ADVERTISEMENT
home / Astrology
ఈ రోజు రాశిఫలాలు.. మీకోసం ప్రత్యేకం..!

ఈ రోజు రాశిఫలాలు.. మీకోసం ప్రత్యేకం..!

ఈ రోజు (ఏప్రిల్ 13) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (Horoscope and Astrology) మీకోసం..

 

మేషం (Aries) – మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే ఈసారి మరో అడుగు ముందుకు వేసి కాస్త పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవే జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి.

వృషభం (Tarus) – ఇప్పటివరకు మీ వద్ద ఉన్నవాటిని టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడం వల్ల మీరు బాధపడుతున్నారు. ఒక్కసారి ముందడుగు వేసి చూడండి. మీరు అనుకున్నది సాధించడానికి ఈ ప్రపంచమంతా మీకు సహాయం చేస్తుంది.

ADVERTISEMENT

మిథునం (Gemini) – మీరు కోరుకున్న విలాసవంతమైన జీవితం మీ కళ్ల ముందు ఉంది. ఈ విషయంలో గతంలో మీకు వైఫల్యాలు ఎదురైనా.. ఇప్పుడు మాత్రం మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పక పొందుతారు. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు పొందుతారు.

కర్కాటకం (Cancer) – త్వరలో మీరు ఓ శుభవార్త వింటారు. అది మీ జీవితంలో అనేక సానుకూలమైన మార్పులకు కారణం అవుతుంది. అంతేకాదు.. మీ జీవితంలో మీరు చేయాల్సిన పనులు, సాధించాల్సిన అంశాల గురించి మీకు ఒక స్పష్టత వస్తుంది.

సింహం (Leo) – త్వరలో కెరీర్ లేదా ఇంటికి సంబంధించిన మార్పు మీ జీవితంలో జరగవచ్చు. అలాగే ఒక పర్సనల్ గిఫ్ట్, వారసత్వంగా వచ్చే సంపద కూడా మీరు ఊహించకుండానే మీ వద్దకు చేరుతుంది. అందుకే సంతోషంగా సమయం గడపండి.

క‌న్య (Virgo) – మీ చుట్టూ ఉన్నవారిలో అందరూ మీలాగే పాజిటివ్‌గా ఆలోచించకపోవచ్చు. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీరు కాస్త జాగ్రత్త పడితే చాలు.. మిగతా అంతా దానంతటదే సర్దుకుంటుంది.

ADVERTISEMENT

తుల (Libra) – ఏ అంశానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలోనైనా ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. అలా కాకుండా దురుసుగా లేదా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మీరే బాధపడాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఓపెన్ మైండ్‌తో ఉండడం మంచిది.

వృశ్చికం (Scorpio) – ప్రేమ అంటే ఎప్పుడూ అనుబంధాలకు సంబంధించిందే ఉండకపోవచ్చు. మనల్ని నెగెటివిటీ నుంచి పాజిటివ్ దిశగా ఆలోచించేలా చేసేది కూడా ప్రేమే అవుతుంది. సరైన పని చేసి దాని నుంచి సంతోషం పొందడం కూడా ఒక రకమైన ప్రేమే. మీకు త్వరలో రాబోయే విపత్తు నుండీ.. మిమ్మల్ని బాగా ప్రేమించే వ్యక్తి కాపాడనున్నారు. 

ధనుస్సు (Saggitarius) – మీ జీవితంలోకి మీరే అనవసరమైన భారాన్ని, అసందర్భమైన విషయాలను మోసుకొస్తున్నారు. ఫలితంగా మీకే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పనికి సంబంధించి జీవితాన్ని బ్యాలన్స్ చేసుకోవడం నేర్చుకోండి. మీకు సంతోషాన్ని ఇచ్చే అంశాల గురించి ఆలోచించండి.

మకరం (Capricorn) – మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మీ లక్ష్యాలను మీరు సాధించగలరు. కాకపోతే మీ కోపాన్ని కాస్త నియంత్రించుకుంటే మీ భవిష్యత్తు మరింత బాగుంటుంది.

ADVERTISEMENT

కుంభం (Aquarius) – మీకు లేదా మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తికి.. ఉన్న ఆలోచనల్లో వచ్చే మార్పు లేదా మనసు మారడం వల్ల ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఈ కారణంగా ఇతరులతో గొడవ పెట్టుకోవడం లేదా వాదనలకు దిగడం సరైంది కాదు.

మీనం (Pisces) – ప్రతిఒక్కరూ జీవితంలో.. ఏదో ఒక అనుభవాన్ని సొంతం చేసుకుంటూనే ఉంటారు. ఆ అనుభవం నుండి నేర్చుకునే పాఠాలు జీవితంలో ఎంతో ముఖ్యమైనవని గుర్తుంచుకోండి.

Credit: Asha Shah

ఇవి కూడా చ‌ద‌వండి

ADVERTISEMENT

ఈ రోజు రాశిఫలాలు చదవండి.. మీ రాశిఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా…?

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

12 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT