ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ఈ స్మార్ట్ “గాజులు” ధరిస్తే చాలు.. అమ్మాయిలు సెల్ఫ్ సెక్యూరిటీ పొందినట్లే..!

ఈ స్మార్ట్ “గాజులు” ధరిస్తే చాలు.. అమ్మాయిలు సెల్ఫ్ సెక్యూరిటీ పొందినట్లే..!

ఈ రోజు నగరాల్లో అమ్మాయిల భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. మెట్రోపాలిటిన్ సిటీస్‌లో కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే .. ఇప్పటికే షీ టీమ్స్ ఈ సమస్యలను పరిష్కరించడం కోసం 24 గంటల హెల్ప్ లైన్‌తో పాటు.. ఫిర్యాదులు ఫైల్ చేయడానికి ఓ ఫేస్‌బుక్ పేజీని కూడా ప్రారంభించింది. అలాగే మహిళల భద్రత నిమిత్తం పలు మొబైల్ యాప్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 

మహిళలకు కోపం తెప్పించిన మ్యానిఫెస్టో.. వ్యాకరణ దోషాలతో వచ్చిన చిక్కు..!

ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటీవలే ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకపాటి సుచరిత ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సైబర్‌ మిత్ర, మహిళా మిత్ర కార్యక్రమాల్లో భాగంగా.. స్త్రీల భద్రత కోసం ఒక యాప్‌ను ప్రారంభించారు. టెక్నాలజీ దుర్వినియోగం వల్ల సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని ఆమె తెలిపారు. మన టెక్నాలజీని మంచి పనులకే ఉపయోగించాలని ఆమె కోరారు. నేటి యువత సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని.. సాంకేతికతను ఉపయోగించి జన జీవితాలను ప్రభావితం చేయాలని ఆమె తెలిపారు. 

తెలంగాణలో తొలి విమెన్ క‌మాండో టీంని ప్రారంభించిన క‌రీంన‌గ‌ర్ అధికారులు..!

ADVERTISEMENT

అవును.. టెక్నాలజీ అనేది సమాజానికి ఎంత చేటు చేస్తుందో.. అంతే మంచిని కూడా చేస్తోంది. ఎందరో యువకులు టెక్నాలజీని ఉపయోగించి.. కొత్త కొత్త పద్దతులను, పరికరాలను కనిపెడుతున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి (hyderabad) చెందిన గడి హరీష్ అనే యువకుడు ఇటీవలి కాలంలో అటువంటి ప్రయత్నమే చేశారు. స్త్రీల భద్రత కోసం.. వారి సెల్ఫ్ సెక్యూరిటీ కోసం ఒక స్మార్ట్ బ్యాంగిల్‌ను.. ఆయన తన స్నేహితుడి సహాయంతో కనిపెట్టారు. జీపీఎస్‌తో అనుసంధానమై ఉండే ఈ బ్యాంగిల్ వల్ల అనేక ఉపయోగాలున్నాయని.. ఆ విధంగా దానిని తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. 

 

Image : ANI

ADVERTISEMENT

హరీష్ కనిపెట్టిన ఈ స్మార్ బ్యాంగిల్‌కి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరైనా ఈ బ్యాంగిల్ ధరించిన అమ్మాయిలు అఘాయిత్యానికి గురైనప్పుడు.. వారు తమ చేతిని ఒక ప్రత్యేకమైన యాంగిల్‌లో ఆడిస్తే చాలు.. డివైజ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అవ్వగానే.. దానిని టచ్ చేసిన అవతలి వ్యక్తికి విద్యుత్ షాక్ తగులుతుంది. ఆ విధంగా.. తను ఆ అమ్మాయి నుండి దూరంగా కదిలేలా చేస్తుంది. విద్యుత్ ఆ బ్యాంగిల్ నుండి ప్రసరిస్తున్న సమయంలోనే.. ఆ బ్యాంగిల్ అంతర్భాగంలో ఉండే ట్రాకర్, జీపీఎస్ సిస్టమ్ మొదలైనవి కూడా యాక్టివేట్ అవుతాయి.                                           

మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

అవి అలా యాక్టివేట్ అవ్వగానే.. ఆ బ్యాంగిల్ నుండి సిగ్నల్స్ వెళ్తాయి. అవి స్థానిక పోలీస్ స్టేషనుతో పాటు బాధితురాలి బంధువులకు లైవ్ లొకేషనుతో పాటు.. అలర్ట్ మెసేజ్‌లను పంపిస్తాయి. దీనిని తయారుచేసిన హరీష్ మాట్లాడుతూ “మేము ఈ డివైజ్‌ను టెస్ట్ చేసి చూశాం. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ సహాయం ఉంటే దీనిని మార్కెట్‌లోకి తీసుకురావచ్చు”  అని తెలిపారు.                                                   

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

ADVERTISEMENT

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Featured Image: twitter.com/ANI and Pixabay

20 Aug 2019
good points

Read More

read more articles like this
ADVERTISEMENT