Advertisement

Bollywood

తన భర్త ఆఫర్ కి ‘NO’ చెప్పిన దీపిక పదుకొనే ..!

Sandeep ThatlaSandeep Thatla  |  Jan 13, 2019
తన భర్త ఆఫర్ కి ‘NO’ చెప్పిన దీపిక పదుకొనే ..!

దీపిక పదుకొనే (Deepika Padukone) – రణ్ వీర్ సింగ్‌ల (Ranveer Singh) జంట చూడముచ్చటగా ఉంటుంది. పైగా వీరిరువురి కలయికలో వచ్చిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించినవే. ఆ చిత్రాలే – రామ్‌లీల, బాజీరావు మస్తానీ & పద్మావత్ (Padmaavat). ఈ చిత్రాల్లో నటిస్తున్నప్పుడే చిగురించిన వీరి ప్రేమగా పెళ్లి వరకూ దారితీయడం విశేషం. గత ఏడాది చివర్లో వివాహబంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. దీనితో  వీరి ఆరేళ్ళ బంధానికి మూడుముళ్ళు పడినట్లయింది. ఇక వీరి వివాహ మహోత్సవం.. ఆ తరువాత జరిగిన రెసెప్షన్‌ల గురించిన వార్తలు మీడియాలో బాగానే హల్చల్ చేశాయి. వీరి పెళ్ళికి హాజరైన అతిధుల దగ్గర నుండీ & వీరు పెళ్లి రెసెప్షన్‌ కోసం ధరించిన వస్త్రాల వరకూ దాదాపు అన్ని అంశాలపై కూడా మీడియాలో డిబేట్స్ జరిగాయి. 

ఇక వీరి వివాహం జరిగిన కొన్నిరోజులకే రణ్‌వీర్ సింగ్ నటించిన సింబా (Simmba) చిత్రం విడుదలవ్వడంతో పాటు.. భారీ హిట్టవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 350 కోట్ల మేర వసూళ్ళు సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ హంగామా పూర్తికాక ముందే ఆయన నటించిన మరో చిత్రం గల్లీ బాయ్ (Gully Boy) ఫిబ్రవరి 14న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం పైన కూడా చాలా అంచనాలే ఉన్నాయి. ఇక దీపిక పదుకునే విషయానికి వస్తే.. యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్న ఛపక్ (Chappaak) చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.

అయితే ఈ తరుణంలోనే దీపికా పదుకొనేకి తన భర్త అయిన రణ్‌వీర్ సింగ్ చేయబోయే ఒక కొత్త చిత్రంలో.. ఆయన పక్కన భార్యగా నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ ఆఫర్‌ని దీపిక చాలా సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం. అయితే ఆ చిత్రానికీ ఓ ప్రత్యేకత ఉంది – 1983లో భారత క్రికెట్ జట్టుకి  వరల్డ్ కప్ దక్కిన సందర్భంలో.. ఆ జట్టుని నడిపించిన కపిల్ దేవ్ పైన రానున్న చిత్రం “83”లో నటించమని దీపికను కోరారట. ఈ సినిమాలో ఇప్పటికే కపిల్ దేవ్ పాత్రకి రణ్ వీర్ సింగ్‌ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో ఆయన భార్య పాత్రలో దీపిక నటిస్తే బాగుంటుందని భావించి.. ఆమెని సంప్రదించారట దర్శక-నిర్మాతలు.

ఇక దీపిక పదుకునే ఈ ఆఫర్‌ని తిరస్కరించడానికి ప్రధాన కారణం పాత్ర నిడివి అని తెలుస్తోంది. అదే సమయంలో ఆమె అభినయించడానికి  పెద్దగా ఆస్కారంలేని పాత్ర కావడంతో పాటు..   క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంలో దీపిక అవసరం ఎంతవరకు ఉంది అనే విషయంపై కూడా ఆమె ఒక అంచనాకి వచ్చి ఈ ఆఫర్‌కి నో చెప్పినట్లు పలువురు చెబుతున్నారు.

అయితే ఈ విషయానికి సంబంధించి.. దీపిక పదుకునే తీసుకున్న నిర్ణయం చాలా సమంజసమని విశ్లేషకులు తమ వాదనను వినిపిస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగత బంధం కారణంగా తనకి అంతగా ప్రాధాన్యం లేని పాత్రని  ఒప్పుకుని.. కెరీర్ పరంగా తప్పటడుగు వేయడం మంచిది కాదు కదా!

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ హాట్ న్యూస్: ఆ యువరాణి పాత్రకి.. దీపిక పదుకొనే గ్రీన్ సిగ్నల్

ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే బాటలోనే.. అమీ జాక్సన్!

మరో సవాల్ విసురుతున్న కంగనా రనౌత్ ‘మణికర్ణిక’