ADVERTISEMENT
home / Astrology
23 జులై 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

23 జులై 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (జూలై 23) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు వ్యాపారస్తులు చాలా స్మార్ట్ వర్క్ చేయాలి. డబ్బుని పెట్టుబడి పెట్టేముందు నూటికి పది సార్లు ఆలోచించాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండండి. మీ ఐడియాలను వారు కొట్టేయాలని చూస్తున్నారు. ఉద్యోగస్తులు కాస్త ఎనర్జిటిక్‌‌గా పని చేయడం మంచిది. అలాగే ప్రేమికులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఆఫీసులో పరిస్థితులు నెగటివ్‌గా ఉన్నా.. మీరు మాత్రం పాజిటివ్‌గా ఆలోచించండి. కొందరు మిమ్మల్ని అధిగమించాలని చూస్తున్నా.. అది వారి అపోహ మాత్రమే. మీరే అంతిమ విజేతలు. ఇక బిజినెస్ చేసే వ్యక్తులు.. పలు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటారు. అదీ ఒకందుకు మంచిదే. మీకు తెలియని అంశాలపై అవగాహన వస్తుంది. అలాగే ఈ రోజు మీ మిత్రులతో కలిసి పార్టీలో హుషారుగా పాల్గొంటారు.   

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

ADVERTISEMENT

మిథునం (Gemini) – ఈ రోజు మీ పేరెంట్స్ ఆరోగ్యం పై శ్రద్ద పెట్టండి. వీలుంటే.. ఓ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోండి. ఇక ఆఫీసు విషయానికి వస్తే.. మీ పనికి మంచి గుర్తింపు లభించబోతుంది. మీరు మీ సక్సెస్ మంత్రా ఏమిటో.. మీ సహోద్యోగులతో పంచుకోనున్నారు. ఇక వివాహితులకు ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే వాహన వినియోగంలో తస్మాత్ జాగ్రత్త సుమా. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు చేసే పని పట్ల నిర్లక్ష్యంగా ఉండద్దు. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నెగటివ్ ఆలోచనలను వీడండి. ప్రతికూల ఆలోచనలు మనస్సుపై ప్రభావం చూపుతాయి. అలాగే వివాహితులకు తమ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఇంకా కష్టపడి చదవాలి. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) –  యువత ఈ రోజు తమ క్రియేటివిటీకి పదును పెడతారు. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది శుభ సమయం. అలాగే రాజకీయ రంగంలోని వారికి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. వివాహితులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. 

ADVERTISEMENT

క‌న్య (Virgo) –  ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగులకు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులపై మొగ్గు చూపుతారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీరు ఈ రోజు దూర ప్రయాణాలు చేస్తారు. వివాహితులకు తమ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ భాగస్వామి  కెరీర్ విషయంలో.. మీరూ తోడ్పడండి. 

తుల (Libra) – ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆఫీసులో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు, యువతకు సృజనాత్మక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తిపరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు వ్యాపారస్తులు, కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. కనుక సహనంతో వ్యవహరించండి. అనుమానం ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం మానుకోండి. విద్యార్థులకు పరీక్షలలో విజయం లభిస్తుంది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ADVERTISEMENT

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు అధికారులు మీ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారు. అలాగే వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులున్నా.. వాటిని అధికమించగలుగుతారు. ముఖ్యంగా సరైనా అగ్రిమెంట్లు లేకుండా పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బెటర్. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ మీ భాగస్వామితో బంధం మరింత పటిష్టమవుతుంది. 

మకరం (Capricorn) – మీరు ఈ రోజు కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు. అలాగే వ్యాాపారులకు డబ్బు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఏజెంట్లకు లాభం ఉంటుంది. ప్రత్యర్థులే మీకంటే ముందంజలో ఉంటారు. అయితే మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. చట్టపరమైన విషయాలలో కాస్త అప్రమత్తతతో వ్యవహరించండి

కుంభం (Aquarius) –  ఈ రోజు మీ  కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. పిల్లలకు సంబంధించిన మంచి వార్తలు వింటారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదే విధంగా మీ భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ఊహించని పదవులు దక్కుతాయి. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు.

మీనం (Pisces) – ఈ రోజు డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనను వీడండి. అలాగే వ్యాపారంలో హెచ్చుతగ్గుల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులు ఆర్థిక విషయాలలో నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. అలాగే ఆఫీసు పనులు కూడా మందకొడిగా సాగుతాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

22 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT