ADVERTISEMENT
home / Health
ఈ ఇంటి చిట్కాలతో మీ పిరియడ్ నొప్పులు.. సమస్యలు మాయమైపోతాయి..

ఈ ఇంటి చిట్కాలతో మీ పిరియడ్ నొప్పులు.. సమస్యలు మాయమైపోతాయి..

పిరియడ్ (periods).. ఆడవారిని నెలకోసారి పలకరించే బంధువులాంటిది. పిరియడ్ రాకపోవడం అనారోగ్యం అయితే పిరియడ్ రావడం ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కడుపు నొప్పి (cramps), నడుము నొప్పి, శరీరం మొత్తం నొప్పులు, మూడీగా అనిపించడం, చిరాకు వంటివన్నీ అందులో కొన్ని మాత్రమే. వీటన్నింటినీ తగ్గించడానికి చాలామంది మందులు వాడుతూ ఉంటారు. కానీ ఇస్టమొచ్చినన్ని మందులు వేసుకోవడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. ఒక సాధారణ మహిళ తన జీవితంలో అన్ని రోజులను కలుపుకుంటే కనీసం పది సంవత్సరాల సమయం పిరియడ్ లోనే కొనసాగిస్తుంది. మరి, ఆ పది సంవత్సరాలను అసౌకర్యంతో.. నొప్పితో గడపడం కంటే వివిధ ఇంటి చిట్కాల ద్వారా నొప్పితో పాటు ఇబ్బంది పెట్టే ఎన్నో సమస్యల నుంచి దూరం అవ్వొచ్చు

1. చామంతి టీ

చామంతి (చామొమైల్) టీ ఎన్నో అద్బుతాలు చేస్తుంది. ఇది పిరియడ్స్ సమయంలో మీ కడుపు నొప్పిని కూడా చాలా వరకూ తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ గుణాలు మీ గర్భాశయం కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. నొప్పి, వాపు వంటివి కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం చేయాల్సిందల్లా మీరు ఉదయాన్నే తాగే టీ బదులుగా చామొమైల్ పూలను తీసుకొని వాటి రెక్కలను తీసి అలాగే అలాగే శుభ్రం చేసి దాన్ని నీళ్లలో వేసి మరిగించాలి. అందులో కావాలంటే కాస్త తేనె చేర్చుకొని దీన్ని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. 

2. అల్లం నీళ్లు

అల్లం నీళ్లు తాగడం వల్ల వాంతులు, కళ్లు తిరగడం వంటివి తగ్గుతాయి. ఒక అంగుళం అల్లం ముక్కను నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లు చల్లబడిన తర్వాత తాగితే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. దాంతో పాటు వాంతులు తగ్గుతాయి. ఇది పిరియడ్ సైకిల్ ని రెగ్యులర్ చేస్తుంది. ఇదో అద్బుతమైన డ్రింక్ అని చెప్పుకోవచ్చు. కేవలం పిరియడ్ సమయంలో మాత్రమే కాదు.. మామూలుగా కూడా అల్లం వికారాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు కడుపుబ్బరం తగ్గడం వంటి ఎన్నెన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. 

ADVERTISEMENT

3. నువ్వుల నూనె

నువ్వుల నూనెలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నొప్పిని తగ్గించే గుణాలు చాలా ఉంటాయి. నువ్వుల నూనెతో మీ పొట్టపై బాగా మసాజ్ చేయడం వల్ల నొప్పి సులభంగా తగ్గుతుంది. నువ్వుల నూనెను మసాజ్ చేసుకోవడం వల్ల చర్మం  కూడా అందంగా మారుతుంది. మొటిమల వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దాంతో పాటు ఈ నూనెను వంటల్లో వాడడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. 

4. విటమిన్ డి

విటమిన్ డి ని రోజూ తీసుకోవడం వల్ల ప్రోస్టాగ్లాండ్లిన్ల ఉత్పత్తి తగ్గుతుంది. నొప్పులు కూడా తగ్గుతాయి. సాధారణంగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం కంటే దాన్ని చేపలు , గుడ్లు, ఛీజ్, నారింజ రసం వంటివాటి ద్వారా తీసుకోవచ్చు. లేదా రోజూ ఉదయాన్నే ఎండలో నిలబడడం.. క్యాల్షియం ఎక్కువగా అందే పదార్థాలు తినడం వల్ల కూడా లభిస్తుంది. 

ADVERTISEMENT

5. మెంతులు

మెంతులను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల నొప్పి, అసౌకర్యం వంటివన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే మెంతుల్లో లైసిన్, ట్రిప్టోఫాన్ వంటి ప్రొటీన్లు ఉంటాయి కాబట్టి ఇవి మందులా పనిచేసి ఇబ్బందిని తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మరింత మంచిది. 

6. ఫుట్ మసాజ్

మన పాదాల్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి పిరియడ్ నొప్పిని తగ్గిస్తాయి. ఇది మన మడమ ఎముక నుంచి మూడు అంగుళాల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల పిరియడ్ నొప్పి తో పాటు గ్యాస్, నిద్రలేమి, అలసట వంటివి తగ్గిస్తాయి.

7. పెప్పర్ మింట్ టీ

మిథనాల్ అనే గుణాలు ఉండడం వల్ల పెప్పర్ మింట్ టీ గ్యాస్ ని తగ్గించడం లో చాలా వరకూ తోడ్పడుతుంది. అందుకే పిరియడ్ సమయంలో గ్యాస్ బారిన పడేవారు పెప్పర్ మింట్ టీ తాగడం వల్ల గ్యాస్ తో పాటు ఒత్తిడి, అలసట కూడా తగ్గుతాయి.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

16 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT