ADVERTISEMENT
home / వెల్‌నెస్
ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోండి..

ఈ రోజు 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – మీరు ఇప్పటివరకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశించండి. అయితే అవే ఆలోచనలతో ఎక్కడికో వెళ్లిపోకుండా అందరితోనూ గౌరవప్రదంగా నడుచుకోండి. ఒక్కోసారి కాస్త గందరగోళంగా అనిపించినా తర్వాత మీకే స్పష్టత వస్తుంది.

వృషభం (Tarus) – మీ జీవితంలో ఇప్పటివరకు మీకు ఎదురైన అనుభవాలను అందరితోనూ పంచుకుంటూ వారికి కూడా ప్రేరణ కలిగించండి. మీరు కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్న తీరుని వివరించండి. మీ ఆర్థిక పరిస్థితులు తప్పక త్వరలో సర్దుకుంటాయి.

మిథునం (Gemini) – మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రశంసిస్తారు. అయితే మీ జీవితంలో ఇప్పుడు కొన్ని మార్పులు జరగవచ్చు. వాటి గురించి భయపడకండి. అవి మీ జీవితాన్ని మంచి దారిలో నడిచేలా మారుస్తాయి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – ఎవరైతే ప్రేమ లేదా పెళ్లి కోసం వేచి చూస్తున్నారో వారికి ఇది మంచి తరుణం. కొందరు తమ జీవిత భాగస్వామిని కలుసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మీకేది ముఖ్యమూ గమనించుకొని దాని ప్రకారం ముందుకు వెళ్లండి.

సింహం (Leo) – మీ జీవితంలో ప్రస్తుతం బ్యాలన్స్ చేయడం చాలా అవసరం. ఒకవేళ మీ పూర్తి ఏకాగ్రత మొత్తం పనిపైనే పెడితే కాస్త మీ ఆరోగ్యంపై కూడా దాన్ని మళ్లించండి. మీ గురించి మీరు శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి.

క‌న్య (Virgo) – మీరు మీ అనుబంధాల విషయంలో నిజాయితీగా, నమ్మకంగా ఉన్నంతవరకు ఎవరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరి విషయంలోనూ తొందరపడి మాట ఇచ్చేయకండి. పూర్తిగా నమ్మిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోండి.

తుల (Libra) – మీరు చేసే ఏ పని గురించైనా బ్యాలన్స్డ్ గా ఉండండి. ఇతరులు దాని గురించి ఏమనుకుంటారోనని అనవసరంగా ఆలోచించకండి. మీ ప్రాధాన్యాల ప్రకారం మీ పనులు చేసుకుంటూ వెళ్లండి.

ADVERTISEMENT

వృశ్చికం (Scorpio) – మీరు ఏ విషయం గురించైనా నిర్ణయం తీసుకునే ముందు దాని వల్ల కలిగే లాభనష్టాల గురించి కూడా ఆలోచించండి. సహనంతో వ్యవహరించండి. ఫోకస్ కలిగి ఉండండి. అప్పుడే మీ లక్ష్యాలను మీరు ఛేదించగలుగుతారు.

ధనుస్సు (Saggitarius) – మీ చుట్టూ ఉన్నవారిలో చాలామంది ఇతరుల గురించి వదంతులు వ్యాపిస్తూ చాలా నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు. మీరు వెంటనే వారి నుంచి దూరం జరగండి. లేదంటే వారు మిమ్మల్ని కూడా ప్రభావితం చేసి మార్చేసే అవకాశాలు లేకపోలేవు.

మకరం (Capricorn) – మీ జీవితంలో మీకు ఏం కావాలో, వాటిని ఎలా సంపాదించుకోవాలో మీకు ఒక స్పష్టత ఉంది. అయితే ఇప్పుడు మీరు ఉండే ప్రదేశంలో మార్పు రావచ్చు. అలాగే మీరు పెళ్లి లేదా నిశ్చితార్థం వంటి వేడుకలో పాల్గొనే అవకాశం కూడా ఉంది.

కుంభం (Aquarius) – మీరు ప్రస్తుతం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. అయితే మీ చుట్టూ ఉన్నవారు మీకు ఈ విషయంలో సహాయపడవచ్చు. అలాగే మీ తెలివితేటలను ఇతరుల కోసం కూడా ఉపయోగిస్తుండండి. ఫలితంగా సమాధానాలు మిమ్మల్నే వెతుక్కుంటూ రావచ్చు.

ADVERTISEMENT

మీనం (Pisces) – మీకు అవసరమయ్యే సపోర్ట్, నాలెడ్జ్ అందడమే కాకుండా మిమ్మల్ని సరైన దారిలో నడిపించే వ్యక్తిని మీరు కలుసుకుంటారు. ఈ కొత్త మార్గంలో మీకు ఎదురయ్యే రిస్క్ లను తీసుకోండి. అవి మిమ్మల్ని మరింత బెస్ట్ పర్సన్ గా మారుస్తాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

మీ రాశిఫ‌లాలు వీక్షించండి.. సరికొత్త జీవితానికి బాటలు వేయండి

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

ADVERTISEMENT

పుట్టిన తేదీ ప్ర‌కారం .. తండ్రుల మనస్తత్వాలను తెలుసుకుందామా…?

మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!

21 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT