ఈ రోజు (మే 31) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. కానీ మీ ఆత్మవిశ్వాసం, ఎనర్జీతో దానిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. అయితే అధిక సమయం పనిలో గడపడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. మీ కుటుంబ సభ్యులు ఒకరు వారి వ్యక్తిగత కారణాలు, సమస్యల వల్ల ఇబ్బందిపడతారు. ఫలితంగా మీరు కూడా కాస్త బాధపడతారు. పరిష్కారం కనుగొనడంలో వారికి మీరు సహాయపడతారు.
వృషభం (Tarus) – ఆఫీసులో మీరు చేసే పని పక్కన పెట్టి.. కాసేపు మీ సహచరులు చెప్పేది కూడా పూర్తిగా వినండి. కొందరు మీ ప్రవర్తన కారణంగా మిమ్మల్ని జడ్జ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి ఫలితాలు మాత్రం వెంటనే రావాలని ఆశించకండి. ఈ రోజు మీ సీనియర్ మెంబర్ లేదా సహచరుల్లో ఒకరితో గొడవ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడితే మంచిది.
మిథునం (Gemini) – ఆఫీసులో మీకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వారు అందించే సహాయ, సహకారాలు మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తాయి. అంతేకాదు.. ఈ రోజు ఒక కొత్త డీల్ పై సంతకం కూడా చేస్తారు. మధ్యాహ్నం నుంచి అందరూ పని పూర్తి చేయాలన్న తొందరలో ఎక్కువ తప్పులు చేయడం వల్ల మీకు పని ఒత్తిడి పెరగచ్చు. మరోవైపు మీ తోబుట్టువుల కారణంగా కూడా మీకు మానసికంగా ఒత్తిడి కలగచ్చు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ప్లాన్ చేసుకున్న కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో జాప్యం జరగచ్చు. కానీ చివరికి మీరు కోరుకున్న ఫలితాలే మీకు లభిస్తాయి. కొన్ని ప్రజెంటేషన్స్, ఈ మెయిల్స్ మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసులో మీ జూనియర్స్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. సాయంత్రం సమయం చాలా సరదాగా గడుస్తుంది.
సింహం (Leo) – మీరు పనిపై సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం వల్ల ఎక్కడ పని అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కుటుంబ జీవితం కూడా సాఫీగా గడుస్తుంది. సాయంత్రం అయ్యేసరికి మీ కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉంటారు. సంతోషంగా సమయం గడుపుతారు.
కన్య (Virgo) – ఆఫీసులో ఈ రోజు మీకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీరు చేయాల్సిన పని కాస్త పూర్తైనా మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. జరగని వాటిని జరిపించేందుకు మరీ బలవంతంగా ప్రయత్నించకండి. సమయం వచ్చినప్పుడు కొన్ని పనులు వాటంతటవే జరుగుతాయి. పని విషయంలో మీ సహచరులు కొందరు మీ సలహా కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ భాగస్వామి కాస్త చిరాకుగా ఫీలవ్వచ్చు. వారికి అండగా ఉంటూ మీ ప్రేమాభిమానాలు అందించండి.
తుల (Libra) – ఈ రోజు మీ చుట్టూ ఉన్నవారు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న కారణంగా బిజీగా ఉంటారు. ఫలితంగా మీ చుట్టూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. దీనిని ఎంజాయ్ చేస్తూనే పని చేసేందుకు మీరు ఆసక్తి చూపిస్తారు. మరింత ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేస్తారు. ఈ రోజు నిర్వహించే ఏ సమావేశమైనా మీకు చక్కని ఫలితాన్ని అందిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సెన్సిటివ్‌గా ఉండండి. పనికి సంబంధించిన వ్యవహారాలు వారితో చర్చించకండి.
వృశ్చికం (Scorpio) – మీకున్న ఆలోచనలు, ఐడియాలను సవ్యమైన దారిలో పెట్టడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ రోజు మీ పని ఉంటుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కాస్త బాగోలేకపోవడం వల్ల మీ కేరింగ్ వారికి అవసరం అవుతుంది. మీ కుటుంబానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వండి.
ధనుస్సు (Saggitarius) – పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం అంత ఆశాజనకంగా ఉండవు. ఆఫీసులో మీ సహచరులు లేదా కొత్త వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అయితే ఇతరుల సహనాన్ని పరీక్షించకండి. మీ అలసట, చిరాకుని ఎవ్వరి పైనా ప్రదర్శించకండి. అవసరమైన విశ్రాంతి తీసుకోండి.
మకరం (Capricorn) – మీకు వచ్చే కొత్త ఐడియాలు, ప్రాజెక్ట్స్, కొత్త ఉద్యోగ అవకాశాల వల్ల పని మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇవన్నీ మీ ఆత్మవిశ్వాస స్థాయులను మరింత పెంచుతాయి. అయితే వీటికి సంబంధించిన విషయాలు ఎవ్వరితోనూ పంచుకోకపోవడమే మంచిది. మీ కుటుంబ సభ్యులు మీ మనసు చెప్పేది ఫాలో అవ్వమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కానీ కాస్త ఆలోచించి అడుగేయడం మంచిది.
కుంభం (Aquarius) – మీరు చేసే పనిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ కొత్త పనులు లేదా ప్రాజెక్ట్స్‌కు సంబంధించి ఓ కొత్త డైరక్షన్ లేదా స్పష్టత మీకు లభిస్తుంది. అలాగే పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అది మీకు ప్రయోజనాలు చేకూర్చే అవకాశాలున్నాయి. సహచరుల అభిప్రాయాలతో విభేదించకండి. సాయంత్రం సమయంలో మీకు ఏది సంతోషాన్ని అందిస్తుందో ఆ పని చేయండి.
మీనం (Pisces) – పనిలో మీ కష్టానికి, శ్రమకి తగిన గుర్తింపు మీకు ఈ రోజు లభిస్తుంది. ఈ క్రమంలో మీరు సాధించిన విజయాలను సెలబ్రేట్ కూడా చేసుకుంటారు. కానీ వాటి ప్రభావం మీరు చేయాల్సిన మిగతా పనులపై పడకుండా చూడండి. మీరు సాధించిన విజయాల పట్ల మీ కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు.
Credit : Asha Shah
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
ఇవి కూడా చదవండి
నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవితంలో జరిగే మార్పులను తెలుసుకోండి..!
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!