira).  వీరిద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో.. వీరి కెమిస్ట్రీ కూడా అంతే అందంగా ఉంటుంది. ఇద్దరు ముద్దుల పాపాయిలకు తల్లిదండ్రులైనా చూసేందుకు కొత్తగా పెళ్లయిన జంటలాగే ఉంటారు వీరిద్దరూ. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తారు. ఒకరితో మరొకరు ఎంతో రొమాంటిక్‌గా ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తుంటారు.

మీరా సినీనటి కాకపోయినా షాహిద్, మీరాల జంటకున్న క్రేజ్.. ఏ సెలబ్రిటీ జంటకూ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా, అన్యోన్యంగా, రొమాంటిక్‌గా కనిపించే ఈ జంట మధ్యలో ఎప్పుడూ గొడవలే అవ్వవా? అన్న అనుమానం మనకు రావడం సహజం. దీనికి తనదైన సమాధానం చెప్పుకొచ్చాడు షాహిద్.

Instagram

తాజాగా నేహా ధూపియా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షోలో పాల్గొన్న షాహిద్.. తనకు మీరాకు మధ్య జరిగే గొడవల గురించి చెప్పుకొచ్చాడు. "నేను నా భార్య మీరాతో గొడవ పడినప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలవుతాను. అది నన్నెంతో ఇబ్బంది పెడుతుంది. దాన్ని మర్చిపోవడానికి నాకు చాలా సమయం పడుతుంది. మేం రెండు మూడు నెలల్లో ఒక్కసారే గొడవ పడతాం. కానీ అలా గొడవ పడినప్పుడు మాత్రం.. మా గొడవ చాలారోజుల పాటు ఉంటుంది. ఒక్కోసారి పదిహేను రోజుల పాటు కూడా అలా ఒకరిపై మరొకరు కోపంగా ఉంటాం. ఈ సమయంలో ఇద్దరి మధ్యా పెద్దగా మాటలు ఉండవు. టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఆఖరికి ఒకరోజు దాని గురించి ఇద్దరం మాట్లాడుకొని సమస్యను సాల్వ్ చేసుకుంటాం" అని చెప్పారు.

Instagram

అంతేకాదు.. భార్యాభర్తల మధ్య గొడవలు ఎంతో ముఖ్యమైనవని షాహిద్ చెప్పుకొచ్చాడు. "భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం ఎంతో అవసరం. మనకంటూ ఓ అభిప్రాయం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇద్దరి మధ్యా బేధాభిప్రాయాలు ఉండడం అవసరం. ఆ సమస్య గురించి ఇద్దరూ మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఇద్దరూ కలిసి వాటిని అధిగమించడం అవసరం" అంటూ చెప్పాడు.

గతంలో కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పుడు కూడా షాహిద్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇద్దరి మధ్యా గొడవలు జరిగినప్పుడు ఎలా పరిష్కరించుకుంటారన్న ప్రశ్నకు షాహిద్ జవాబిస్తూ "ఒకవేళ నా భార్యకి కోపం వస్తే నేను సారీ చెబుతాను.. నాకు కోపం వచ్చినా కూడా నేనే సారీ చెబుతాను"  అని ఫన్నీగా చెప్పడం విశేషం.

Instagram

జులై 2015 లో వివాహమాడిన షాహిద్, మీరాల జంటకు మిషా, జైన్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. ఈ పిల్లల గురించి కూడా ఈ షోలో మాట్లాడాడు షాహిద్. జైన్ గురించి మాట్లాడుతూ "తను నాకంటే చాలా అందంగా కనిపిస్తాడు. తనకు నావి, మీరావి ఇద్దరి పోలికలు వచ్చాయి. పుట్టుకతోనే ఎక్కువ జుట్టుతో పుట్టడం వల్ల, నా పోలికలు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది వాడు నాలా ఉన్నాడు అంటుంటారు. కానీ తనవి మీరా పోలికలని నా ఫీలింగ్. అద్భుతమైన లుక్స్ తనకున్నాయి. తను చాలా అందంగా ఉంటాడు. తనని చూసినప్పుడల్లా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి తనేనేమో అనిపిస్తూ ఉంటుంది" అని వివరించాడు.

Instagram

ఇక మిషా గురించి చెబుతూ "మిషాకి నాకు మధ్య ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది. కూతురు ఉన్న తండ్రులు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. జైన్ విషయంలో నాకు కొడుకు కంటే ఓ స్నేహితుడు ఎక్కువగా కనిపిస్తుంటాడు. కానీ మిషాతో ఆ ఫీలింగ్ వేరు. తనకు తండ్రిగా ఉండడం నాకెంతో గొప్ప ఫీలింగ్. తనని చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది" అంటూ తన పిల్లల గురించి చెప్పుకొచ్చాడు షాహిద్.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

ఇవి కూడా చదవండి. 

బాలీవుడ్ తారల.. వింత అలవాట్ల గురించి మీకు తెలుసా?అలా అయితే పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉండేవారు : శ్రుతి హాసన్నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్‌కిడ్ గురించి మీరు త‌ప్ప‌క‌ తెలుసుకోవాల్సిందే.. !